For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాక్షస పెళ్లిళ్లు ఇప్పటికీ జరుగుతున్నాయని మీకు తెలుసా..

బీహార్ రాష్ట్రంలో వరకట్న దురాచారం చాలా ఎక్కువగా ఉంది! కష్టపడి పనిచేసే తత్వం, కొంత చదువు, లేదా ఉద్యోగం ఉంటే చాలట.

|

పురాణాల్లో మనకు ఎనిమిది రకాల వివాహాల గురించి ప్రస్తావించారు. వాటిలో రాక్షస వివాహం ఒకటి. రాక్షస వివాహం అంటే రాక్షసుడు వచ్చి చేసుకునే పెళ్లి కాదు. తమ మనసుకు నచ్చిన అమ్మాయిని ఎత్తుకెళ్లి, అడ్డువచ్చిన వాడిని ఇష్టమొచ్చినట్లు దాడి చేసి పెళ్లి చేసుకుని తమ పంతం నెగ్గించుకోవడమే ఆ పద్ధతి. ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఆచారం ఎక్కడా మనకు కనిపించదు.

According to mythology

కానీ మనకు ఇంతకంటే వింత ఆచారం ఒకటి నడుస్తోందట. అది ఎక్కడో కాదు మన దేశంలో జరుగుతోందట. కాకపోతే ఆ ప్రాంతంలో తాము ఇష్టపడితే ఎత్తుకెళ్లేది పెళ్లికూతురిని కాదు. పెళ్లికుమారుడిని. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

1) ఆ సమయంలో బ్రహ్మచారులు బయటికి రాకూడదు..

1) ఆ సమయంలో బ్రహ్మచారులు బయటికి రాకూడదు..

ఇలాంటి ఆచారం బంధిపోట్లు ఎక్కువగా ఉండే బీహార్ రాష్ట్రంలో నడుస్తోందట. ఆ రాష్ట్రంలోని బేగుసరాయ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పెళ్లిళ్ల సీజన్ బాగా జోరుగా ఉన్న సమయంలో బ్రహ్మచారులు బయటికి రాకూడదంట. కానీ రాంబాబు(పేరు మార్చాం) అనే వ్యక్తికి వారి కుటుంబ సభ్యులు హెచ్చరించారట. అంతేకాదు సరిగ్గా పాతికేళ్లు నిండిన అతను పెళ్లికి ముందే తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, ఒక అందమైన ఇంటిని కట్టుకున్నాడు. మంచివాడు, బుద్ధిమంతుడు అనే పేరు తెచ్చుకున్నాడు.

pc : image curtosy

2) గుర్తింపే కొంప ముచ్చింది..

2) గుర్తింపే కొంప ముచ్చింది..

తనకు వచ్చిన గుర్తింపే తన కొంప కొల్లేరు చేస్తుందని ఏ మాత్రం గ్రహించలేకపోయాడు. ఓ మంచు కురిసే చీకటి వేళలో అలా వేడి టీ తాగొద్దామని బయటకు వచ్చాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక వాహనం అతని ముందు ఆగింది. అందులో ఉన్నవారు మెరుపు కన్నా వేగంతో దిగి అతని మొహానికి ఓ గుడ్డ కప్పేశారు. ఆ వెంటనే ఆ వాహనంలోకి ఎక్కించేశారు. తర్వాత అతనికి షాకింగ్ న్యూస్ చెప్పారు. ‘నవ్వు సంతోషపడాల్సిన సమయం ఇది. నీకు త్వరలో ఘనంగా పెళ్లి చేయబోతున్నాం‘ అంటూ చెప్పేశారు. దీంతో రాంబాబుకు ఎత్తుకొచ్చిన అల్లుడు (పకడో జమాయి)గా మారబోతున్నాడని అర్థమైపోయింది. దీంతో ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టాడు. దీంతో ఆ వాహనంలోని రౌడీలు పగలబడి నవ్వారు.

3) అబ్బాయిలను ఎత్తుకొచ్చి..

3) అబ్బాయిలను ఎత్తుకొచ్చి..

బీహార్ రాష్ట్రంలో వరకట్న దురాచారం చాలా ఎక్కువగా ఉంది! కష్టపడి పనిచేసే తత్వం, కొంత చదువు, లేదా ఉద్యోగం ఉంటే చాలట.అక్కడ పెళ్లి కానీ ప్రసాదులకు మంచి డిమాండ్ ఉంటుందట. వారి ధర కోట్లలో పలుకుతుందట. రోజురోజుకు దీని ప్రభావం పెరిగి భారం భరించలేని ఆడపిల్లల తరపువారు ఒక ఐడియాను తీసుకొచ్చారు. అదేంటంటే ‘పకడో జమాయి లేదా పకడో వివాహ్‘!. ఎర్రగా, బుర్రగా, అందంగా ఉన్న కుర్రోళ్లు కనబడితే చాలు వారిని ఎత్తుకొచ్చి వారి పిల్లకు అంటగట్టడమే ఈ వివాహం ప్రత్యేకత.

4) ఇది ఎక్కడ ప్రారంభమైందంటే..

4) ఇది ఎక్కడ ప్రారంభమైందంటే..

ఇదంతా ఆ రాష్ట్రంలోని భూమిహార్ అనే కులంలో ఈ ఆచారం మొదలైనట్టు చెబుతారు. ఎవరైనా అబ్బాయిని ఎత్తుకురావాలని నిర్ణయించుకున్నాక, స్థానిక మాఫియాకు డబ్బు సైతం అప్పచెబుతారట. కుర్రోడిని అత్యంత రహస్యంగా అపహరించే బాధ్యత వారిదేనట. పెళ్లికుమారుడిని ఇంటికి తీసుకురాగానే భయపెట్టో, బతిమాలో వివాహానికి ఒప్పిస్తారట. కాదని ఎదురుతిరిగితే అతనికి అక్కడే పెళ్లికి ఒప్పుకునే వరకు బడితే పూజ చేస్తారట. అతను కాస్త తగ్గాక.. వారి కొట్టిన దెబ్బలకు వారే పెళ్లి కళ రావడానికి పసుపు, చందనాలతో ముస్తాబు చేస్తారట. ఇలాంటి కిడ్నాప్ లను సమాజసేవగా భావించి, ఉచితంగా పెళ్ళిళ్లు చేసే పెట్టే యువజన సంఘటాలకు అక్కడ కొదవే లేదట.

5) చేసేదేమీ లేక..

5) చేసేదేమీ లేక..

మూడు ముళ్లు, ఏడడుగులు నడిచిన తర్వాత వరుడి తల్లిదండ్రులకు విషయం తెలుస్తుందట. అప్పుడు ఎంతో ఆవేశంతో తమ కుమారుడి కోసం వారు లగెత్తుకుని వచ్చినా ఫలితం ఉండదు. ఎందుకంటే ఊరు ఊరంతా వధువుకే అండగా ఉన్నారని తెలుసుకుని వారు మిన్నకుండిపోతారు. పోనీ పోలీసుస్టేషన్ కోసం వెళ్లి ఫిర్యాదు చేద్దామంటే వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందట. కానీ రచ్చబండ దగ్గరే ఏదో ఒక పరిష్కారం చేసుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడతారంట.

6) బిడ్డ పుట్టేంత వరకు..

6) బిడ్డ పుట్టేంత వరకు..

ఇక ఇలా బలవంతపు వివాహం అయ్యాక వరుడు విడాకుల కోసం కేసులు పెడితే.. మరోవైపు పెళ్లికూతురి తల్లిదండ్రులు, బంధువులు కూడా తమ బిడ్డను కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఎదురు కేసులు పెడతారంట. ఇలాంటి గొడవలు ఏమీ జరగకపోయినా పకడో వివాహ్ తర్వాత పెళ్లి కొడుకు, పెళ్లి కుమారుల కుటుంబాలు ఎడమొహం, పెడమొహంగానే ఉండిపోతాయి. బిడ్డ పుట్టాక పరిస్థితులు మెల్లగా సర్దుకుంటాయి.

7) బ్రహ్మచారులూ జాగ్రత్త..

7) బ్రహ్మచారులూ జాగ్రత్త..

బీహార్ రాష్ట్రంలో పట్టపగలు వయసులో ఉన్న బ్రహ్మచారులు ఒంటరిగా తిరిగితే అంతే సంగతులు. ఎందుకంటే ఈ మధ్యే పకడో వివాహ కోసం వరుడిని అపహరించుకుని వచ్చేందుకు భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తున్నారు. తర్వాత వారి సంసారంలో ఎలాంటి కలహాలు వచ్చినా తామే వారిద్దరికీ నచ్చచెబుతాం అని కూడా చెబుతున్నారట. ఇలా గతేడాది సుమారు నాలుగు వేల మందికి ‘రాక్షస వివాహాలు‘ జరిగాయి.

PC : Image curtosy

English summary

According to mythology, interesting facts about monster weddings

The abduction of boys for marriage is as direct consequence of social evils like dowry. It is a rearguard action from the bride's family. Which finds itself under a great material load of arranging decent marriages. In a traditionally patriarchal society like we have in Bihar, marriages have long become a money-minting enterprise for the boy's parents.
Desktop Bottom Promotion