మీ జీవితాన్ని మార్చే మీ భాగస్వామి రహస్యమేంటో తెలుసా..

నాలుగో నంబర్ వచ్చిన వారికి హృదయంలో విశ్వాసం మరియు కరుణ ఎక్కువగా ఉంటుంది.

మీ భవిష్యత్తును నిర్ణయించడంలో మీ కెరీర్ రూట్ నంబర్ ముఖ్యమైనది. మీ రాశి చక్రం లాగానే మీ భవిష్యత్తును అంచనా వేయడానికి మీ కెరీర్ రూట్ నంబర్లను లెక్కించండి. ముందుగా మీ పుట్టినరోజు తేదీని మొత్తం కలిపి ఒకే అంకెకు జోడించండి. చివరి సింగిల్ డిజిట్ మీ కెరీర్ రూట్ నెంబర్. ఉదాహరణకు 21+07+1992, 2+1+0+7+1+9+9+2 = 31, 3+1=4 ఇలా వచ్చిన చివరి అంకెను బట్టి మీ భవిష్యత్తును అంచనా వేసుకోవచ్చు. ఇదంతా కేవలం న్యూమారాలజీ అంచనా ప్రకారమే. మీరు ఇలాంటి వాటి గురించి ఇప్పటివరకు చాలా చోట్ల వినే ఉంటారు. కానీ ఇక్కడ ఎక్కువగా మీ వివాహం మరియు ప్రేమ, సంబంధ జీవితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు మీ ప్రేమ జీవితం గురించి మీ కెరీర్ రూట్ నంబర్ ఏమి చెబుతుందో ఈ స్టోరీలో తెలుసుకోండి.

1) నంబర్ 1

1) నంబర్ 1

ఒకటో నంబర్ వచ్చిన వ్యక్తులు చాలా స్పష్టంగా ఉంటారు. వీరంతా 3, 5 వంటి బేసి సంఖ్యలు గల వారితో బాగా కలిసిపోతారు. ఒకవేళ మీ జీవిత భాగస్వామికి ఇంకా 1 ఉంటే, మీకు ఎక్కువ సమస్యలు ఉండవచ్చు. కానీ 3, 5 నంబర్లు మీ సంబంధానికి మరింత జోష్ ను ఇస్తాయి. వారు మీలోని ఉత్తమమైన వాటిని బయటకు తెస్తారు.

2) నంబర్ 2

2) నంబర్ 2

రెండో నంబర్ వచ్చిన వ్యక్తులు ఎక్కువగా సిగ్గు పడుతుంటారు. అయితే మంచి ఆలోచనాపరులు కూడా. వీరు అన్ని విషయాలను నియంత్రించే వారితో ఉండాలని కోరుకుంటారు. ఎక్కువ వ్యాపార ఆలోచనలను కలిగి ఉండటం మీకు మంచిది. వీరికి 9 మరియు 4 ఉత్తమ సహచరులు. వారికి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, మీరు వారితో సమతుల్యం పొందుతారు. 5వ నంబర్ కెరీర్ రూట్ ఉన్నవారికి మీరు దూరంగా ఉండాలి.

3) నంబర్ 3

3) నంబర్ 3

మూడో నంబర్ వచ్చిన వ్యక్తులు చాలా చురుకుగా ఉంటారు. వీరి శక్తిని ఇతరులకు వ్యాప్తి చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. మీ జీవితాన్ని 5 మరియు 2తో పంచుకుంటే మీకు ఎక్కువ ఉత్తేజాన్ని ఇస్తుంది. మీ శక్తిని సమతుల్యం చేయడానికి మీకు 7వ నంబర్ వచ్చిన వారు ఉత్తమ సహచరులు. 8వ సంఖ్యలో జన్మించిన వారు మీ వైపు ఆకర్షింపబడతారు. కాని వారి నుండి మీరు దూరంగా ఉండాలి.

4) నంబర్ 4

4) నంబర్ 4

నాలుగో నంబర్ వచ్చిన వారికి హృదయంలో విశ్వాసం మరియు కరుణ ఎక్కువగా ఉంటుంది. మీ కెరీర్ రూట్ నాలుగో స్థానంలో ఉంటే మీకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. ప్రతి ఒక్కరూ మీతో ఉండాలని కోరుకుంటారు. మీకు 8 మరియు 1 జన్మించిన వారు ఉత్తమ సహచరులు అవుతారు. మీరు 9వ సంఖ్య వారికి దూరంగా ఉండాలి. వారు మిమ్మల్ని విస్మరించే అవకాశం ఉంది.

5) నంబర్ 5

5) నంబర్ 5

ఐదో నంబర్ వచ్చిన వ్యక్తులు చాలా సరదాగా, ప్రేమగా మరియు అంకితభావంతో ఉంటారు. వారి కోసం ఒక సహచరుడిని ఎన్నుకునేందుకు చాలా కఠినంగా అనిపిస్తుంది. సాధారణంగా ఒకే లైఫ్ పాత్ నంబర్ ఉన్న వ్యక్తులు ఉత్తమ జంట కావచ్చు. అలా ఇద్దరు ఐదో నెంబర్ వ్యక్తులు ఉత్తమ సహచరులు అవుతారు.

6) నంబర్ 6

6) నంబర్ 6

ఆరో నంబర్ వచ్చిన వ్యక్తులు అందరికీ సుపరిచితులుగా ఉంటారు. వీరు ఆచరణాత్మకంగా జీవించాలని కోరుకుంటారు. వీరికి ఉత్తమ సహచరుడు 2. అలాగే 1 మరియు 8 నంబర్లు కూడా ఉత్తమ సహచరులుగా కొనసాగుతారు.

7) నంబర్ 7

7) నంబర్ 7

ఏడో నంబర్ వచ్చిన వ్యక్తులకు వారిపై వారికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఈ సంఖ్య వచ్చిన వారు ఎవరినైనా ప్రేమిస్తే మీరు జీవితాంతం వారితోనే ఉంటారని హామీ ఇవ్వవచ్చు. ఈ 7 నంబర్ మరింత తాత్వికమైనది. ఇవి 5 సంఖ్యతో బాగా పని చేస్తాయి. ఎందుకంటే 7వ నెంబర్ తో కొంచెం సరదాగా ఉండొచ్చు. మిమ్మల్ని ఆకర్షించే 2 మరియు 8 నంబర్లకు మీరు దూరంగా ఉండాలి.

8) నంబర్ 8

8) నంబర్ 8

ఎనిమిదో నంబర్ వచ్చిన వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సముహంలో ఉన్నప్పుడు అత్యంత ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవితంలోకి ఎక్కువ తెలివైన మరియు ఆధిపత్యం లేని వ్యక్తి అవసరం. మీరు 4వ సంఖ్యతో బాగా సరిపోతారు. ఎందుకంటే మీరిద్దరూ ఒకరినొకరు సమతుల్యం చేసుకుంటారు. అయితే మీరు 2 మరియు 5 సంఖ్యలతో మెరుగవుతారు. కానీ 1వ నెంబరుకు మాత్రం దూరంగా ఉంటారు.

9) నంబర్ 9

9) నంబర్ 9

తొమ్మిదో నంబర్ వచ్చిన వ్యక్తులు కొంచెం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వీరు ఎవరితో అయినా కలవడానికి కష్టంగా ఫీలవుతారు. వీరు సహచరుడి కోసం వెతుకుతారు. మీ సహచరులను ఎంచుకోవడానికి మీకు చాలా సమయం పడుతుంది మీరు 6వ స్థానంలో ఉన్న వారిని మంచి తోడుగా పొందవచ్చు. ఎందుకంటే మీరు ప్రశాంతతను పొందుతారు. అయితే 2 నంబర్ కూడా మీకు మంచి భావోద్వేగమైన తోడుగా ఉంటుంది.

Desktop Bottom Promotion