Latest Updates
-
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
నోట్లో నీళ్లు ఊరించే టమాటా నిల్వ పచ్చడి.. నెలల పాటు నిల్వ ఉండేలా చేసుకోండిలా.. -
వృషభం, సింహం, మకర రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 02 మే 2026 -
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే!
‘నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...’
పెళ్లైన కొంత కాలానికి రొమాన్స్ ను ఎందుకు ఆపేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహం చేసుకున్న ప్రతి జంట ఆనందంగా ఉండేందుకు ఆన్యోన్యత అనేది ఎంతో అవసరం. వారి మధ్య ఆ బంధం చాలా బలంగా ఉండాలి. అది ఉన్నప్పుడే వారి కాపురం కలకాలం హాయిగా కొనసాగుతుంది.

అయితే ఇందులో కీలకమైన పాత్ర పోషించేది మాత్రం రొమాన్స్ (సెక్స్)అనడంలో ఎలాంటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా ఆ కార్యంలో పాల్గొంటే మనకు తెలియకుండానే ఎదుటి వ్యక్తిపై ప్రేమ పెరిగేందుకు కారణమవుతుందనే విషయం చాలా మందికి తెలియదు.

అంతేకాదు ఇలా రెగ్యులర్ ఆ కార్యంలో పాల్గొంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. చాలా మంది వివాహిత జంటలు పెళ్లైన కొత్తలో పాల్గొన్నంత ఉత్సాహంగా, పిల్లలు పుట్టాక లేదా కొంత కాలం తర్వాత ఆ కార్యంపై అంతగా ఆసక్తి చూపడం లేదంట. మరికొంత మంది జంటలు అయితే ఏకంగా కలయికలో పాల్గొనడమే మానేశారట.

దీనికి కొందరు కపుల్స్ చాలా విచిత్రమైన కారణాలను చెబుతున్నారు. తమ భాగస్వామితో తమకు శారీరకంగా ఎలాంటి రిలేషన్ కొనసాగించకుండానే తాము వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నామని ఓ సర్వే సంస్థకు ఓపెన్ గా చెప్పేశారు. ఈ సర్వేలో ఆ దంపతులు చెప్పే ఆసక్తికరమైన విషయాలేంటి.. వారు చెప్పే కారణాలు కరెక్టో కాదో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఫీలింగ్స్ కలగడం లేదు..
‘నా భార్యను తాకినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు. పెళ్లైన కొత్తలో ఓ మంచి అనుభూతి ఉండేది. అయితే ఇది నాకు మాత్రమే అనుకుంటే.. తనకు కూడా అలాగే ఉందట. అందుకే మేమిద్దరం ఆ కార్యంలో కలిసి పాల్గొనడం మానేశాం. అయితే మేమిద్దరం కలిసే ఉంటున్నాం. కానీ శారీరకంగా మాత్రం రిలేషన్ మానేశాం' అని ఓ వ్యక్తి చెప్పడం గమనార్హం.

‘ఆకర్షణ ఉండటం లేదు’..
‘పెళ్లైన కొంత కాలం తర్వాత నా భార్య నాకు ఆకర్షితురాలు కావడం లేదనే భావన నాలో కలుగుతోంది. దీనికి నేను కొంచెం లావు కావడమే కారణమేమో అనిపిస్తోంది. ఎందుకంటే గత ఏడాది నుండి నేను చాలా లావయ్యాను. నిరంతరం వెయిట్ పెరుగుతూనే ఉంది. అందుకే నా భార్య నన్ను దూరం పెడుతోందేమో అనిపిస్తుంది' అని 38 ఏళ్ల సాహిల్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.

‘పిల్లలు పుట్టారని’..
‘మాకు బిడ్డ పుట్టిన వెంటనే మేము ఆ కార్యంలో పాల్గొనడాన్ని మానేశాం. మాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే మేము ఎల్లప్పుడూ మా బిడ్డను చూసుకోవడంలోనే చాలా బిజీగా గడిపేస్తున్నాం. దీంతో మాకు కలయికకు సమయం దొరకడం లేదు. ఒకవేళ టైమ్ దొరికినా మాకు మూడ్ రావడం లేదు. అయినా కూడా మేమిద్దరం ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా ప్రేమించుకుంటాం. కానీ ఆ కార్యం లేకపోవడమే నన్ను చాలా కలవరపెడుతోంది. వారంలో కనీసం ఒకసారైనా తనతో సన్నిహితంగా కలవాలని నాకు ఆశగా ఉంటుంది' అని 34 సంవత్సరాల వర్ష తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

మెడిసిన్ ఎఫెక్ట్స్..
‘మా పెళ్లైన రెండో సంవత్సరంలోనే నా భార్య గర్భాశయం చుట్టూ శస్ర్తచికిత్స జరిగింది. వైద్యులు ఆమెకు సూచించిన మందులు ఆమె లైంగిక కోరికలను నెమ్మదిగా ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవానికి ఆమె నాతో సన్నిహితంగా ఉంటోంది. కానీ తనలో కోరికలే లేవు. అది నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది' అని 39 ఏళ్ల ఫరీక్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

కేవలం కవరింగ్..
‘నా భర్త తన అబద్ధాలను కప్పిపుచ్చుకునేందుకు లేదా మేమిద్దరూ ఎప్పుడైనా గొడవ పడినప్పుడు మాత్రమే ఆ కార్యంలో పాల్గొనడానికి ప్రయత్నిస్తాడు. అయితే రెగ్యులర్ గా తను కలయికకు అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఆ కార్యం కోసం రెడీగా ఉంటానని తెలుసు. కానీ ఇది నాకు విచారంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆకర్షణీయంగా మరియు అందంగా ఉన్నందున తను నాతో ఆ కార్యం చేసేందుకు ఇష్టపడ్డాడని భావించాను. కానీ తను మాత్రం వివాదాల నుండి తప్పించుకునేందుకే అలా చేశాడని తెలిస్తే నా మనసు తట్టుకోలేకపోతుంది. ఇలాంటి వాటి వల్ల నాకు ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోతుంది' అని 43 ఏళ్ల ప్రేరణ తన అనుభవాలను వెల్లడించారు.

నేను ఎంత ప్రయత్నించినా..
‘నా భార్య నాకంటే చాలా అందగా ఉంటుంది. సాధారణ సమయంలో చాలా చురుకుగా ఉంటుంది. కానీ ఆ కార్యం వరకు వచ్చేసరికి నేను అనుభూతి చెందినంత, తను ఆస్వాదించలేకపోతుంది. ఇది నన్ను చాలా బాధపెడుతుంది. దీని గురించి నేను తనతో చాలా సార్లు మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ఆమె ప్రతిసారీ ఈ టాపిక్ ను డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే నేను తనతో ఆ కార్యం చేయడమే మానేశాను. దీనికి బదులుగా నేను సహస్త్రాలతో హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాను' అని 40 ఏళ్ల అమిష్ తను బాధను వెళ్లగక్కాడు.

ఇక ప్రేమించను..
‘నేను ఇకపై నా భర్తను ప్రేమించను. మొదట నేను తనతో ప్రేమలో పడ్డాను. కానీ మా ఇద్దరికి విడాకులు తీసుకునేంత దూరం పెరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. అయితే తను ఒక వ్యక్తిగా మరియు తండ్రిగా మంచోడే. కానీ నేను తనతో ఆ కార్యంలో పాల్గొనడం మానేశాను. ఎందుకంటే విడాకుల వరకు వచ్చాక కలయికలో పాల్గొనడం అనేది చాలా అసంబద్ధం అనిపిస్తుంది. అయితే తనకు మాత్రం అందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే తను చాలా బిజీగా ఉన్నాడు. అందుకే నాకు తనతో కలవాలని లేదు' అని 37 ఏళ్ల రూబినా వాపోయింది.



Click it and Unblock the Notifications