Latest Updates
-
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా?
Viral: చనిపోయిన భార్యను మళ్లీ పుట్టించాడు.. అదెలాగో తెలిస్తే షాకవుతారు...!
చనిపోయిన భార్యను విగ్రహ రూపంలో మళ్లీ బతికించిన వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకున్న ఆ దంపతుల కల ఈరోజు ఫలించింది. వారిద్దరూ కలిసి ఎంతో ఆనందంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించాలని అనుకున్నారు. అయితే అంతలోనే విధి వారిద్దరిని కలల్ని పటా పంచలు చేసింది. తన భార్య ఆయుషును అర్ధాంతరంగా ముగించింది.

అయితే తన భార్య ఎలా ఉంటుందో.. అచ్చం అలాగే మైనపు విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహానికి నగలు, పూలు, ధరించి మురిసిపోయాడు. అయితే ఈ సంఘటన కేవలం కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది.

రామాయణంలో శ్రీరాముడు రాజశ్రీయా యాగం కోసం సీతాదేవికి బదులు ఆమెలాగే ఉన్న స్వర్ణపు విగ్రహాన్ని తయారు చేయించి, ఆ యాగాన్ని పూర్తి చేస్తాడు.

సరిగ్గా అలాంటి సంఘటనే కలికాలంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగిందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ కుటుంబంలో విషాదం..
కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్త భార్య మాధవి 2017 సంవత్సరంలో తిరుపతికి వెళ్తున్న సమయంలో కోలార్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. తన భార్య విషయాన్ని తట్టుకోలేకపోయాడు ఆ భర్త. అప్పటికే వారు కొత్త ఇంట్లోకి ప్రవేశించాల్సి ఉంది.

భార్య బతికుంటే..
ఇలా దిగులుగా ఉన్న సమయంలో ఆయనకు ఒక అదిరిపోయే ఐడియా వచ్చింది. అంతే ఒకవేళ ఈ సమయంలో ఆమె బతికుంటే ఎలా ఉండేదో అని ఊహించుకున్నాడు. అంతే అచ్చం అలాంటి మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించాలని అనుకున్నాడు.

సంప్రదాయం ఉట్టిపడేలా..
తన భార్య ముఖంలో చిరునవ్వు, సంప్రదాయం ఉట్టిపడేలా పట్టుచీర, బంగారు ఆభరణాలతో, కేశాలంకరణతో తన భార్య స్వరూపాన్ని మైనపు విగ్రహం ద్వారా తయారు చేయించుకుని, ఇంట్లో ప్రతిష్టించాడు. ఆ విగ్రహం వద్ద ఆయన కుటుంబసభ్యులు ఫొటోలు దిగి మురిసిపోయారు.

ఆశ్చర్యపోయిన బంధువులు..
ఆమె మైనపు విగ్రహాన్ని చూసిన వారందరూ నోరెళ్లబెడుతున్నారు. ఆ విగ్రహాన్ని చూస్తే.. ఆమె బతికే ఉందా? అన్న అనుమానం కలుగుతుంది. ఈ సంఘటనను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్త వైరల్ అయిపోయింది.

నెటిజన్ల కామెంట్లు..
దీన్ని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహాల్ ను నిర్మిస్తే.. ప్రస్తుత శ్రీనివాస్ గుప్త తన భార్య మైనపు విగ్రహాన్ని చేయించి, షాజహాన్ కన్నా తన ప్రేమే గొప్పదని నిరూపించారన్నారు. నిజమైన ప్రేమంటే ఇదే అని అభినందిస్తున్నారు.
All Images Credited to Twitter



Click it and Unblock the Notifications
