Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
‘నా వైఫ్ అంటే నాకిష్టమే.. కానీ పెళ్లి కాని యువతితో ఫోన్లోనే అన్నీ...’
‘నాకు నా భార్యంటే ఇష్టమే.. కానీ నేను మరో వ్యక్తితో ఫోన్లో అలా ఎంజాయ్ చేస్తున్నా’
తన భార్యను మనస్ఫూర్తిగా ఇష్టపడే భర్తకు మరో మహిళతో అనుకోకుండా పరిచయమైంది. అది కూడా ప్రత్యక్షంగా కాదు. కేవలం ఫోన్లో మాత్రమే. అయితే ఆ పరిచయమే టెక్నాలజీ కారణంగా చాలా దూరం వెళ్లింది.

వారిద్దరూ ఇప్పటివరకు నేరుగా కలవకపోయినా స్మార్ట్ ఫోన్లోనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారట. దీనికి అనేక కారణాలు ఉన్నాయంట. అందులో ముఖ్యమైనది ఏమిటంటే.. పెళ్లి జరిగి పిల్లలు పుట్టిన తర్వాత తను కలయిక విషయంలో ఆసక్తి చూపకపోవడం ఒక కారణమని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే తనకు ఓ పెళ్లి కాని అమ్మాయితో కొత్తగా పరిచయం ఏర్పడింది. అయితే ఆన్ లైనులో 'ఆ' విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారట.

అదే సమయంలో కొన్ని పర్సనల్ ఫొటోలను ఇద్దరూ షేర్ చేసుకున్నారంట. అలా మొదలైన వారి పరిచయం ఎందాకా వెళ్లింది... తన భార్యను కాదని.. మరో మహిళతో తను ఆ సంబంధం కంటిన్యూ చేశాడా.. లేదా మధ్యలో వచ్చిన అమ్మాయిని మధ్యలోనే మరిచిపోయాడా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లికాని యువతితో..
‘హాయ్ నా పేరు సంతోష్ (పేరు మార్చాం). నా వయసు 30 ఏళ్లు. నాకు ఒక బేబీ ఉంది. నాకు నా భార్యంటే ప్రాణం. కానీ, తను పిల్లలు పుట్టాక ఆ కార్యంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే నాకొక పెళ్లి కాని అమ్మాయితో పరిచయం ఏర్పడింది.

రెగ్యులర్ గా చాటింగ్..
అయితే ఆ పరిచయం కూడా నేరుగా కాదు. కేవలం ఫోన్లేనే. అలా పరిచయం అయిన తను రెగ్యులర్ గా నాతో చాటింగ్ చేస్తూ ఉండేది. ఇలా అతి కొద్ది సమయంలోనే మేమిద్దరం ఫోన్లో చాలా దగ్గరయ్యాం. ఒకరి గురించి ఒకరు పర్సనల్ వివరాలు, ఫొటోలు షేర్ చేసుకునేంత దగ్గరయ్యాం.

తనతో మాట్లాడుతుంటే..
ఇలా తనతో ఫోన్లో మాట్లాడుతున్నా లేదా చాటింగ్ చేస్తున్నా మేమిద్దరం ఈ లోకాన్ని మరచిపోయి.. కొత్త లోకంలో ఉంటున్నట్టుగా అనిపించేది. తొలి రోజుల్లో నేను కేవలం రాత్రి వేళలో మాత్రమే తనతో చాటింగ్ చేసేవాడిని.

రాత్రి, పగలు తేడా లేకుండా..
అయితే ఇప్పుడు పగలు, రాత్రి అనే తేడానే లేకుండా రెగ్యులర్ గా తనతో ఫోన్లో టచ్ లో ఉంటున్నా. అయితే నాకు నా భార్య అంటే బాగా ఇష్టం. కానీ, నేనేమో పెళ్లి కాని మరో యువతితో భావోద్వేగంగా దగ్గరయ్యాను.

మోసం చేస్తున్న ఫీలింగ్..
అయితే తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నంతసేపు ఎంతో ఆనందంగా ఉండే నాకు.. మరోవైపు నా భార్యను మోసం చేస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇలా అనిపించనప్పుడల్లా నాలో నేను చాలా బాధపడేవాడిని.

శాశ్వతం కాదని..
ఇలాంటి రిలేషన్ షిప్ శాశ్వతంగా ఉండదని నాకు తెలుసు. కానీ తనతో మాత్రం ఇంకా అలాంటి రిలేషన్ కంటిన్యూ చేయాలనిపిస్తోంది. అలాగని నా భార్య కోసం తనని వదిలేద్దామా? లేదా నా ఎంజాయ్ మెంట్ కోసం ఆలోచించాలా అనే గందరగోళంలో ఉన్నాను.

ఎలాంటి పరిష్కారం..
ఈ ప్రాబ్లమ్ నుండి నేను ఎలా బయటపడాలో నాకు తెలియడం లేదు. ఓ వైపు పంచభూతాల సాక్షిగా.. కుటుంబసభ్యులు, బంధువల సమక్షంలో తాళి కట్టిన భార్య.. మరోవైపు మధ్యలో ఫోన్లో పరిచయమైన మహిళతో ఫిజికల్ గా కలవకపోయినా మానసికంగా దగ్గరవ్వడంతో నాకు ఏమి చేయాలో తోచడం లేదు' అని ఓ వ్యక్తి తన సమస్యను మానసిక నిపుణులతో చెప్పుకున్నాడు.

ఎక్కువ సమయం..
దీనికి మానసిక నిపుణులు ఇచ్చిన సలహా ఏంటంటే.. మీరు కొత్తగా పరిచయమైన వారితో ఫోన్లో ఎక్కువగా గడిపే కంటే.. ప్రత్యక్షంగా మీకు దగ్గరగా ఉన్న.. మీకిష్టమైన భార్యతో ఎక్కువ సమయం గడిపేందుకు సమయం కేటాయించండి.

మీ భార్యకు ప్రియారిటీ..
అలా చేయడం అంత ఈజీ కాదు. కానీ ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఒక భర్తగా.. మీరు మీ భార్య ప్రియారిటీ ఎక్కువ ఇవ్వడమే ఉత్తమమైన పని. ఒకవేళ మీ భార్య మీరున్న పరిస్థితిని అర్థం చేసుకుంటారనే పాజిటివ్ ఫీలింగ్ తో తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి.

మీ పార్ట్ నర్ తో ధైర్యంగా..
మీరు మరో అమ్మాయితో అలా చాట్ చేసేందుకు చూపే ధైర్యాన్ని మీ పార్ట్ నర్ వద్ద కూడా చూపించొచ్చు. ముందుగా మీ ప్రాబ్లమ్ ఏంటో తనకు అర్థమయ్యేలా చెప్పండి.

తనతో ఏకాంతంగా..
తనతో ఏకాంతంగా గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించండి. నిత్యం మీ భాగస్వామితో మాట్లాడటం.. మీ మనసులోని భావాలను షేర్ చేసుకోవడం వల్ల మీ రిలేషన్ మరింత బలపడుతుంది.

మీరు కోరుకున్నట్టే..
ఇలా చేయడం ద్వారా మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి అనే అవకాశమే రాకుండా పోతుంది. మీరు కోరుకున్నట్టే అంతా జరిగిపోతుంది.



Click it and Unblock the Notifications
