Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
103 ఏళ్ల ముసలాడు మనవరాలి వయసున్న మగువను మనువాడాడు... గర్భవతిని చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు...
ఈ ప్రపంచంలో వందేళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరూ ఈ జీవితంలో సెంచరీ కొట్టినందుకు ఇక తమ జీవితం ధన్యమని అనుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.
ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటే ఏమో అనుకున్నాం.. ఇప్పటివరకు వధువు కంటే వరుడు ఐదేళ్లు లేదా ఆరేళ్లు మహా అయితే పది, పన్నెండేళ్ల వయసు అంతరం ఉండేది. ఇలాంటి జంటలను మనం ఇప్పటికే ఎన్నో చూశాం.

చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ వందేళ్లు దాటిన ముసలాడు మాత్రం మనవరాలి వయసున్న మగువను మనువాడాడు. అది కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడంట.

దీనికి ఆశ్చర్యపోయారు అందరూ. ఇంతటితో ఆగకుండా ఆ ముసలాడు ఆ యువతిని కడుపు కూడా తెప్పించాడు. ఈ విషయాన్ని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయం కాస్త ప్రపంచమంతా పాకింది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అయిపోయింది. ఇంతకీ ముసలాడు ఎవరు? ఈ వయసులో ప్రేమ ఎలా పుట్టింది. తనకు అంత స్టామినా ఎలా తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే...
వందేళ్లు దాటినవారు..
ఈ ప్రపంచంలో వందేళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరూ ఈ జీవితంలో సెంచరీ కొట్టినందుకు ఇక తమ జీవితం ధన్యమని అనుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ మన దేశంలో వందేళ్లు దాటిన ముసలి వారంతా హాయిగా క్రిష్ణా, రామా అంటూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా కొందరు ఈ వయసులో ఫిట్ గా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ ఉంటారు.

విచిత్ర పెళ్లి...
అయితే ఇండోనేషియాలో 103 ఏళ్ల ముసలాడు మాత్రం ఓ విచిత్రమైన పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ప్రేమ వివాహం. ఎవరితో తెలిస్తే మీరు కచ్చితంగా అవాక్కవుతారు. కేవలం 27 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎంతంటే అక్షరాల 76 ఏళ్లు..

మీడియా కథనం మేరకు..
మీడియా కథనం మేరకు పుఆంగ్ 1945 ఇండోనేషియా యుద్ధం సమయంలో మిలీటరీ కర్నల్ గా పని చేశాడు. వధువు ఇండో అలంగ్ కి పెళ్లికి ముందు తన భర్త వయసు ఓ వంద వరకు ఉంటుందని మాత్రమే తెలుసట. కానీ ఆయనకు 103 ఏళ్ల వయసు ఉందని పెళ్లి తర్వాతే ఉందని తెలిసిందట.

కన్యాశుల్కం ఇచ్చాడట..
వీరి ప్రేమ నుండి పెళ్లి వరకు ప్రతి ఒక్కరికీ ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారట. ఈ ముసలాడు తనను యువతి పెళ్లి చేసుకొన్నందుకు ఆ యువతికే కన్యాశుల్కం ఇచ్చాడట. 25 వేల రూపాయల నగదుతో పాటు ఒక బంగారం ఉంగరం సమర్పించుకున్నాడట.

కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..
వీరి పెళ్లి వార్త ఎంత విన్నవారంతా ఆశ్చర్యపోతుంటే.. వీరి వివాహానికి దారి తీసిన కారణం గురించి తెలిస్తే కచ్చితంగా షాకవుతారు. నిజానికి ఇండో అలంగ్ తన బాయ్ ఫ్రెండ్ తో గొడవపడి విడిపోయినప్పుడు ఆమె తన బాధను పొరుగునే ఉన్న పు ఆంగ్ తో పంచుకొందట. ఆ సమయంలో పుఆంగ్ చూపిన ఆప్యాయతకు ఫిదా అయిన ఆమె అతని(తాతయ్య)తో ప్రేమలో పడిందట.

అలా ఒక్కటయ్యారట..
ఆ తర్వాత వారిద్దరూ శారీరకంగా కూడా ఒక్కటయ్యారట. ఆ తర్వాత ఆమె గర్భవతి అని తెలియగానే లేటు వయసులో తండ్రి కాబోతున్నుందుకు పుఆంగ్ సంతోషానికి హద్దు లేకుండా పోయింది.

అప్పుడే పెళ్లి నిర్ణయం..
ఆ తర్వాతే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం వీరిద్దరూ సుఖంగా.. సంతోషంగా ఆలుమగల జీవనాన్ని కొనసాగిస్తున్నారట.

ప్రేమకు వయసుతో సంబంధం లేదు..
ప్రేమకు వయసుతో పని లేదు అని మీరు సినిమాల్లో చూస్తు ఉంటారు. అంతే కాదండోయ్ అప్పుడప్పుడు వింటూ ఉంటారు. కానీ అదంతా నిజమనేందుకు వీరి వివాహాన్ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.



Click it and Unblock the Notifications
