Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
Couple Problems:పెళ్లయ్యాక.. పిల్లలు పుట్టాక.. ఆ పని చేద్దామంటే...
మీ భర్త మీ నుండి విడిపోతానంటే చేయాల్సిన పనులేంటో తెలుసుకోండి.
ఇటీవలి కాలంలో ఎంత వేగంగా ప్రేమలో పడుతున్నారో.. అంతే వేగంగా బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. అయితే కొందరు పెళ్లి చేసుకుని జీవితాంతం హాయిగా బతుకుదామని అడుగు ముందుకేస్తున్నారు.

తాము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భార్యభర్తలన్నాక ఏదో ఒక సందర్భంలో గొడవలు, వాదనలు రావడం అన్నది చాలా చాలా సహజం. అయితే కొందరు వీటిని పెద్దగా పట్టించుకోరు. మరికొందరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తుంటారు.

ఇలాంటి సమయంలో ఆలుమగలిద్దరిలో ఎవరో ఒకరు సహనంగా ఉంటే.. ఆ బంధం బలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్దల కారణంగా ఏవైనా తేడాలు వస్తే.. వాటిని పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

అయితే మీరు మీ భర్తతో ఎంతలా కలిసి ఉండాలనుకున్నా.. తను మీకు సహకరించకుండా.. దూరంగా ఉండటం.. లేనిపోని ఆరోపణలు, నిందలు వేయడం.. అస్తమానం అనుమానించడం వంటివి చేస్తుంటే.. మీకు తన నుండి విడిపోవాలనే ఆలోచన రావొచ్చు. ఒకవేళ మీరు నిజంగా మీ భర్త నుండి విడిపోవాలనే నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. మీరు ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాలేంటి.. విడాకుల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూసెయ్యండి.

విడిపోదామంటే..
భార్యభర్తల బంధం పాలు నీళ్లలా ఎప్పటికీ కలిసి ఉండాలని ప్రతి ఒక్క జంట కోరుకుంటారు. కానీ భర్త ఏదైనా సందర్భంలో భార్యకు దూరంగా ఉండాలని.. విడాకులు ఇవ్వాలని ఉందని చెప్పగానే.. చాలా మంది మహిళలు ఈ విషయాన్ని తట్టుకోలేరు. వారికి ఒక్కసారిగా గుండె పగిలిపోయినట్టనిపిస్తుంది.

రిక్వస్ట్ చేయొద్దు..
అయితే మీ భర్త విడిపోదామని చెబుతున్నారంటే.. తను మీ అవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారని అర్థం. కాబట్టి మీరు తన నుండి విడిపోవాలని లేకుంటే.. మీరు నిరంభ్యంతరంగా నో చెప్పొచ్చు. అంతేకాదు తనను మీరు రిక్వస్ట్ చేయాల్సిన పని కూడా లేదంటున్నారు నిపుణులు. ఒకవేళ తను విడాకుల పేరిట మిమ్మల్ని బెదిరిస్తే.. మీరు లొంగిపోతారని.. మీరు వద్దని రిక్వస్ట్ చేస్తారని చాలా మంది భావన. కాబట్టి మీరు ఒకవేళ అలా చేస్తే మీ విలువ తగ్గిపోతుందని గుర్తుంచుకోవాలి.

విడాకులు తీసుకుంటే..
ఒకవేళ మీ ఇద్దరి మధ్య గొడవలు తారస్థాయికి చేరి.. మీ బంధానికి గుడ్ బై చెప్పాలనుకుంటే మాత్రం మీరు మీ హక్కుల గురించి తప్పక తెలుసుకోవాలి. వాటిని వినియోగించుకోవాలి. మహిళలకు ఇలాంటి హక్కులు అన్ని దేశాల్లో ఉన్నాయి. కాబట్టి భరణం, పిల్లల పెంపకం, వారి బాధ్యత వంటి విషయాల్లో మీ భర్తను డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు శాపంగా వద్దు..
అయితే మీరిద్దరు విడిపోయి విడాకులు తీసుకుంటే.. అవి మీ పిల్లలకు శాపంగా మారకుండా చూసుకోవాలి. అలాగే మీ భర్త మీ నుండి విడిపోవడానికి సిద్ధపడ్డాడంటే.. అందులో మీ తప్పు కూడా ఉంటుందని, బంధువులు, కుటుంబసభ్యులు మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నింటికీ ఆన్సర్ ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉండాలి.

ఒంటరిగా ఉండేందుకు..
ఇప్పటివరకు మీరు చాలా విషయాల్లో మీ భర్తపై ఆధారపడి ఉంటారు. కాబట్టి మీరు ఇక నుండి ఒంటరిగా జీవించడం నేర్చుకోవాలి. అందుకోసం ఏమి చేయాలనే విషయాలన్నింటినీ తెలుసుకోవాలి. మీ భర్త మీకు విడాకులు ఇచ్చినంత మాత్రాన మీరు ఏదో తప్పు చేసినట్టు ఫీలవ్వాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. మీరు ఎలాంటి భయం లేకుండా సగర్వంగా జీవించొచ్చు.

భవిష్యత్తు గురించి..
మీరు విడాకులు తీసుకున్నాక.. తప్పు నాది.. నీది అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. జరిగిన దాన్ని తలచుకుంటూ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. అలాగే విడాకుల విషయంలో ఎవ్వరిపైనా ఆరోపణలు, నిందలు వేయకపోవడమే మంచిది. మీ భర్తపై విమర్శలు చేసినంత మాత్రాన మీకు ఒరిగింది ఏమీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలి.

అలాంటి ప్రయత్నం..
మీరు విడాకులు తీసుకున్నాక.. మీ భర్తకు గడిపిన క్షణాలు, ఆనంద సమయం అనేవి గుర్తుకొస్తూ ఉంటాయి. అంతేకాదు అవి మీ గాయాన్ని మరింత పెద్దవిగా చేసే ప్రమాదం ఉంది. అప్పుడు సమస్య నుండి బయటపడేందుకు కొత్త మార్గాలు అన్వేషించాలి. సాధ్యమైనంత త్వరగా ఆ గాయాన్ని మరచిపోయేందుకు మీ కంటూ ఓ సమయం కేటాయించుకోవాలి. నిత్యం పనిలో నిమగ్నం అవ్వడం వల్ల కచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుంది.

పరిస్థితులు చక్కబడేలా..
ముందుగా మీరు మీ ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. విడాకులు తీసుకున్నాక పదే పదే బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ విషయాన్ని పదే పదే మీ మెదడుకు చెబుతూ ఉండాలి. ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి.



Click it and Unblock the Notifications