For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలు పాటించి మీ భాగస్వామి చేస్తున్న మోసాలను కనిపెట్టండి..

|

మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కాకుండా మరొక వ్యక్తిని ఇష్టపడుతున్నారని మీకు అనిపిస్తుందా? అతను / ఆమెలో అనుమానాస్పద వైఖరి కనిపిస్తుందా. తరచుగా అతను / ఆమె మొబైల్ ఫోన్‌ను దాచిపెడుతున్నారా?., మీ జీవిత భాగస్వామి ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా కార్యాలయం మరియు క్లయింట్ సమావేశాలలో ఎక్కువగా సమయాన్నివెచ్చిస్తూ, సమయానికి ఇంటికి తిరిగి రానట్లుగా అనిపిస్తూ ఉందా.

కొన్ని సమయాల్లో, మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు మనసుకు అనిపిస్తూ ఉంటుంది. మీకు కొన్ని సంకేతాలు ఉన్నప్పటికీ, 'మీరు అతిగా ఆలోచిస్తున్నారు' అంటూ మీ జీవితభాగస్వామి మీతో తరచుగా అంటూ మాట దాటేయవచ్చు. వాస్తవానికి వారు చెప్పేది నిజం కూడా అయి ఉండవచ్చు. కానీ అపోహలు, ఆలోచనలను చంపివేస్తుంది.

Want To Catch Your Cheating Spouse Red-Handed? 8 Tips That Will Help You

కొన్నిసార్లు సందేహం లేకుండా, అది కేవలం అపార్థం లేదా ఖచ్చితమైన సమస్య కావచ్చు. కాబట్టి ఆ సందర్భంలో, మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం ద్వారా మీరిద్దరూ ఒకే రకమైన ప్రేమలను కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేయడం ఎల్లప్పుడూ మంచిదిగా సూచించబడుతుంది.

మీ జీవిత భాగస్వామి అతను లేదా ఆమె శారీరక రూపానికి ఎక్కువ శ్రద్ధను వహిస్తూ, మీతో తక్కువ లేదా ఎక్కువ సమయం గడపడం మరియు వారి ఫోన్‌లో మామూలు రోజుల కన్నా భిన్నంగా బిజీ ఉండటం వంటి సంకేతాలు మీకు ఇదివరకే ఉంటే, అప్పుడు ఆలోచనలలో మార్పులు తలెత్తడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

కావున మీకు ఇటువంటి ఫీలింగ్ ఉన్న పక్షంలో, మరియు మీ జీవిత భాగస్వామిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావిస్తున్న పక్షంలో, క్రిందికి స్క్రోల్ చేసి వ్యాసంలో ముందుకు సాగండి. క్రమంగా కొన్ని ఆసక్తికరమైన చిట్కాలను పరిశీలించండి.

1. సంకేతాలను తరచుగా గమనిస్తూ ఉండండి.

1. సంకేతాలను తరచుగా గమనిస్తూ ఉండండి.

మీ భాగస్వామి అతను / ఆమె మిమ్మల్ని మోసం చేస్తున్నాడని ఆరోపించడానికి ముందు, మీకు తగినంత రుజువు ఉందని నిర్ధారించుకోండి. మీ జీవిత భాగస్వామి అతను లేదా ఆమె శారీరక స్వరూపం గురించిన శ్రద్ధను ఎక్కువగా కనబరుస్తున్న పక్షంలో, బయటికి వెళ్ళేటప్పుడు, కొత్త బట్టలు ధరించడం మరియు వినియోగించే పర్ఫ్యూమ్స్ పరిమళం వంటివి ప్రతిదీ ప్రామాణికాలుగా ఉంటాయి. కాల్‌లో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఆమె లేదా అతను గది నుండి బయటకు నడుస్తున్నప్పుడు మీ ఉనికిని తప్పించడం వంటివి చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా అనుమాస్పదంగా ఉంటుంది. కానీ ఇటువంటివి కేవలం సంబంధాల పరంగానే కాకుండా, వృత్తి ఆరోగ్య పరమైన సమస్యల కారణంగా కూడా ఉండవచ్చు, కావున ఆచితూచి అడుగువేయవలసి ఉంటుంది.

2. వారి మొబైల్ మరియు బ్రౌజర్ హిస్టరీ పరిశీలించడం ద్వారా ...

2. వారి మొబైల్ మరియు బ్రౌజర్ హిస్టరీ పరిశీలించడం ద్వారా ...

మీరు వారి మొబైల్ మరియు బ్రౌజర్ హిస్టరీ పరిశీలించడం ద్వారా కూడా కొన్ని విషయాలపట్ల అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. క్రమంగా మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవలి కార్యాచరణలను తెలుసుకోవచ్చు. అతను లేదా ఆమె ఏమిటో తెలుసుకోవడానికి మీరు వారి ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ యొక్క రీసైకిల్ బిన్‌ కూడా తనిఖీ చేయవచ్చు. మీ భాగస్వామి బ్రౌజర్ హిస్టరీని తొలగించడం ద్వారా స్మార్ట్-ప్లే చేస్తుంటే, మీరు అతను/ఆమె ఫోన్‌లో స్పైయింగ్ అనువర్తనాలను ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఈ స్పైయింగ్ అనువర్తనాలు తెలివిగా కనపడకుండా, ఒకరి ఫోన్‌లో దాచవచ్చు. కానీ, ఈ చర్యలు వారికి తెలిసినప్పుడు, వారి పరంగా ఎటువంటి తప్పూ లేనప్పుడు మీరు ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. కావున జాగ్రత్త తప్పనిసరి.

3. అప్రకటిత సందర్శన :

3. అప్రకటిత సందర్శన :

మీ జీవిత భాగస్వామి వేరొకరితో డేటింగ్ చేస్తున్నారని మీకు ఖచ్చితంగా తెలిసిన పక్షంలో, మీరు మీ జీవిత భాగస్వామి కార్యాలయానికి అప్రకటిత సందర్శనను ప్లాన్ చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తుంటే వారిని పట్టుకోవటానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. మీరు చేయవలసిందల్లా మీ జీవిత భాగస్వామి కార్యాలయానికి సమయం కాని సమయంలో అప్రకటితంగా చేరుకోవడం లేదా త్వరగా ఇంటికి వెళ్ళడం. దీనికై, మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి మరియు ఇటువంటి సందర్శనలు చేయడానికి ఒక నిర్దిష్టమైన కారణం అంటూ ఉండాలి.

మీరు 'ఐ మిస్ యు మరియు చూడాలని అనిపించి వచ్చేశాను" వంటి మాటలను వినియోగించవచ్చు. 'లేదా' నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆఫీస్ త్వరగా ముగిసింది, ఇంటికి త్వరగా వచ్చాను' వంటి మాటలను కూడా అనుసరించవచ్చు. క్రమంగా, మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చిరునవ్వుతో స్వాగతించారా, లేదా కోపంగా ఉన్నారా, లేదా ఏదైనా దాచడానికి ప్రయత్నిస్తున్నారా లేదా మీతో అనుమానాస్పద ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారా అని మీరు తనిఖీ చేయవచ్చు.

4. మీ సాధారణ నిద్ర సమయాలలో కూడా మార్పుని తీసుకురండి :

4. మీ సాధారణ నిద్ర సమయాలలో కూడా మార్పుని తీసుకురండి :

మీరు మీ నిద్ర దినచర్యలో కూడా అనూహ్యమైన మార్పును తీసుకురావచ్చు. మీ జీవిత భాగస్వామి పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన పనులను కలిగి ఉన్నారని పేర్కొంటూ రాత్రి వరకు ఆలస్యంగా మేల్కుని ఉంటూ ఉంటే, మీరు కూడా మేల్కొని ఉండి ఆమెకు సహాయకంగా ఉన్నట్లు ప్రయత్నించవచ్చు. మీరు మీ సహాయంలో మాత్రం నాటకాన్ని జోడించకండి. వారి పనయ్యాకనే నిద్రపోవాలనుకుంటున్నారని వారికి చెప్పండి.

లేదా మీరు నిద్రపోతున్నట్లు నటిస్తూ, మీ జీవిత భాగస్వామి ఎవరితోనైనా మాట్లాడుతున్నారా లేదా ఎక్కువసేపు టెర్రస్, బాల్కనీలలో ఉండిపోతున్నారా అని కూడా తనిఖీ చేయవచ్చు.

మోసం చేస్తున్న భాగస్వామిని పట్టుకోండిలా ....

5. వారి ప్రదేశంలో అనుకోకుండా నడవండి ..

5. వారి ప్రదేశంలో అనుకోకుండా నడవండి ..

మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారనే భావన మీకు ఉంటే, వారి గదిలో ఊహించని విధంగా తరచుగా నడవడం మంచిది. మీ జీవిత భాగస్వామి తన ల్యాప్‌టాప్‌తో బిజీగా ఉన్నప్పుడు మీరు ఊహించని విధంగా గదిలో నడవవచ్చు. కానీ వారు నిజంగా మిమ్మల్ని మోసం చేస్తున్నవారుగా ఉంటే, ప్లాన్స్ మార్చడం లేదా మీ పరంగా ప్లాన్స్ వేయడం చేయవచ్చు. కావున జాగ్రత్త తప్పనిసరి.

అతను లేదా ఆమె ఏ పని లేకుండా కూడా లాప్టాప్ లేదా మొబైల్స్ లో సమయాన్ని వెచ్చిస్తున్నారా అని కూడా మీరు తనిఖీ చేయవచ్చు. వారు వారి ఫోన్‌లో బిజీగా ఉన్నప్పుడు కూడా మీరు వారికి అందుబాటులో ఉన్నట్లు ప్రవర్తిస్తూ నడవవచ్చు. క్రమంగా ఆ సమయంలో మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో మార్పులు ఉన్నాయేమో తనిఖీ చేయండి.

6. టెక్నాలజీ మీకు ఊతమిస్తుంది..

6. టెక్నాలజీ మీకు ఊతమిస్తుంది..

మీరు మీ జీవిత భాగస్వామి యొక్క కార్యకలాపాలను నిశితంగా పరిశీలించలేని పక్షంలో, మీరు అందుబాటులో లేనప్పుడు అతను/ఆమె కార్యకలాపాలు తెలుసుకోవాలని భావిస్తున్న ఎడల, సాంకేతికత మీకు సహాయపడుతుంది. మీ జీవిత భాగస్వామిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి మీరు మీ గదిలో సీక్రెట్ కెమెరాలను ఇన్‌స్టాల్ చేయవచ్చు. కానీ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగకూడదని గుర్తుంచుకుని,తీవ్ర పరిస్థితుల్లో మాత్రమే నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని మరువకండి. మీరు మీ జీవిత భాగస్వామి కారు లేదా బైక్‌లో GPS(ఆమోదించిన) పరికరాన్ని కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు. క్రమంగా రోజులో మీ జీవిత భాగస్వామి సందర్శించే ప్రదేశాలను తెలుసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ఇప్పుడు మొబైల్లో కూడా లొకేషన్ షేరింగ్ సదుపాయాలుఅందుబాటులో ఉన్నాయి. ఉపయోగాన్ని వివరించి చెప్పిన ఎడల, పరికరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.

7. నకిలీ ప్రొఫైల్ సృష్టించండి..

7. నకిలీ ప్రొఫైల్ సృష్టించండి..

మీ జీవిత భాగస్వామిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే మరో మార్గం నకిలీ ప్రొఫైల్ సహాయం తీసుకోవడం. మీరు మీ జీవిత భాగస్వామికి మీ నిజమైన గుర్తింపును వెల్లడించకుండా, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను తయారు చేసి, మీ జీవిత భాగస్వామితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో చాట్ చేయవచ్చు మరియు మీ నకిలీ ప్రొఫైల్ ద్వారా అతను లేదా ఆమెపట్ల ఆసక్తి చూపడం ద్వారా వారి విధేయతను పరీక్షించడానికి ప్రయత్నించవచ్చు.

8. ఆకస్మికంగా రొమాన్స్ కోసం అడగండి

8. ఆకస్మికంగా రొమాన్స్ కోసం అడగండి

మీ జీవిత భాగస్వామి ఆలస్యంగా ఇంటికి రావచ్చు లేదా ఊహించిన సమయానికి ముందే ఇంటికి తిరిగిరావడం చేయవచ్చు. ముఖ్యంగా మీరు ఇంట్లో లేనప్పుడు. కావున వారి విధానాలను తెలుసుకోవడానికి, ఆకస్మికంగా రొమాన్స్ సెషన్ కోసం అడగడం కూడా గొప్ప ఆలోచనగా ఉంటుంది.

అతను లేదా ఆమె ఇంటికి వచ్చిన వెంటనే, మీరు లవ్‌మేకింగ్ సెషన్లకు దారితీసే కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రయత్నించవచ్చు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తారా లేదా శృంగారంలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారోనని మీరు తనిఖీ చేయవచ్చు. కొన్నిసార్లు, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ జీవిత భాగస్వామి అలసిపోయినట్లుగా కనిపిస్టారు. కావున అన్నివేళలా మీ ఆలోచన సరైనది కాకపోవచ్చు. కానీ ఇది అత్యంత తరచుగా జరిగితే మాత్రం, మీరు జాగ్రత్తగా ఉండాలని అర్ధం.

మీ జీవిత భాగస్వామి మోసం చేస్తున్నట్లు అనిపిస్తే, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పైన పేర్కొన్న అంశాలు మీకు సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. ఏదిఏమైనా మీరు ఏదైనా నిర్ధారణకు రాకముందే చాలా ఖచ్చితంగా ఉండటం మంచిది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Want To Catch Your Cheating Spouse Red-Handed? 8 Tips That Will Help You

Do you feel that your spouse is seeing another person? Does he/she behaves suspiciously and hides his/her mobile phone quite often? Is your spouse now more into office and client meetings and doesn't return home on time?
Story first published: Thursday, November 21, 2019, 20:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more