Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
Zodiac signs: రాశిచక్రాన్ని బట్టి తమ లైఫ్ లో ఇలాంటి భాగస్వామి కావాలని కోరుకుంటారట...!
మీ రాశిని బట్టి మీ రిలేషన్ షిప్ లో ఇలాంటి రహస్య కోరికలు ఉంటాయట. అవేంటో ఇప్పుడే చూడండి.
ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం అయినా బలంగా ఉండాలంటే.. లాయల్టీ అనేది చాలా ముఖ్యం. ఒకరినొకర అర్థం చేసుకున్నప్పుడు వారి బంధం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని తమ భాగస్వామితో షేర్ చేసుకోవాలి.

అయితే చాలా మంది రిలేషన్ షిప్ లో ఉండే వారు చాలా విషయాలను సీక్రెట్ గా ఉంచుకుంటారు. దీంతో వారి బంధంలో చీలికలు రావడం.. దూరం పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి.

చాలా మంది కపుల్స్ తమ మనసులో తమకు కాబోయే భాగస్వామి గురించి ఏవేవో ఊహించుకుంటారు. వాటిని ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు. అసలు ఆ సీక్రెట్లను ఎప్పటికీ బయటపెట్టరు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల ఆధారంగా రాశిచక్రాలను బట్టి అలాంటి సీక్రెట్లను తెలుసుకోవచ్చు. తమ జీవితంలోకి ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది.. ఎవరైతే తమకు బాగా సూటవుతారని.. ఏ రాశి వారు ఏమని భావిస్తారు.. అసలు వారికి ఎలాంటి ఫాంటసీలు ఉంటాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు రిలేషన్ షిప్ లో నిజాయితీగా ఉంటారు. అయితే చాలా విషయాల్లో ఓపెన్ గా ఉంటారు. ఏదైనా చెప్పకూడని రహస్యాన్ని కూడా ఓపెన్ గా చెబుతారు. అయినా కూడా తమ భాగస్వామితో బంధాన్ని కొనసాగించడానికి ఆసక్తి చూపుతారు. తాము చేసే పనులన్నీ ప్రాక్టికల్ గా ఉండాలని కోరుకుంటారు. తమ లాయల్టీని ఇష్టపడే వ్యక్తులే భాగస్వామి రావాలని కోరుకుంటారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు రిలేషన్ షిప్ విషయంలో కొంత తత్తరపాటుకు గురవుతారు. ఈ కారణంగానే అందరినీ అపార్థం చేసుకుంటారు. అయితే తర్వాత వాస్తవం తెలుసుకుని పశ్చాత్తాపపడతారు. అయితే తాము తొందరపడినా.. తమను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తులే తమ లైఫ్ లోకి రావాలని కోరుకుంటారు.

మిధున రాశి..
ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో ఏవైనా పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో తమకు మద్దతుగా నిలిచే వారే భాగస్వామిగా రావాలని కోరుకుంటారు. ఇలాంటి వారి వల్ల తమ బంధం మరింత బలంగా మారుతుందని భావిస్తారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి జాలి, దయ ప్రేమ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు అందరూ అలాగే ఉండాలని కోరుకుంటారు. అందుకే తమ జీవిత భాగస్వామిలో కూడా అలాంటి లక్షణాలే ఉండాలని భావిస్తుంటారు. అలా ఉండే తమ జీవితం సాఫీగా సాగిపోతుందని ఊహించుకుంటూ ఉంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారు ఎల్లప్పుడూ ప్రపంచమంతా తమ గురించి మాట్లాడుకోవాలని లేదా తమ చుట్టూ ఉండే వారంతా తమ గురించి చర్చించుకోవాలని భావిస్తుంటారు. అయితే జీవిత భాగస్వామి విషయంలో మాత్రం వారికి నచ్చినట్టు ఉండాలని కోరుకుంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారు ప్రతి విషయంలో వంద శాతం ఫలితం రావాలని కోరుకుంటారు. అయితే ఇలాంటివి ఇతరులకు ఇబ్బందికి గురి చేస్తుంటాయని గుర్తించరు. అయితే తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా.. తమ మనసును చూసి ఇష్టపడాలని కోరుకుంటారు.

తుల రాశి..
ఈ రాశి వారు రిలేషన్ షిప్ లో చాలా నిజాయితీని కోరుకుంటారు. వీరు కేవలం ఒక్కరితోనే నిజమైన, నిజాయితీగా ఉండే బంధాన్ని కోరుకుంటారు. వీరు ఎల్లప్పుడూ తమ భాగస్వామి కూడా తమలా ఉండటాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ఉంటే లైఫ్ హ్యాపీగా సాగుతుందని వీరి నమ్మకం.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు ఏ విషయాన్ని అంత ఈజీగా బయటపెట్టరు. అయితే తమ లైఫ్ పార్ట్ నర్ విషయంలో మాత్రం నమ్మకం పెంచుకుంటారు. వారిపై విశ్వాసంతో అన్ని విషయాలను పంచుకుంటారు. ప్రతి విషయం వారితో షేర్ చేసుకుంటారు. అలాగే తమ భాగస్వామి కూడా అన్ని విషయాలను వీరితో పంచుకోవాలని భావిస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి లాంగ్ జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం. తమతో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లడాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి వారినే తమ జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటారు.

మకర రాశి..
ఈ రాశి వారు తమ లైఫ్ పార్ట్ నర్ నుండి ఎప్పుడూ ప్రశంసలు దక్కాలని కోరుకుంటారు. అయితే సాధారణ సమయాల్లో కాదు.. వీరు ఏదైనా ప్రయత్నంలో విజయం సాధించినప్పుడు వీరి నుండి ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేస్తారు. తమ నుండి తన భాగస్వామి ఎంతో నేర్చుకోవాలని.. తమను ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తూ ఉంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఫ్రీడమ్ కోరుకుంటారు. ముఖ్యంగా తమ జీవిత భాగస్వామిని స్వేచ్ఛను ఎక్కువగా ఆశిస్తారు. పెళ్లి అయిన తర్వాత కూడా తమకు నచ్చినట్టుగా ఉండాలని ఆశిస్తారు. తమను తమ లైఫ్ పార్ట్ నమ్మాలని కోరుకుంటారు. ఎవరైతే ఇలా ఉంటారో.. అలాంటి వ్యక్తులే తమ జీవితంలోకి రావాలని కోరుకుంటారు.

మీన రాశి..
ఈ రాశి వారు రిలేషన్ షిప్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు వివాహం చేసుకుంటే.. తమ జీవిత భాగస్వామి కూడా సంబంధానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని కోరుకుంటారు. అనునిత్యం తమ ప్రేమను గౌరవించే వ్యక్తి కావాలని మీరు కోరుకుంటారు.



Click it and Unblock the Notifications











