Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలే చేయొద్దు
మ్యారేజ్ ప్రపోజల్ సమయంలో చేసే ఆ తప్పులు ఏమిటి, వాటి వల్ల కలిగే ఇబ్బందులు, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి కంటే జీవితంలో అతి పెద్ద శుభకార్యం ఉండదు. చాలా మంది జీవితాల్లో ఒక్కసారి మాత్రమే జరిగే అతి పెద్ద వేడుక. పెళ్లి లాగే పెళ్లి ప్రపోజ్ కూడా చాలా ప్రత్యేకమైనది. చాలా మంది తమ ప్రియమైన వ్యక్తులను పెళ్లాడాలని కోరుకుంటారు. వారి ముందు పెళ్లి ప్రతిపాదన పెడుతుంటారు. మనం పెళ్లి చేసుకుందామా.. మూడు ముళ్ల బంధంలో జీవితాంతం కలిసి ఉందామా అని ప్రపోజ్ చేస్తుంటారు. అయితే చాలా మంది ఈ సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు.

మ్యారేజ్ ప్రపోజల్ సమయంలో చేసే ఆ తప్పులు ఏమిటి, వాటి వల్ల కలిగే ఇబ్బందులు, వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రపోజల్ గురించి ప్రచారం చేసుకోవడం
ప్రతిపాదన గురించి తెలుసుకోవాల్సిన మొదటి వ్యక్తి మీరు ప్రపోజ్ చేయబోతున్న వ్యక్తి. ప్రపోజల్ సర్‌ప్రైజ్, ప్రత్యేకత ఉండాలంటే దాని గురించి ఎవరికీ తెలియకూడదు. అలా కాకుండా ముందే అందరికీ చెప్పేసి ప్రచారం చేసుకుంటే ప్రపోజల్‌లో ఉండాల్సింది సర్‌ప్రైజ్ ఎలిమెంట్ మిస్ అవుతుంది.

2. చాలా నేరుగా చెప్పేయడం
మీరు మీ కలల వ్యక్తిని జీవిత భాగస్వామి కావాలని ప్రతిపాదిస్తున్నారు. అందులో కొంత రొమాన్స్ ఫ్లేవర్ ఉండాలి. చాలా సూటిగా చెబితే అందులో కిక్ ఏం ఉంటుంది. మ్యారేజ్ ప్రపోజల్ సాదాసీదాగా ఉండాలని ఎవరూ కోరుకోరు. అందుకే దానికి కొద్దిగా రొమాంటిక్ మసాలా దట్టించాలి.

3. సింపుల్‌గా ఉంచడం
జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. అందుకే వాటికెంతో ప్రత్యేకత ఉండేలా చూసుకోవాలి. సింపుల్‌గా ఉంటే ఏముంటుంది. కొన్ని రోజులు, సంవత్సరాల తర్వాత ప్రపోజల్ గురించి ఆలోచించినప్పుడు ముఖంలో చిరునవ్వు రావాలి. అంతే కానీ ఛ.. అలా చేసి ఉండకూడదు. ఇంకేదైనా కొత్తగా ఆలోచించి ఉంటే బాగుండేది అని అనుకునే పరిస్థితి రావొద్దు.

4. ఎదుటి వారి ఫీలింగ్స్ తెలుసుకోకపోవడం
ఎదుటి వారికి మీపై కూడా ఫీలింగ్స్ ఉండాలి. మ్యారేజ్ అంటే ఇద్దరి మనసులు కలవాలి. అప్పుడే ప్రేమ చిగురించి అది పెళ్లి బంధానికి దారులు పరుస్తుంది. ఎదుటివారి ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా, వారు మీతో జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నారో, లేదో తెలుసుకోకుండా మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే దాని వల్ల నెగెటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది.

5. సరైన సమయాన్ని ఎంచుకోకపోవడం
ప్రియురాలికి ప్రపోజ్ చేసే విషయంలో సమయానిది కీలక పాత్ర. ప్రియురాలి మూడ్ సరిగ్గా లేనప్పుడు, వేరే ఏదైనా ఒత్తిడిలో, ఆందోళనలో ఉన్నప్పుడు ఆమె ముందు మ్యారేజ్ ప్రపోజల్ పెడితే నెగెటివ్ రిజల్ట్ వస్తుంది. అందుకే ఎదుటివారి మంచి మూడ్‌లో ఉన్నారో లేదో తెలుసుకని ప్రపోజే చేయడం మంచిది.

6. సరైన ప్రదేశాన్ని ఎంచుకోకపోవడం
చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు. వారిలో ఉన్న ఉత్సాహం మిగతా వాటి గురించి ఆలోచించకుండా చేస్తుంది. రోడ్డుపైన, చీకటిగా ఉండే థియేటర్‌లో, ఎక్కువ మంది ఉండే చోట మ్యారేజ్ ప్రపోజ్ చేయడం ఊహించడానికి కూడా బాగుండదు. అందుకే ఒకరికి ప్రపోజ్ చేస్తున్నప్పుడు సరైన సమయాన్ని, సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications