తాళి కట్టినవాడితో రొమాన్స్ చేయలేకపోతున్నా.. కానీ కడుపు వచ్చింది.. ఇప్పుడేం చేయను..

రిలేషన్ షిప్ లో రొమాన్స్ లేకపోతే... ఎలాంటి మార్గాలను అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ రిలేషన్ షిప్ లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్య అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ లో ప్రేమ, నమ్మకం వంటివి ఉంటే అలాంటివి టీ కప్పులో తుఫాను మాదిరి వచ్చి వెళ్తుంటాయి.

Ways to deal with an unromantic relationship

అయితే రిలేషన్ షిప్ విషయంలో ఎప్పుడైతే అపార్థం చేసుకుంటారో.. ఇద్దరి మధ్య నమ్మకం వంటివి లేకపోతే.. చీటికి మాటికి అనుమానాలు.. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు.

Ways to deal with an unromantic relationship

అవి చిలికి చిలికి గాలివానలా మారుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మీరు ఏమైనా బలమైన నిర్ణయాలు తీసుకునేటట్టయితే.. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఆ సంబంధంలోని సమస్యలకు పరిష్కారం అనేది అస్సలు దొరకకపోవచ్చు.

Ways to deal with an unromantic relationship

ఇదిలా ఉండగా.. ఓ వివాహిత మహిళ తనకు వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తనకు రిలేషన్ షిప్ లో ఏ మాత్రం సంతోషం లేదని.. అందుకే నేను ఒక పెద్ద పొరపాటు చేశాను.. దాన్ని ఇప్పుడు ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోలేకపోతున్నాను అని నిపుణులను సంప్రదించారు. దానికి వారి ఏమని సమాధానమిచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆన్ లైనులో అన్వేషణ..

ఆన్ లైనులో అన్వేషణ..

హాయ్! ‘నా వయసు 32 ఏళ్లు. నాకు పెళ్లై రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. మాది అండర్ స్టాండిగ్ మ్యారెజ్. ఎందుకంటే మేమిద్దరం ఆన్ లైనులో జీవిత భాగస్వామి కోసం అన్వేషిస్తున్నప్పుడు ఒకరినొకరం పరిచయం చేసుకున్నాం. అలా మొదలైన పరిచయం.. కాస్త మా ఇద్దరికి ఏకంగా పరిణయం దాకా వెళ్లింది.

ఏడాదిలోపే..

ఏడాదిలోపే..

ఇంకేముంది ఇద్దరూ చదువుకున్నవాళ్లం.. పైగా మెచ్యూర్ మైండ్ కావడంతో.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇరు కుటుంబాల్లోని పెద్దలను ఒప్పించాం. వారి ఆశీర్వాదంతో ఏడాదిలోపే అంటే ఆరునెలల తర్వాత వివాహం అనే బంధంతో ఒక్కటయ్యాం. అయితే అసలు సమస్య అప్పటి నుండే మొదలైంది.

ఇద్దరికీ కష్టంగా..

ఇద్దరికీ కష్టంగా..

పెళ్లి చేసుకున్న తర్వాత, మేమిద్దరం కలిసి జీవించేటప్పుడు గానీ నాకు తత్వం బోధపడలేదు. అప్పుడప్పుడే మా ఇద్దరి అలవాట్లు, అభిరుచులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని తెలిసింది. అప్పటినుండి ఏదైనా విషయంలో ఇద్దరు ఒప్పుకోవడానికి చాలా కష్టంగా ఉండేది.

మ్యారేజ్ కాంప్రమైజ్..

మ్యారేజ్ కాంప్రమైజ్..

మా ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయాలు కూడా వేరుగా ఉండేవి. ఎంతైనా మ్యారేజ్ అంటే కాంప్రమైజ్ అంటూ ఉంటారు కదా చాలా మంది. నేను కూడా అలా అడ్జస్ట్ అవుతూ వచ్చాను. చాలా విషయాల్లో కాంప్రమైజ్.. అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించాను.

అలవాట్లు మార్చుకున్నా..

అలవాట్లు మార్చుకున్నా..

మెల్ల మెల్లగా నా అలవాట్లు కూడా మార్చుకున్నాను. కొత్త లైఫ్ లో కొత్త పార్ట్ నర్ తో సంతోషంగా ఉందామని డిసైడ్ చేసుకున్నాను. అయితే రెండేళ్లు పూర్తయినా నేను మా శ్రీవారితో కలయికలో కలవలేకపోతున్నాను. తను కూడా రొమాన్స్ విషయంలో ఏ మాత్రం బయటపడరు. తన మనసులో ఏముందో చెప్పేవారు కూడా కాదు.

ముందే తెలిసుంటే..

ముందే తెలిసుంటే..

తన వ్యక్తిత్వం విషయం గురించి నాకు ముందే తెలిసి ఉండుంటే.. నేను ఇతన్ని వివాహం చేసుకునేదాన్ని కాదు. నా లైఫ్ నాశనం అయ్యిందని నాకనిపిస్తోంది. డైలీ బాధపడుతూ ఉన్నాను. అడ్జస్ట్ అవుతూ ఉన్నాను..

ఇప్పుడు ప్రెగ్నెన్సీ..

ఇప్పుడు ప్రెగ్నెన్సీ..

ఇలాంటి సమయంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను సంతోషంగా లేని సమయంలో ఆ ఎన్విరాన్ మెంట్ లో నా బిడ్డను పెంచాలన్న ఆలోచన నన్ను బాగా ఇబ్బంది పెడుతోంది. దీంతో భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా భయమేస్తోంది. గత కొంత కాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. ఇలాంటి టైములో మా పార్ట్ నర్ తో మాట్లాడి ప్రాబ్లమ్ పరిష్కరించుకోండి అని మాత్రం చెప్పకండి.. ఎందుకంటే దాని ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నేనేమి చేయాలి' అని ఓ వివాహిత మహిళ తన సమస్యకు చెప్పుకొచ్చింది.

ఇరువైపులా రావాలి..

ఇరువైపులా రావాలి..

మ్యారేజ్ అంటేనే కాంప్రమైజ్.. బాధ్యతల గ్యారేజ్ అనే విషయాన్ని ఇద్దరూ అంగీకరించాలి. ఇలాంటివి ఇరువైపుల నుండి ఉండాలి. మీ భాగస్వామి ఇంట్రావర్ట్ అయితే.. అలాంటి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు భావోద్వేగపరంగా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.

సెలబ్రేట్ సమయం..

సెలబ్రేట్ సమయం..

ఎవరైనా మహిళలకు గర్భం దాల్చడం అనేది సెలబ్రేట్ చేసుకునే సమయం. అందులోనూ తొలిసారి ప్రెగ్నెన్సీ వస్తే అది ఇంకా చాలా ప్రత్యేకమైనది. కాబట్టి అంతే కాదు బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులిద్దరి మధ్య కూడా సంబంధం మరింత బలపడుతుంది. బేబీతో కూడా అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు నిశ్చితంగా ఉండండి. మీ పార్ట్ నర్ కూడా ఓపెన్ అవడం ప్రారంభించొచ్చు.

పేరేంటింగ్ స్కిల్స్..

పేరేంటింగ్ స్కిల్స్..

అదే సమయంలో మీ బేబీ ఎదుగుదల వల్ల మీకు పేరేంటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. కాబట్టి, మీ బేబీకి కావాల్సిన ఎన్విరాన్ మెంట్ ను మీరు క్రియేట్ చేయొచ్చు. ఇంతకుముందులా మీ రిలేషన్ ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలను చేయండి. అయితే దీన్ని మీరు చాలా బలంగా చేయాలి. అప్పటి నుండి మీరు జీవితాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. అలాగే సమయం..సందర్భం చూసుకుని మీ స్నేహితులు, కుటుంబసభ్యులను తరచుగా కలవండి. దీని వల్ల మీకు చాలా మంది మద్దతు లభిస్తుంది.

ధైర్యం లభించాలంటే..

ధైర్యం లభించాలంటే..

మీరు ఎప్పటికీ విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఎల్లప్పుడూ మీరు ఒంటరివారు కాదు. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ టైములో మీరు వారి హెల్ప్ తీసుకోండి. వారు కూడా మీకు సహాయం చేయడానికి ఇలాంటి సందర్భాల్లో కచ్చితంగా ముందుకొస్తారు. అయితే మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మానసిక నిపుణులను సంప్రదించాలి. దీని వల్ల మీకు ధైర్యం లభిస్తుంది.

గమనిక : ఈ వివరాలన్నీ ఆరోగ్య, మానసిక నిపుణులు, పలు అధ్యయనాల ప్రకారం అందించాం. ఈ సమాచారం మొత్తం కేవలం మీ అవగాహన కోసమే. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా నిపుణులను సంప్రదించాలని మాత్రం మరచిపోకండి సుమా...

Desktop Bottom Promotion