Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ప్రతి మహిళ తన భర్త వద్ద దాచే రహస్యాలు ఏమిటో తెలుసా..
మహిళలు మరియు మగవారు ఇద్దరు సాధారణంగా కలయిక పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ విషయంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరికీ కొన్ని అంచనాలు ఉంటారు.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రతిదీ రహస్యంగా ఉంచాలనుకుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచితే ప్రతిదీ రహస్యంగా ఉండిపోతుంది. ఇక విషయానికొస్తే రహస్యం అనేది ప్రేమ లాగే చాలా సహజమైనది. ప్రేమకు, పెళ్లికి సంబంధించి కొన్ని రహస్యాలు ఉంటాయి. అవి గోప్యంగా ఉన్నంత కాలం, వారి జీవితాలు సాఫీగా సాగిపోతాయి.

మీరు మీ భాగస్వామితో ఎంత సన్నిహితంగా ఉన్నా మీ కొన్ని రహస్యాలు మీ వద్ద ఉంచుకోవమే మంచిది. ఇది స్త్రీ, పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో రహస్యం అనేది మనల్ని చిక్కుల్లోపడేస్తుంది. జంటల మధ్య రహస్యం లేదని మీరు అనుకుంటే అది అవివేకమే అవుతుంది. ముఖ్యంగా మహిళల్లో కచ్చితంగా కొన్ని రహస్యాలు ఉంటాయి. వాటికి సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రేమ విషయంలో..
మహిళలు తమ ప్రేమ విషయంలో వారి భర్తకు ఎక్కువగా అబద్ధమే చెబుతుంటారు. ఎందుకంటే అది వారి ప్రస్తుత ప్రేమ కాదని మరియు వారి వివాహాన్ని అది ప్రభావితం చేస్తుందని వారు గట్టిగా నమ్ముతారు. ఒకవేళ భర్త ముందుగానే వారి ప్రేమ విషయాన్ని గ్రహించి గట్టిగా అడిగితే ఆ సమయంలో మాత్రం తమకు ఒకే ప్రేమ ఉందని తరచుగా చెబుతారు. ఇది నిజం కావచ్చు మరియు అబద్ధమూ కావచ్చు. కానీ అసలు నిజం మాత్రం కేవలం అమ్మాయిలకే తెలుసు.

కలయిక విషయంలో..
మహిళలు మరియు మగవారు ఇద్దరు సాధారణంగా కలయిక పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ విషయంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరికీ కొన్ని అంచనాలు ఉంటారు. కానీ ఎక్కువ మంది మహిళలు వీటిని బయటపెట్టరు. దీని వల్ల భర్త కలయిక విషయంలో సంతృప్తి చెందకపోవచ్చు. అయినా కూడా స్త్రీలలో చాలా మంది ఇలాంటి వాటిని రహస్యంగానే ఉంచుతారు.

అది వ్యక్తిగత హక్కు..
చాలా మంది మహిళలు రహస్యం అనేది సాధారణంగా చూడాలి. పురుషులు ఇలాంటి వాటిని ఎక్కువగా పట్టించుకోరు. వీటి వల్ల తమ గుర్తింపు తప్పుగా పరిగణించబడుతుందని మహిళలు అనుకోవచ్చు. కానీ అది వారి వ్యక్తిగత హక్కు లేదా సంకల్పం అని వారు భావించరు.

స్నేహితుల గురించి..
చాలా మంది మహిళలు వారి కుటుంబసభ్యులతో వారి స్నేహితుల గురించి నిజాలను చెప్పరు. ఇక వారి భాగస్వాములతో అయితే అస్సలు వెల్లడించరు. ఇది వారి జీవితంలో సమస్యలను కలిగిస్తుందని వారు భయపడతారు.

అనుకూలంగా అనిపిస్తే..
మహిళలు తమ భర్త తమ కుటుంబం గురించి ఏమనుకుంటున్నారో భర్తకు ఎప్పటికీ చెప్పరు. ఒకవేళ వారికి భర్త పట్ల అనుకూలత అనిపిస్తే మాత్రమే వారు విషయలను బయటపెడతారు. భర్త తమ పట్ల ప్రతికూలంగా ఉంటే మాత్రం విషయాలను ఎప్పటికీ బయటికి చెప్పలేరు.

అసూయను కూడా..
మహిళలు తమ భర్త నుండి ప్రేమను పొందితే ఎల్లప్పుడూ ఆనందిస్తారు. అయితే కొంత మంది మహిళలు వారు ఏదైనా విషయంలో అసహ్యించుకున్నా కూడా, వారు తమ భర్త అసూయను కూడా రహస్యంగా ఆరాధిస్తారు.

వారు ఇష్టపడకపోయినా..
మహిళల భర్తలు వారి దుస్తులను ఇష్టపడకపోయినా లేదా అవి వారికి సరిపోకపోతే వెంటనే నచ్చలేదు అని చెప్పరు. సర్దుకుపోతారు. కాని వారు భర్త కళ్లను బట్టి అందగా ఉన్నట్లు తెలుసుకుంటారు.

పిల్లతనం అలవాట్లు..
మహిళలు తమకు ఉన్న కొన్ని చెడు లేదా పిల్లతనం అలవాట్లను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుతారు. ఎందుకంటే దీని వల్ల భర్త చేతిలో వారు ఎగతాళికి గురయ్యే అవకాశం ఉంటుందని భావిస్తారు. లేదా తమ భర్త తప్పుగా అర్థం చేసుకుంటారని అనుకుంటారు.

షాపింగ్ చేయడం..
ఈ రోజుల్లో దాదాపు 90 శాతం మందికి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మహిళలు తాము కొన్న వస్తువులను నిత్యం దాచుకుంటారు. ఒక వేళ వారికి సంబంధించిన కొత్త వస్తువులు లేదా బట్టలు ఏవైనా బయటపడితే మాత్రం ఇది పుట్టింటి వారు ఇచ్చారని అబద్ధం చెబుతారు తప్ప, వారే కొన్నట్లు నిజం చెప్పరు.

అందం గురించి..
చాలా మంది వివాహిత మహిళలు తమ భర్త అందం గురించి ఎక్కువగా ప్రస్తావించరు. అందులోనూ ఒక పురుషుడితో పోలిక పెట్టి వారి ఆనందాలను కూడా దూరం చేయరని ఇటీవల ఓ సర్వేలో తేలింది.

తరచూ తనిఖీలు..
చాలా మంది మహిళలు తరచూ తమ భర్తకు సంబంధించిన వాటిని చెక్ చేస్తూ ఉంటారు. సెల్ ఫోన్, వ్యాలెట్ ఇతర వస్తువులను తనిఖీ చేస్తారు. ఏదైనా తప్పు జరిగితే వారితో గొడవ పెట్టుకుంటారు, లేకుంటే అవి చివరి రహస్యంగానే ఉండిపోతాయి.



Click it and Unblock the Notifications
