For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివాహ ఆచారాలలో ఇలాంటివి కూడా ఉంటాయా? శోభనం గదిలోకి ముగ్గురు వెళ్తారంట...!

ఈ వివాహానికి సంబంధించి ఈ విశ్వంలో కొన్ని వింతైన ఆచారాలు కూడా ఉన్నాయి. ఆ ఆచారాలను మీరు వింటే ఆశ్చర్యపోయడం ఖాయం...

|

ఈ విశ్వంలో ఏ దేశంలో నివసించే వారయినా.. ఏ ప్రాంతంలో జీవించే వారైనా ఆడవారు, మగవారు కలిసి జీవించేందుకు పెళ్లి అనే ఒక ప్రత్యేకమైన బంధం కచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆయా దేశాలు.. ఆయా ప్రాంతాలను పెళ్లికి సంబంధించిన ఆచారాలు రకరకాలుగా ఉంటాయి.

Strange Marriage Rituals around the world

మన దేశంలో పెళ్లిళ్ల ఆచారాలు ఎంత సంప్రదాయబద్ధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎన్నో కట్టుబాట్లు, కార్యక్రమాలు, పద్ధతులు, బంధువుల హడావుడి, ఊరేగింపుల హడావుడి అబ్బో ఎన్నో ఉంటాయి. అయితే ఈ వివాహానికి సంబంధించి ఈ విశ్వంలో కొన్ని వింతైన ఆచారాలు కూడా ఉన్నాయి. ఆ ఆచారాలను మీరు వింటే ఆశ్చర్యపోయడం ఖాయం... ఆ విశేషాలేంటో మీరే చూడండి...

గంటసేపు ఏడ్వాల్సిందే...

గంటసేపు ఏడ్వాల్సిందే...

చైనాలో జరిగే వివాహ కార్యక్రమంలో పెళ్లికి ఒక నెల ముందు నుండి వధువు ప్రతిరోజూ ఒక గంట పాటు ఏడుస్తూ ఉంటుందట. అంతేకాదండోయ్ పది రోజుల ముందు వధువు తల్లి కూడా ఆమెకు ఏడవటంలో తోడవుతుందట. వీరికి పాటలో కోరస్ పాడినట్టు.. వధువు అమ్మమ్మ, సోదరీమణులు కూడా తోడుగా ఏడవటం ప్రారంభిస్తారట. ఇలా మొత్తం అందరూ కలిసి ఏడుస్తుంటే అది కూడా కాస్త వినసొంపుగా ఉంటుందట. అయితే ఆ ఏడుపులో వాళ్లు చాలా హావాభావాలు పలికిస్తారట.

ఉమ్మి వేస్తే మంచి జరుగుతుందట..

ఉమ్మి వేస్తే మంచి జరుగుతుందట..

ఇక ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలో వివాహానికి ఒక వింతైన ఆచారం ఉందట. మస్సాయ్ అనే తెగ వారు పెళ్లి తంతును అందరికంటే భిన్నంగా చేస్తారట. వీరి ఆచారం ప్రకారం పెళ్లికూతురు తండ్రి తన కూతురి తలపై, రొమ్ములపై ఉమ్మి వేస్తారట. ఇలా చేయడం వల్ల తన కూతురికి మంచి జరుగుతుందని భావిస్తారట. అలా ఆశీర్వదించడం వారి ఆచారమట.

కొత్త జంటతో మరొకరు...

కొత్త జంటతో మరొకరు...

ఆఫ్రికా ఖండంలోని మరో దేశంలో ఒక తెగ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన తొలి రాత్రి శోభనం సందర్భంగా కొత్త దంపతులకు తోడుగా మరో మహిళను అందంగా అలంకరించి వారి గదిలోకి పంపుతారట. అయితే ఆమె వధువు తల్లి లేదా బంధువుల్లో ఎవరైనా పెద్ద వయస్కురాలై ఉంటారట. ఆ రాత్రి కొత్త జంట శోభనానికి వారు దగ్గరుండి మరీ సలహాలు, సూచనలు ఇస్తారంట.

ప్రత్యక్ష నరకాన్ని చూస్తారు.

ప్రత్యక్ష నరకాన్ని చూస్తారు.

ఆసియాలోనే అతిపెద్ద ద్వీపమైన బోర్నియోలో నివాసముంటున్న తిదోంగ్ అనే జాతి యొక్క వివాహ సాంప్రదాయం గురించి వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడ వారి ఆచారం ప్రకారం వివాహం అయిన మూడు రోజుల వరకు వధూవరులను ఓ గదిలో బంధిస్తారట. అక్కడి నుండి వార 3 రోజులకు బయటకు రాకూడదట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వారు ఉండే రూమ్ లో ఎలాంటి వాష్ రూమ్ ఉండదట. ఆ మూడు రోజులు వారు ఫ్రెషప్ అవ్వటానికి ఎలాంటి అవకాశం దొరకదట. అలా ఆ మూడు రోజులు వారు ప్రత్యక్ష నరకం చూస్తారట.

పెళ్లికి ముందు కోడిపిల్ల బలి..

పెళ్లికి ముందు కోడిపిల్ల బలి..

చైనా, మంగోలియాల్లో నివసించే దౌర్ తెగ వారి వివాహ ఆచారాలు కూడా విచిత్రంగానే ఉంటాయి. వీరి సంప్రదాయం ప్రకారం వధూవరులు ఇద్దరు కలిసి ఒక కోడిపిల్లను వధించాల్సి ఉంటుందట. ఇద్దరు కలిసి కోడి పిల్లను కత్తితో పీక కోసి, దాని నుండి లివర్ బయటకు తీసి పరిశీలిస్తారట. ఒకవేళ అది బాగుంది అనుకుంటే, వెంటనే పెళ్లి తేదీని నిర్ణయిస్తారట. ఒకవేళ అలా జరగకపోతే.. లివర్ మంచిగా వచ్చేంతవరకు ఎన్ని కోడిపిల్లలనైనా బలి ఇస్తూనే ఉంటారట

చనిపోయిన చేపను..

చనిపోయిన చేపను..

దక్షిణ కొరియాలో వివాహ సాంప్రదాయం ప్రకారం, వరుడిని శోభనం గదిలోకి పంపించే ముందు ఓ వింతైన కార్యక్రమం జరుగుతుందట. వరుడు రాత్రి తన భాగస్వామితో కలవడానికి ముందు ‘చనిపోయిన చేప‘, ‘వెదురు బొంగు‘తో వరుడి అరిపాదాలతో చితకబాదుతారట. అక్కడి పెళ్లి తంతులో ఇదో సరదా ఘట్టంగా జరుపుకుంటారట.

వంట సామాగ్రిని..

వంట సామాగ్రిని..

జర్మనీలో పెళ్లికి సంబంధించి పెద్దగా వింతేమీ లేనప్పటికీ... వంటల దగ్గర చాలా విచిత్రాలు జరుగుతాయి. అక్కడ పెళ్లికి చేసిన వంటల్ని మొత్తం పెళ్లికి కొందరు పాడు చేస్తారట. వంటసామాగ్రిని చిందరవందరచేసి వెళ్లిపోతారట. దీంతో అక్కడ రకరకాల శబ్దాలు వస్తాయట. ఇలా చేస్తే పెళ్లికొడుకు, పెళ్లికూతురు మధ్య బంధం బలపడి వారు కలకాలం మంచిగా కాపురం చేసుకుంటారని వారి నమ్మకం. అయితే పెళ్లికి వచ్చినవారు తినడం కోసం పెళ్లి వారు ప్రత్యేకంగా వంటలు రెడీ చేస్తారట.

టాయ్ లెట్ సాంప్రదాయం..

టాయ్ లెట్ సాంప్రదాయం..

దీని గురించి మనం వినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఆచారం వింటే మనకు కడుపులో ఏదో తిప్పినట్టు అవుతుంది. అంతేకాదండోయ్ వాంతులు చేసుకునే అవకాశం ఉంది. అంత భయంకరంగా ఉంటుంది అక్కడి ఆచారం. అదేంటంటే ఫ్రాన్స్ లో పెళ్లయిన వారితో టాయ్ లెట్ లో ఉండే ఒక పానీయాన్ని తాగించే సంప్రదాయం ఉందట. అయితే ఇప్పుడు దాన్ని కొంత మార్చి, ఇప్పుడు చాక్లెట్, ఛాంపాగ్నే వంటి వాటిని టాయ్ లెట్ లో పోసి మరీ తాగిస్తున్నారంట.

English summary

Strange Marriage Rituals around the world

Here are the strange marriage rituals around the world. Take a look
Desktop Bottom Promotion