Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
పడకగదిలో ఇవి పెట్టుకుంటే.. పార్ట్ నర్ తో ప్రతిరోజూ పండగే...!
మీ వివాహ బంధం మరింత బలంగా మారడానికి పాటించాల్సిన పరిహారాలేంటో చూసెయ్యండి.
ఈ లోకంలో పెళ్లి చేసుకుని ఏడడుగులు నడిచిన ప్రతి ఒక్క జంట తమ వైవాహిక జీవితంలో కలకాలం ఎలాంటి కలహాలు లేకుండా హ్యాపీగా మరియు రొమాంటిక్ గా ఉండాలని కోరుకుంటారు.

అయితే అలాంటి ఆనందకరమైన జీవితాలను కేవలం కొన్ని జంటలే పొందుతాయి. కొందరేమో పెళ్లైన కొత్తలో బెల్లం చుట్టూ చీమల్లా.. తమ పార్ట్ నర్ కొంగు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎన్ని ముఖ్యమైన పనులున్న ఆ సమయంలో మాత్రం అన్నీ పక్కనబెట్టేస్తారు.

అయితే కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్క జంటలో ఉత్సాహం తగ్గిపోతుంది. కొత్తలో ఉన్నంత ఊపు, ఉత్సాహం క్రమేణా కనిపించదు. చాలా సందర్భాల్లో ప్రతి చిన్న విషయానికీ గొడవ పడుతూ ఉంటారు.

అయితే అలా జరగకుండా.. మీ కాపురం సాఫీగా సాగాలంటే.. జ్యోతిష్యశాస్త్రం కొన్ని పరిహారాలు పాటించాలట. అవి పాటిస్తే మీ మ్యారేజ్ లైఫ్ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటుందట. ఇంకెందుకు ఆలస్యం ఆ పరిహారాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

ఆ ఫోటో..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, పడకగదిలో మీరు రాధాక్రిష్ణుల ఫొటో పెట్టుకుంటే.. భార్యభర్తల మధ్య బంధం మరింత బలంగా మారుతుందట. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఆ రాధాక్రిష్ణుల ఫొటోలను మీ బెడ్ రూమ్ లో సెట్ చేసుకోండి. మీ బంధాన్ని మరింత సన్నిహితంగా మార్చుకోండి.

నైరుతి ప్రాంతంలో..
మీ బెడ్ రూమ్ లో నైరుతి వైపు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అక్కడ ఒక స్వచ్చమైన మరియు నాణ్యమైన క్రిస్టల్ ను ఉంచితే మంచి ఫలితాలు కచ్చితంగా వస్తాయట. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరిలో పాజిటివ్ ఎనర్జీ చేరుతుందట. దీని వల్ల మీరు చాలా ఉత్సాహంగా ఉంటారట.

నెమలి పింఛాలను..
మనలో చాలా మంది చిన్నప్పుడు పుస్తకాలలో నెమలి పింఛాలను ఉంచుకుని మురిసిపోయేవాళ్లం. అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా? ఇదే నెమలి పింఛం భార్యభర్తల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందట. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీ పడకగదిలో వాయువ్య ప్రాంతంలో ఈ నెమలి పింఛాలను ఉంచితే మీ ఇద్దరిలో సానుకూల శక్తి వస్తుందట.

సున్నితమైన రంగులు..
అలాగే మీ ఇంట్లో ఉండే ఫర్నీచర్ కూడా మీ ఇద్దరి మధ్య మూడ్ ను డిసైడ్ చేస్తాయట. ముఖ్యంగా అవి ఉండే రంగుల వల్ల మీరు బాగా ప్రభావితమవుతారట. అందులోనూ గులాబీ, నీలి, తెలుపు వంటి రంగులైతేనే ఉత్తమంగా పనిచేస్తాయట. మిగిలినవి అంతగా పని చేయవని నిపుణులు చెబుతున్నారు.

మానసికంగా మెరుగ్గా..
మీ వైవాహిక జీవితంలో భార్యభర్తల్లో ఎవరికైనా కోపం అదే పనిగా వస్తుంటే.. మీరు దాని నుండి తప్పించుకోవడానికి లేదా మీ కోపాన్ని తగ్గించుకోవడానికి మీరు ఎక్కువగా మీ లివింగ్ రూమ్ లోని వాయువ్య మూలలో కూర్చుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయట. అంతేకాదు అలా కూర్చోవడం వల్ల మీ మానసిక స్థితి మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

తెల్లని పావురం..
మీ పడకగదిలో మీరు నిరంతరం ఉత్సాహంగా ఉండటానికి పైన చెప్పిన పరిహారాలతో పాటు దీన్ని కూడా ప్రయత్నించొచ్చు. మీ బెడ్ రూమ్ లో వాయువ్య ప్రాంతంలో ఉండే గోడపై ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్టు కనిపించే తెల్ల పావురం యొక్క ఫొటోనే ఉంచాలట. అయితే అందులో నీరు ఉన్నట్టు కనిపించకూడదట. ఇలా చేయడం వల్ల భార్యభర్తల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం పెరిగి మీ బంధం మరింత బలంగా మారుతుందట.



Click it and Unblock the Notifications
