Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Relatioship Tips: మీ శృంగారానికి ఇదే అడ్డం.. దాన్ని పక్కన పెట్టారంటే..
చాలా సంబంధాలను స్మార్ట్ ఫోన్లు చంపేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వారి భార్య లేదా భర్తతో గడిపిన సమయం కంటే కూడా స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
సంబంధాలు చాలా మధురమైనవి.. అలాగే చాలా క్లిష్టమైనవి. ప్రతి దంపతుల మధ్య శృంగారం ఎంతో కీలకం. అది బాగుంటేనే ఆ బంధం సాఫీగా సాగుతుంది. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం చాలా అవసరం. సాన్నిహిత్యం బాగుంటే అది శృంగారానికి దారి తీస్తుంది. అయితే స్మార్ట్ డివైజుల వాడకం పెరిగిన ఈ కాలంలో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతోందని రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాలా సంబంధాలను స్మార్ట్ ఫోన్లు చంపేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వారి భార్య లేదా భర్తతో గడిపిన సమయం కంటే కూడా స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 2020లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం 41 శాతం మంది భారతీయులు తమ భాగస్వాములతో మాట్లాడటం కంటే తమ స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నారని పేర్కొంది.

1. కమ్యూనికేషన్
స్మార్ట్ ఫోన్లు సంబంధాల్లో శృంగారాన్ని చంపేస్తున్నాయి. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడానికి స్మార్ట్ ఫోన్లు కారణం. కొంత మంది వ్యక్తులు తమ భాగస్వాములు మాట్లాడుతున్నప్పుడ, తమ భాగస్వాములతో మాట్లాడుతున్నప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు. సోషల్ మీడియా, వాట్సాప్, మెసేజెస్, ఈ-మెయిల్స్ చెక్ చేస్తూ పరధ్యానంగా మాట్లాడుతుంటారు. దీని వల్ల వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ దెబ్బతింటుంది.
అందుకే జీవిత భాగస్వామితో మాట్లాడే సమయంలో ఫోన్ సహా ఏ ఇతర కార్యకలాపాల్లోనూ మునిగిపోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఒకరితో ఒకరు గడపడానికి సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో అది నాణ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం.

2. సాన్నిహిత్యం తగ్గడం
చాలా మంది వ్యక్తులు వారు పడుకునే ఆఖరి నిమిషం వరకు ఫోన్లు వాడుతూనే ఉంటారు. బెడ్ పై ఉండి కూడా ఫోన్ వాడుతూ, సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. కళ్లు మూతలు పడే వరకు ఫోన్ వాడి, ఆతర్వాత నిద్రలోకి జారుకుంటారు. దీని వల్ల బెడ్ పై కూడా దంపతులు సాన్నిహిత్యంగా ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది.
బెడ్రూములో ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలి. ఒక సమయం వరకు ఫోన్ వాడి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత కొంత సమయాన్ని భాగస్వామి కోసం వెచ్చించాలి. దీని వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది.

3. సోషల్ మీడియా
సోషల్ మీడియా ప్రస్తుత కాలంలో జీవితంలో భాగమైపోయింది. అది సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా అనారోగ్యకరమైన పోలికలు, అసూయకు దారి తీస్తుంది. ప్రత్యేకించి మన భాగస్వామి ఆన్ లైన్ లో ఇతరులతో చాటింగ్ చేయడం లాంటివి చేస్తున్నప్పుడు.
అతి ఎప్పుడూ అనర్థమే. సోషల్ మీడియాను వీలైనంత వరకు పరిమితిలో ఉంచాలి. మొత్తానికే వాడకుండా ఉండటం కూడా సరైన పరిష్కారం కాదు.

4. ఎమోషనల్ కనెక్షన్
దంపతుల మధ్య స్మార్ట్ ఫోన్లు భావోద్వేగ కనెక్షన్ కు ఆటంకం కలిగిస్తాయి. మాట్లాడకపోవడం, కలిసి సమయం వెచ్చించకపోవడం, సాన్నిహిత్యం లేకపోవడం వల్ల ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉండదు. దీని వల్ల సంబంధాలు చీలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.



Click it and Unblock the Notifications