For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామి ఆధిపత్యాన్ని చాకచక్యంగా తప్పించుకోవడానికి ఉన్న మార్గాలేంటో తెలుసుకోండి..

మీరు మీ జీవిత భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో మీలో మీరు మాత్రమే ఉంచుకుంటే, అందులో అర్థమనేదే ఉండదు.

|

ప్రస్తుత సమాజంంలో చాలా మంది ఆడవారు తమ శ్రీవారు వేరొకరి వైపు ఆకర్షితులు అవుతున్నారని భయపడతారు. ఈ ఆలోచనే వారి సందేహానికి మొదటి మెట్టు వంటిది. ఇలాంటి సందేహాలు ఏవైనా ఉంటే వాటిని ప్రారంభంలోనే పటాపంచలు చేసుకోవాలి. లేకపోతే ఇలాంటివి చంచలత కారణంగా ఒక పోరాటంగా ప్రారంభమై చివరికి వారి భాగస్వాములతో శాశ్వతంగా దూరమయ్యేందుకు దారి తీస్తుంది.

Ways To Deal

ఇది ఒక్క భార్యాభర్తలకు మాత్రమే కాదు. ఇది ఎవరైతే ప్రేమలో ఉన్నారో అలాంటి ప్రేమికులకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే సందేహాల పేరుతో చాలా జంటలు ఇప్పటికే విడాకులు తీసుకున్న ఎన్నో వార్తలను మనం నిత్యం ఎన్నో చూస్తున్నాం. అందుకే అనుమానం వచ్చినప్పుడు, అది ఆడవారి జన్మహక్కు అని చాలా మంది అంటుంటారు. అయితే ఎవరైతే భార్యను నిజంగా ప్రేమిస్తారో అలాంటి పురుషులంతా ఇలాంటి వారిని సహనంతో వ్యవహరించడం నేర్చుకోవాలి. ఈ సందర్భంగా ఈరోజు స్టోరీలో జీవిత భాగస్వామితో ఎలా వ్యవహరించాలో తెలుసుకుందాం.

మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి..

మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి..

మీరు మీ జీవిత భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో మీలో మీరు మాత్రమే ఉంచుకుంటే, అందులో అర్థమనేదే ఉండదు. మీరు ఎప్పుడు అయితే మీ జీవిత భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో ధైర్యంగా, వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ ప్రేమను క్రమంగా వారికి తెలియజేయటం వల్ల వారు ప్రేమను నిజంగా పొందినట్లు భావిస్తే మీ ఇద్దరి మధ్య అనుమానం అనే పెనుభూతం ఆమడ దూరం పారిపోతుంది. అందుకే మీ జీవిత భాగస్వామి మీపై ఎప్పుడైనా కోపం పెంచుకున్నా మీరు మీ ప్రేమను ఎల్లప్పుడూ సజీవంగా ఉంచండి. మీరు నిత్యం వారిపై ప్రేమ మరియు శ్రద్ధ చూపితే వారు మీ పరధ్యానంలో పడిపోతారు.

ఇతర మహిళల గురించి మాట్లాడొద్దు..

ఇతర మహిళల గురించి మాట్లాడొద్దు..

మీ జీవిత భాగస్వామి వేరొక మహిళతో కనిపిస్తే మీరు వెంటనే అనుమానించొద్దు. అలాగే మీ మనసులో ఏమైతే అనుకుంటున్నారో వాటిని కంట్రోల్ చేసుకోండి. అలాంటి ప్రశ్నలను మళ్లించడానికి ప్రయత్నించండి. అలాగే మీ భార్య ఎవరైతే అయితే కనిపిస్తుందో వారి కంటే మీ జీవిత భాగస్వామే అందంగా ఉంది అని పొగడండి. మీ భార్య రూపం పూర్తిగా ఆకట్టుకుందని చెప్పండి. మీరు మీ మనసులో ఎలా అనుకున్న బయటికి మాత్రం ఇదే చెప్పండి.

అరుపులు మొదలైతే..

అరుపులు మొదలైతే..

కొంతమంది మగవారు తమ జీవిత భాగస్వాములు అమాయకులు అనుకుంటారు. కానీ ఆడవారు అన్నాక ఏదో ఒక సందర్భంలో చీటికి మాటికి, అయినదానికి, కానిదానికి ఊరికే అరుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు మెల్లగా జారుకోండి. మీ జీవిత భాగస్వాములు ఏదైనా విషయంలో మీపై చిన్న అనుమానం వచ్చినా అరవడం ప్రారంభిస్తారు. ఇది అనేక మంది ఆడవారిలో అత్యంత సహజం. అందుకే వారితో వాదులాటను పెంచుకునే బదులు, వారి కోపం తగ్గేవరకు, వారికి కనిపించకుండా ఆ స్థలాన్ని విడిచిపెట్టి కాసేపు ఎక్కడికైనా వెళ్లండి.

రిలేషన్ థెరపిస్టు సహాయం..

రిలేషన్ థెరపిస్టు సహాయం..

కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామి కారణం లేకుండా మరియు ఎలాంటి ఆధారం లేకుండా మిమ్మల్ని అనుమానిస్తూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ఎంత నచ్చజెప్పినా ఫలితం రాకపోతే మీరు రిలేషన్ థెరపిస్టు లేదా కౌన్సెలింగ్ సహాయం తీసుకోవడం మంచిది.

వారి అభద్రత భావాలను చర్చించండి..

వారి అభద్రత భావాలను చర్చించండి..

మీ భార్యతో మీరు చాలా సురక్షితంగా ఉండాలి. ఒక మహిళ తన రిలేషన్ షిప్ లో అసురక్షితంగా భావిస్తే, వారు నరకం యొక్క బాధను అనుభవిస్తారు. వారికి అలాంటి ఇబ్బందులు కలిగించకపోవడమే మీకు మంచిది. అందుకోసం మీరు వారి అభద్రత భావాలను చర్చించండి. మీరు వారిని ఏ విధంగానూ నిరాశపరచమని వారిని భరోసా ఇవ్వండి. వారి విశ్వాసాన్ని మీరు ఎప్పుడైతే సాధిస్తారో మీరు ఆ క్షణం విజయం సాధించినట్లే

మీ లేడీ ఫ్రెండ్స్ ను పరిచయం చేయండి..

మీ లేడీ ఫ్రెండ్స్ ను పరిచయం చేయండి..

మీ లేడీ ఫ్రెండ్స్ ను మీ జీవిత భాగస్వామికి పరిచయం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ రిలేషన్ షిప్ లో కొన్ని ఇబ్బందులు అనేవి రావచ్చు. కానీ ఇలా చేయడం మాత్రం చాలా చాలా అవసరం. ఎందుకంటే తర్వాత మీరు లేడీ ఫ్రెండ్స్ తో ఏదైనా సందర్భంలో మాట్లాడాల్సి వస్తే అప్పుడు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చూసి అస్యహించుకోవడం లేదా గొడవపడే అవకాశం ఉంటుంది. అందుకే ముందే వారికి పరి చేయం చేస్తే వారి మధ్య స్నేహం పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా అవ్వకపోతే మీరే చొరవ తీసుకుని వారి మధ్య ఆరోగ్యకరమైన స్నేహాన్ని ప్రోత్సహించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి.

అబద్ధాలు చెప్పకండి..

అబద్ధాలు చెప్పకండి..

మీరు మీ జీవిత భాగస్వామికి ఎక్కువగా అబద్ధాలను చెప్పకండి. ఒకవేళ ఏదైనా విషయంలో మీ ప్రవర్తన ఆమెను కలవరపెడుతుందని మీరు భావించిన సమయంలో మీరు అబద్ధం చెబితే అది పోరాటానికి దారితీస్తుందని, మీరు అనుకుంటే, దానిని మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకు మీరు మీ స్నేహితురాలిని కలవబోతున్నట్లయితే దానిని దాచకుండా ముందే చెప్పేయండి. ఇలాంటివి ఒకవేళ వారికి తర్వాత తెలిస్తే మీపై వారికి అనుమానాలు పెరుగుతాయి.

అల్టిమేటం ఇవ్వండి

అల్టిమేటం ఇవ్వండి

మీ జీవిత భాగస్వామి యొక్క అసూయ కాలక్రమేణా తీవ్రమవుతుంది. మీరు మీ సంబంధాన్ని దెబ్బతీసే స్థితికి చేరుకున్నట్లయితే, మీరు ఆమెను శాంతింపచేయడానికి మరియు ఆమె మార్గాలను మార్చడానికి అల్టిమేటం ఇవ్వాలి. బలమైన మరియు అసూయపడే ఈ స్త్రీ మరింత బాధాకరమైన వైఖరికి ప్రతిస్పందిస్తుంది. అన్ని ఇతర మార్గాలు విఫలమైతే మాత్రమే దీనిని కోరాలి.

English summary

Ways To Deal With Possessive Wife

Here is the list of useful ways to deal with a possessive wife. Read on
Desktop Bottom Promotion