Latest Updates
-
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్
జాక్ పాట్ కొట్టబోతున్న ఆ కవల జంటలు... ఒకేసారి డబుల్ ధమాకా...
ఒకేసారి గర్భం దాల్చిన ట్విన్ సిస్టర్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
ఇక్కడ ఉన్న ఫొటో చూస్తే.. ఇదేదో సినిమా పోస్టర్ లాగా ఉంది అనుకుంటే మీరు తప్పులే కాలేసినట్టే... ఎందుకంటే అది వందశాతం నిజమైన చిత్రం. అందులో విషయం మరింత ట్విస్ట్ ఇచ్చే వాస్తవం.
అదేంటంటే కవలలుగా పుట్టిన ఇద్దరు అమ్మాయిలు... కవలలుగా పుట్టిన అబ్బాయిలనే రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. దీంతో వారు ఒక్కసారిగా సెలబ్రెటీలుగా మారిపోయారు.
అప్పటినుండి వారి మధ్య జరిగిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన్ ఇన్ స్టాగ్రామ్ లో మంచి మంచి ఫొటోలను పెడుతూ ఫాలోయర్స్ విపరీతంగా పెంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో 2020 సంవత్సరంలో ప్రపంచం ఆశ్చర్యపోయే విషయాన్ని చెప్పారు. తమ జంట అతి త్వరలో జాక్ పాట్ కొట్టబోతోందని, తమకు డబుల్ ధమాకా దక్కబోతోందని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అదేంటంటే వారిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారి గర్భం దాల్చామని చెప్పారు.

ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? వారిద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యామని చెప్పారు. అంతేకాదు తమకు ఒకేసారి డెలివరీ అవుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలుపగా, ఇది తెలుసుకున్న నెటిజన్లు నిజంగా వాళ్లకు డబుల్ ధమాకా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సంఘటన ఎక్కడ జరిగింది? అసలు వారు ఏ దేశానికి చెందిన వారు? మన దేశానికి చెందిన వారేనా కాదా అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఒకేసారి గర్భం..
ఒకే రూపంతో ఉండే ట్విన్ సిస్టర్లు ఒకే రూపం ఉండే ట్విన్ బ్రదర్లను 2018 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో వారు ఒక్కసారిగా సెలబ్రెటీలుగా మారిపోయారు. అయితే విశేషమేమిటంటే వారిద్దరూ ఒకేసారి గర్భం దాల్చారంట. ఈ విషయాన్ని స్వయంగా వారు ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు ఆ బాపుబొమ్మలిద్దరూ ఒకేసారి పిల్లల్ని కనాలని అనుకుంటున్నారట.

దేశమంతా గాలించి..
అమెరికా దేశానికి చెందిన బ్రిటనీ, బ్రయనా డీన్ కవలలు. ఈ అక్కాచెల్లెల్లిద్దరూ దేశమంతా అన్వేషించి జోష్, జెరెమీ సాలియర్స్ అనే ట్విన్ బ్రదర్లను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2018లో వివాహం జరిగింది. అప్పటి నుండి వారు తమ ప్రాంతంతో పాటు ఇంటర్నెట్ లో సెలబ్రెటీలుగా మారారు.

మళ్లీ వైరల్..
అయితే ఈ జంట ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. ఎందుకంటే వారిద్దరూ ఒకేసారి గర్భం దాల్చిన విషయం నెట్ లో చక్కర్లు కొట్టడంతో అది కాస్త క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అంతేకాదు తాము ఒకేరోజు ఒకే సమయంలో పిల్లలను కనాలని, తమ వారసత్వాన్ని ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నామని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని.. బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు.



Click it and Unblock the Notifications


