Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ట్రెండింగ్! తల్లి పెళ్లి కోసం తపన పడుతున్న కూతురు గురించి మీకు తెలుసా..
తన తల్లికి అందమైన వరుడు కావాలని తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతకుముందే ‘టిండర్‘ అనే డేటింగ్ యాప్ లో తన తల్లి కోసం మంచి వరుడిని వెతికింది.
అమ్మ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే అమ్మకు భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది గనుక. అంతేకాదు త్యాగానికి మారు పేరు అమ్మ. కన్న బిడ్డల కోసం ఎంతటి కష్టాన్ని అయినా సరే చిన్న చిరునవ్వుతోనే భరించే గొప్ప మహిళ. పంటి బిగువన పురుటి నొప్పులను భరించి పునర్జన్మను సాధిస్తుంది.
తను ఎంత కష్టపడినా పిల్లలు ఆనందంగా ఉంటే చాలు అనుకునే అమ్మకు ఓ కూతురు ఇటీవల సోషల్ మీడియాలో ఓ ట్వీట్ పెట్టింది. అదేంటంటే తన తల్లికి మళ్లీ పెళ్లి చేయడానికి సిద్ధమైంది. తన తల్లికి ఎలాంటి వరుడు కావాలో కూడా షరతులను సైతం పోస్ట్ చేసింది ముంబైకి చెందిన ఆస్తా శర్మ. ఈ ట్వీట్ కాస్త ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ తల్లికి ఎలాంటి భర్త కావాలో, ఏమేమీ లక్షణాలు ఉండాలి అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తల్లి కోసం తపన..
తమ మత ఆచారాలు, సంప్రదాయాలు ప్రకారం ప్రతి ఒక్క మహిళ కేవలం ఒకరితోనే జీవితాంతం జీవించాలి అనుకుంటారు. కొందరు మాత్రం విడాకులు తీసుకుని మధ్యలోనే విడిపోతుంటారు. ఇంకొందరేమో ఒంటరిగా జీవిస్తుంటారు. ఇంకొందరు వితంతువులుగా మారి సమాజంలో చిన్నచూపుకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో తాను కూడా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే తన తల్లి ఒంటరిగా మారుతుందని భావించిన లా కాలేజీ విద్యార్థిని ఆస్తా శర్మ తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంది.

షరతులివే..
తన తల్లికి అందమైన వరుడు కావాలని తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతకుముందే ‘టిండర్‘ అనే డేటింగ్ యాప్ లో తన తల్లి కోసం మంచి వరుడిని వెతికింది. తన తల్లి కోసం 50 ఏళ్ల అందమైన వరుడు కావాలని, మందు, పొగ తాగడం, ప్యూర్ వెజిటేరియన్ అయ్యి ఉండాలి. అంతేకాదు జీవితంలో బాగా సెటిల్ అయి ఉండాలి. ఇలా తన తల్లికి కాబోయే వరుడి గురించి ఏయే లక్షణాలు కావాలో ట్విట్టర్లో రాసుకొచ్చింది.
అమ్మతో కలిసి సెల్ఫీ..
మహిళలకు, మగవాళ్లకు మంచి భాగస్వాములు, మంచి స్నేహితులు సోషల్ మీడియాలో దొరుకుతారని తాను విన్నానని.. అందుకే ఈ ట్వీట్ చేస్తున్నట్లు ఆస్తా వర్మ పేర్కొంది. అంతేకాదు అమ్మతో కలిసి సెల్ఫీ దిగి ఆ ఫొటోను షేర్ చేసింది.

నెటిజన్లు ఫిదా..
ఆస్తా శర్మ ట్వీట్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆమె ట్వీట్ కు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘నువ్వు గొప్ప కూతురువి.. మీ తల్లీ కూతుళ్లు మంచి స్నేహితుల్లా‘ ఉన్నారు. తల్లి గురించి ఆస్తా శర్మ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మీ ఇద్దరికీ ఆల్ ద బెస్ట్ అని రీ ట్వీట్లు చేస్తున్నారు. ఇంకొందరు తమకు తెలిసిన వారి వివరాలు బ్యాచ్ లర్స్, విడాకుల తీసుకున్న పేర్లు, తమ కుటుంబ సభ్యుల వివరాల రూపంలోనూ కామెంట్స్ విభాగంలో వివరిస్తున్నారు. తన తల్లికి మంచి వరుడు దొరుకుతాడో లేదో చూడాలి మరి.

ప్రతి ఒక్కరికీ తోడు అవసరం..
జీవితం అన్నాక ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో లేదా ఏదైనా సందర్భంలో తోడు అవసరం అవుతుంది. దానికి వయసుతో సంబంధం లేదు. అందులోనూ ఒంటరి మహిళలు ఈ సమాజంలో చిన్నచూపుకు గురవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో లా కాలేజీ స్టూడెంట్ తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయమే.

గతంలో ఫేస్ బుక్ లోనూ..
ఇంతకుముందు కూడా ఓ కుమారుడు తన తల్లికి రెండో వివాహం జరిపించాడు. దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అది కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఇది ఎక్కడో కాదు మన దేశంలోని కేరళ జిల్లా కొల్లాం జిల్లాలోనే. ఇంజనీర్ అయిన గోకుల్ శ్రీధర్ తన తల్లికి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుతూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

నాన్న లేని లోటును తీర్చాలని..
‘‘లా కాలేజీ స్టూడెంట్ ఆస్తా వర్మకు అమ్మంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుండి తన కోసం పడ్డ కష్టాన్ని బాగా గుర్తుంచుకుంది. అందుకే తనకు ఏ కష్టం రాకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. తనను ఎన్ని రకాలుగా సంతోషపరచాలని ప్రయత్నించినా నాన్న లేని లోటును మాత్రం తీర్చలేకపోవడంతో ట్విట్టర్లో అందమైన వరుడి కోసం పోస్ట్ చేసినట్లు వివరించింది.

అమ్మ ఆనందం కోసం..
గతంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో గీతా అగర్వాల్ అనే స్కూల్ టీచర్ కు తన కూతురు రెండో వివాహం జరిపించింది. తన తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన తల్లి బాధను చూసి తట్టుకోలేకపోయింది ఆ కూతురు. తన తల్లి దు:ఖాన్ని ఎలాగైనా దూరం చేయాలని అనుకుంది. అందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా తాను మాత్రం ధైర్యంగా రెండో పెళ్లి జరిపించింది. అలా తన తల్లికి ఆనందం కోసం ప్రయత్నించింది.



Click it and Unblock the Notifications

