Latest Updates
-
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే..
మీ భార్య కోపంతో వేగలేకపోతున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే
భార్య కోపంగా ఉన్నప్పుటు ఏ భర్త కూడా వారితో పెట్టుకోరు. చాలా సార్లు భార్యలు ఎందుకు కోపంగా ఉన్నారో కూడా భర్తలు గుర్తించలేరు. తరచూ కోప్పడే భార్యతో ఏ భర్తా వేగలేడు. మీ భార్య కూడా ఇలాగే తరచూ కోప్పడుతుంటే ఈ చిట్కాలు పాటించి చూ
మనిషిని జంతువులను వేరే చేసేవి భావోద్వేగాలే. ప్రతి మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. సమయాన్ని, సందర్భాన్ని బట్టి అవి బయటకు వస్తుంటాయి. కోపం, ఆవేశం, దుఃఖం, బాధ, నిరాశ వంటివన్నీ భావోద్వేగాలు. ఇవి కేవలం మనల్నే కాకుండా మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంటాయి. కోపాన్నే తీసుకుంటే కోపంలో అనే మాటలు ఎదుటివారిని తీవ్రంగా బాధిస్తాయి. కోపం, కోపంలో వ్యవహరించే తీరు దంపతుల మధ్య చిచ్చు పెడుతుంది. బంధానికే బీటలు వారేలా చేస్తుంది.

భార్య కోపంగా ఉన్నప్పుటు ఏ భర్త కూడా వారితో పెట్టుకోరు. చాలా సార్లు భార్యలు ఎందుకు కోపంగా ఉన్నారో కూడా భర్తలు గుర్తించలేరు. తరచూ కోప్పడే భార్యతో ఏ భర్తా వేగలేడు. మీ భార్య కూడా ఇలాగే తరచూ కోప్పడుతుంటే ఈ చిట్కాలు పాటించి చూడండి.

భార్యలు కోపంగా ఉన్నారని ఇలా గుర్తించండి:
కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారన్నది వారి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. కొందరు కోపంతో రగిలిపోతున్నట్టు చూస్తే తెలిసిపోతుంది. మరికొందరు తమ కోపాన్ని మనసులో ఉంచుకుని మాట్లాడినప్పుడు, ఏదైనా అందివ్వమని అడిగినప్పుడు కోపంగా బదులిస్తారు. ఇంకొందరు కోపంతో ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉంటారు. కానీ వారి చర్యలు రఫ్‌గా ఉంటాయి. కొట్టినట్లుగా సమాధానం ఇస్తారు. వస్తువులు విసిరేసినట్లుగా చేతికి అందిస్తారు.

భార్యలు కోపంగా ఉండటానికి కారణాలు:
- హార్మోన్లు
- నిరాశ
- లైంగిక నిరాశ
- ఆర్థిక సమస్యలు
- పని సంబంధిత ఒత్తిడి
- సెల్ఫ్ కండెమ్నేషన్
- అసూయ
- రిజెక్షన్
- అభద్రత
- గతంలో జరిగిన అవమానం

కోపంతో ఉన్న భార్యతో ఎలా వ్యవహరించాలి?:
1. తప్పుంటే క్షమాపణ చెప్పండి
తప్పు మీ వైపు ఉంటే క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పడం వల్ల మీ విలువ ఏమీ తగ్గదు. భార్య కోపంతో ఉన్నప్పుడు తప్పు మీదైతే క్షమాపణ అడగడం ద్వారా మీ బంధం బలోపేతం అవుతుంది.
2. ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించండి
మీ భార్య కోపంతో అరుస్తూ ఉంటే ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించండి. కోపాన్ని ఎలా తగ్గించాలో తెలుసుకుని అలా ప్రవర్తించండి. మాటలు, చేతలు, సైగల ద్వారా భార్యను శాంతింపజేయడానికి ప్రయత్నించండి.
3. ఆమె కంప్లైంట్స్ వినండి
భార్య కోపం వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అసలు సమస్య ఏమిటి, ఎందుకలా కోపగించుకుంటుంది ఆమె చెప్పడానికి ప్రయత్నించినప్పుడు చెప్పనివ్వాల. సమస్య ఏమిటో తెలుసుకున్నప్పుడే దానిని పరిష్కరించవచ్చని గుర్తుంచుకోండి.
4. ఇగోను పక్కన పెట్టండి
దాంపత్య బంధం అన్నాక ఇగో అంటూ పట్టుకుని కూర్చుంటే బంధం ముందుకు సాగదు. మీరే తెలియకుండా తప్పు చేసినట్లైటే క్షమాపణ అడగడానికి సంకోచించవద్దు. ఇగోను పక్కన పెడితేనే బంధం బలోపేతం అవుతుంది.
5. సర్‌ప్రైజ్‌లు ఇవ్వండి
కోపంగా ఉన్న భార్యను సంతోషపెట్టడానికి సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేయండి. వారికి ఇష్టమైన వస్తువులో, ఆహార పదార్థాలో, చీరలో గిఫ్ట్‌గా ఇవ్వండి.
6. కాస్త సమయం ఇవ్వండి
కొందరు కోపంతో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటారు. అలాంటి వారికి కొద్దిగా సమయం ఇవ్వండి. వ్యక్తిగతంగా గడపనివ్వండి. తర్వాత మెల్లిగా వారే కూల్ అయిపోతారు.
7. కనికరం చూపండి
భార్యలు చెప్పినా చెప్పకపోయినా వాళ్లు బాధలో ఉన్నప్పుడు కనికరం చూపాలని కోరుకుంటారు. వారి బాధను మీరు కూడా అనుభవిస్తున్నట్లుగా వారికి తెలిసేలా చేయాలి.
8. కౌగిలించుకోండి
కోపంతో ఉన్న భార్యలు కొందరు ఏం చెప్పినా వినిపించుకోరు. అలాంటి వారిని స్పర్శ మార్చవచ్చు. వారిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకోండి. అది వారిలో మంచి ఫీలింగ్‌ను ప్రేరేపిస్తుంది. వారికి మేమున్నాం అనే భరోసా ఇచ్చినట్లు అవుతుంది. కోపంలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. అది వారిలో ప్రశాంతతను తీసుకువస్తుంది. దీని వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా మెరుగుపడుతుంది.



Click it and Unblock the Notifications