Just In
- 6 min ago
వైరల్ వీడియో : మందు బాబులం.. మేమే మహారాజులం.. అంటున్న చిన్నారులు..
- 58 min ago
ఆ కార్యంలో కలకాలం కచ్చితంగా సక్సెస్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...
- 1 hr ago
డయాబెటిస్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం లేదా? మరి పరిష్కారం ఏంటి?
- 3 hrs ago
నిలబడి తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? మీ సందేహానికి సమాధానం ఇక్కడ ఉంది
Don't Miss
- Technology
ఐఫోన్ ఎస్ఈ2 రావడం లేదు,దాని బదులు ఐఫోన్ 9 వస్తోంది
- Sports
ఆప్ఘన్ బోర్డు కీలక నిర్ణయం: రషీద్ ఖాన్‌కు డిమోషన్, కెప్టెన్‌గా అస్గర్
- News
అత్యాచారానికి ఉరిశిక్ష... ఏపి దిశ చట్టానికి క్యాబినెట్ ఆమోదం
- Movies
నాగబాబు చేసిన పనితో ఆ నటుడి కోసం వెతుకుతున్న జబర్ధస్త్ టీమ్.. రీప్లేస్ చేయనిది అందుకే.!
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Automobiles
కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ప్రేమకు వయసుతో సంబంధం లేదా.. దీనికి సమాధానం మన సెలబ్రిటీల దగ్గరే ఉందని మీకు తెలుసా..
''ప్రేమ మరియు యుద్ధం చాలా క్లిష్టమైనవి'' అని చాలా మంది చెబుతుంటారు. ఈ రెండింటికి సరైన వయస్సులోనే అర్హత అనేది వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ కొందరు ప్రేమికులు మాత్రం ఇలా అంటున్నారు. మాకు యుద్ధం గురించి తెలియదు. కానీ ప్రేమలో అయితే వయసు పట్టింపు అనేది కచ్చితంగా లేదంటున్నారు.
అలా బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ప్రేమలో ఉండే వారికి వయస్సు వ్యత్యాసం ఉండదని చెప్పడమే కాదు నిరూపించారు.టాలీవుడ్ లో నాగార్జున మరియు అమల, మహేష్ మరియు నమ్రత నుండి బాలీవుడ్ లో షాహిద్ మరియు మీరా, మిలిందా, అంకిత వంటి సెలబ్రిటీలు దీన్ని నిజం చేసి చూపించారు. వారంతా హాయిగా కలిసి మెలసి జీవిస్తున్నారు.
View this post on InstagramHold the lift 📸 @anaitashroffadajania
A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on Aug 25, 2019 at 6:42am PDT
ప్రస్తుత సమాజంలో ఏదైనా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు లేదా పెళ్లి చేసుకునేటప్పుడు స్త్రీ కంటే పురుషుడు పెద్దవారై ఉంటారని నమ్ముతారు. కానీ మీరు డేటింగ్ చేస్తున్న పురుషుడు లేదా స్త్రీ మీ కంటే పదేళ్లు లేదా 20 ఏళ్లు పెద్దది అయినప్పుడు సమాజం దానిని ఒప్పుకోదు. ఇలాంటి జంటలపై ప్రజలు పలు అనుమానాలను రేకెత్తిస్తారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా, వినూత్నంగా భాగస్వాములను కోరుకుంటున్నారు.
View this post on InstagramA post shared by Milind Usha Soman (@milindrunning) on Jul 26, 2019 at 8:11am PDT
వాస్తవానికి ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. రామాయణ కాలం నాటి నుండే ఉంది. శ్రీ రాముని కంటే సీతాదేవి వయసులో పెద్దది అని చాలా మందికి తెలీదు. అంతేందుకు ఈ కలియుగంలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన భార్య కంటే ఆరేళ్లు చిన్నవాడు. మీకు మరిన్ని ఉదాహరణలు కావాలంటే లేటెస్ట్ జంటలను కూడా చూడొచ్చు. షాహిద్ కపూర్ మరియు మీరా రాజ్ పుత్ లకు దాదాపు 14 సంవత్సరాల వయస్సు అంతరం ఉంది. అయినా వారు ఇప్పటికీ ఆనందంగా కలిసి మెలసి ఉంటున్నారు. ఇక సీనియర్ల విషయానికి వస్తే మిలింద్ సోమన్ మరియు అంకితా కొన్వర్ల మధ్య ఏకంగా 26 సంవత్సరాల వయస్సు అంతరం ఉంది. ఇక టాలీవుడ్ లోనూ మహేష్ బాబు కంటే అతని భార్య మూడేళ్లు పెద్దది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇకపై వయసు అంతరం గురించి చింతించకండి. ఎందుకంటే రిలేషన్ షిప్ కు వయసు అనేది పెద్ద మ్యాటర్ కానే కాదు.

1) అనుభవంతో దేన్నీ బీట్ చేయలేరు..
మీరు మీ చుట్టూ ఉన్న కొత్త విషయాలను అనుభవంలోకి తీసుకుని అర్థం చేసుకుంటుంటారు. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తికి 15 ఏళ్ల వ్యక్తి కంటే ఎక్కువ అనుభవం ఉంటుంది. అందువల్ల ఒకరినొకరు మార్గనిర్దేశం చేయవచ్చు లేదా వారు కఠినమైన పరిస్థితుల్లోకి వెళితే ఆలోచనల గురించి చర్చించవచ్చు. హైదరాబాద్ కు చెందిన ఒక గృహిణి 24 ఏళ్ల నేహా (పేరు మార్చబడింది), వయస్సు అంతరం సమస్యకు సంబంధించి బోల్డ్ స్కైతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నేను నా భర్తతో వివాహం చేసుకున్నప్పుడు కొందరు ఇలా అన్నారు. ‘వృద్ధులు ఎప్పుడూ మాట వినరు, మీరు కొన్ని విషయాల్లో అణచివేయబడతారు‘ ఇది మాకు చాలా కష్టంగా అనిపించింది.అయినా ప్రజలు చెప్పింది మేము పట్టించుకోలేదు. మా ఇద్దరి మధ్య 14 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. కానీ అది మా ఇద్దరి ప్రేమానురాగాల మధ్య ఎప్పుడూ రాలేదు. నేను అతని నుండి చాలా నేర్చుకుంటాను. అతని జీవిత అనుభవాలు చాలా సార్లు నన్ను క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి సహాయం చేశాయి‘‘ అని పేర్కొన్నారు.

2. వయసుతో ఎక్కువ పరిపక్వత..
ప్రజలు వారి అనుభవాల నుండి పరిపక్వత చెందుతారు. పురుషులు పెద్దయ్యాక వారి పరిపక్వత స్థాయి కూడా పెరుగుతుంది. అందువల్ల, వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి మహిళా భాగస్వాములకు లేదా భార్యలకు సహాయపడగలరు. రిలేషన్ షిప్ ను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఒక గొప్ప కారకంగా పని చేస్తుంది. నేహా ఇంకా ఇలా అంటోంది. ‘‘నేను ఏదో పిచ్చిగా వాగినప్పుడు నా భర్తకు నన్ను ఎలా కన్విన్స్ చేయాలో తెలుసు. నేను ఒక యువతి కావడం వల్ల నేను ఏదైనా విషయాలపై త్వరగా స్పందిస్తాను. కాని సమస్యను పరిష్కరించేందుకు అతను ఎప్పుడూ ముందుంటాడు. నా భర్త అజయ్ (పేరు మార్చబడింది) కొన్నిసార్లు చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. ఇలాంటి వాటిని నేను అర్థం చేసుకుంటే అతనికి సంతోషం వేస్తుంది. దీంతో అతను నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు‘‘ అని నేహా నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

3) నేర్చుకోవడానికి వయోపరిమితి అనేదే లేదు..
కొత్త విషయాలను నేర్చుకోవడానికి వయోపరిమితి అనేది ఏమి ఉండదు. ఇద్దరు వ్యక్తులకు పెద్ద వయసు గురించి అంతరం ఉన్నప్పటికీ వారు ఒకరి నుండి ఒకరు చాలా విషయాలను నేర్చుకోగలుగుతారు. నేహా ఇంకేమి చెబుతోందంటే ‘‘యోగా చేయడం ద్వారా నా భర్తకు నేను డ్యాన్స్ ఎలా చేయాలో చూపించాను. ఆరోగ్యంగా ఉండటాన్ని నేర్పించాను. అతనేమో నాకు రాజకీయాలు, చరిత్ర మరియు మరెన్నో చరిత్ర గురించి నాతో చర్చించడానికి ఆసక్తి చూపుతాడు. అలాగే సహాయం చేస్తాడు‘‘ అని చెప్పారు.

4) విభిన్న కోణాల నుండి విషయాలను చూడాలి..
విభిన్న కోణాల నుండి విషయాలను చూడటమే సరైనది. కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తులు విషయాలను సాధారణంగా చూస్తారు. అందుకే వాటిని సాధారణంగా అర్థం చేసుకుంటారు. మీరు ఏ విషయాన్ని అయినా మీరు విభిన్న కోణాల నుండి చూస్తే ఇద్దరు భాగస్వాములకు వయస్సు అంతరం ఉన్నందున వారి కొత్త ఆలోచనల చర్చలలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇద్దరు భాగస్వాములు ఒకే వయసు నుండి వచ్చినపుడు అది జరగకపోవచ్చు.

5. అవగాహన స్థాయి తెలుసుకుందాం..
పురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు లేదా తమకు చాలా తక్కువ వయసు గల మహిళలతో డేటింగ్ చేసినప్పుడు, వారికి కొంత స్థాయి అవగాహన ఉండాలి అని తెలుసు. పురుషులు తమ లేడీ భాగస్వామి ప్రేమలో అవగాహన మరియు ఓపికగా ఉండాలి అని తెలుసు. మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది.

6) టాలీవుడ్ నుండి బాలీవుడ్ నే తీసుకోండి..
చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల జంటల వయస్సు భారీ తేడాను కలిగి ఉన్నారు. టాలీవుడ్ విషయానికొస్తే మహేష్ బాబు కంటే నమ్రతా మూడేళ్లు పెద్దది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు తన ప్రణతీకి ఏకంగా 9 ఏళ్ల గ్యాప్ ఉంది. (ఇక్కడ ఎన్టీఆరే వయస్సులో పెద్ద). అక్కినేని నాగార్జున, అమల మధ్య కూడా 9 సంవత్సరాల వయసు గ్యాప్ ఉంది. ఇలా ఇంకా చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ లో షాహిద్, అతని భార్య మీరాతో 14 ఏళ్ల వయసు అంతరం ఉంది. మరో నటుడు, మోడల్ మిలింద్ సోమన్ అతని భార్య అంకితకు ఏకంగా 26 ఏళ్ల వ్యత్యాసం ఉంది.