Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
భాగస్వామికి ఈ అబద్ధాలు చెప్పండి, వాటి వల్ల బంధం బలోపేతం అవుతుంది
జీవితభాగస్వామితో అబద్ధాలు చెప్పొద్దని, నిజాయితీగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. అయితే ఈ అబద్ధాలు చెప్పడం వల్ల దంపతుల బంధం బలోపేతం అవుతుంది. అసలు ఆ అబద్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ సంబంధం అయినా ప్రేమ, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ప్రేమ ఉన్న రిలేషన్ ఏదైనా సక్సెస్ అవుతుంది. దీనికి నమ్మకం తోడైతే ఆ బంధం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. పార్ట్‌నర్ పట్ల నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. ఏ సంబంధం అయినా అది ప్రేమ, నమ్మకం, నిజాయితీ, విశ్వాసాలపై నిలబడుతుంది. జీవిత భాగస్వామితో ఎంత నిజాయితీగా ఉంటే వారిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం పెరుగుతుంది. దాంపత్య బంధం అనగానే చాలా మంది ఒక సూచన ఇస్తుంటారు. జీవిత భాగస్వామికి అబద్ధాలు చెప్పకూడదని అంటారు.

జీవితభాగస్వామితో అబద్ధాలు చెప్పొద్దని, నిజాయితీగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. అయితే ఈ అబద్ధాలు చెప్పడం వల్ల దంపతుల బంధం బలోపేతం అవుతుంది. అసలు ఆ అబద్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారంపై అభినందనలు
దాంపత్య బంధం అన్నాక కలిసే ఉంటారు. కలిసి ఉన్న సంబంధంలో వంట చేయడం సాధారణంగా చేసే పని. అయితే ఈ విషయంలో అబద్ధాలు చెప్పడం వల్ల బంధం బలోపేతం అవుతుందని అంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. జీవిత భాగస్వామి మన కోసం ప్రేమతో వంట చేసినప్పుడు అది రుచిగా లేకపోయినా టేస్టీగా ఉందని చెప్పడం ద్వారా మీపై వారికి మంచి అభిప్రాయమే ఏర్పడుతుంది. ఈ అబద్ధం వల్ల మీపై వారికి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. చిన్న చిరునవ్వుతో వారిని పొగడటానికి ప్రయత్నించండి.

వారిచ్చిన బహుమతిని ప్రేమించండి
కొన్నిసార్లు లైఫ్ పార్ట్‌నర్స్ సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తుంటారు. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ మీకు నచ్చకపోవచ్చు. చొక్కా, వాచ్, డివైజ్ ఏదైనా కావొచ్చు. మీకు బాగుంటుందని భావించి బహుమతిగా ఇవ్వొచ్చు. అలాంటివి మీకు నచ్చకపోయినా, వారి మూడ్ పాడు చేయకుండా ఉండాలి. నచ్చకపోయినా చిరునవ్వుతో స్వీకరించాలి. సంతోషంగా బహుమతిని తీసుకోండి. బహుమతి గురించి కాకుండా వారి ప్రేమను గుర్తించండి.

కొత్తదనానికి ప్రయత్నించడం
భాగస్వామి కొత్తగా ప్రయత్నిస్తుంటే తప్పు జరిగితే నిజం చెప్పొద్దు. మీ భాగస్వామి ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని దుస్తులను మొదటి సారి ధరిస్తే, వారిని ఎగతాళి చేయడం లేదా చూసి నవ్వడం కంటే వారిని పొగడటం నేర్చుకోండి. మీ భాగస్వామి కెరీర్‌ను మార్చుకుంటున్నట్లయితే, భవిష్యత్తు గురించి చింతించకుండా లేదా వారి నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లే బదులు వారికి మద్దతు ఇవ్వండి.
భాగస్వామి నిర్ణయం మీకు నచ్చకపోవచ్చు. మీరు దీని గురించి వారితో హాయిగా మాట్లాడవచ్చు. కానీ పూర్తి నిజం చెప్పే బదులు, ఒక చిన్న అబద్ధం చెప్పడం ద్వారా వారి మనోధైర్యాన్ని పెంచవచ్చు.



Click it and Unblock the Notifications
