Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026
ఫస్ట్ నైట్ తర్వాత కొత్త పెళ్లికూతురు మదిలో మెదిలే ప్రశ్నలేంటో తెలుసా?
వివాహం అయిన తొలిరోజు తర్వాత మహిళలు ఎలాంటి విషయాలను ఆలోచిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు ఫస్ట్ నైట్ నుండి కొత్త జీవితంలో కొన్ని సందేహాలు ఉండటం అనేది అత్యంత సహజమైన విషయం. ఓ వైపు పట్టరానంత సంతోషం ఉన్నప్పటికీ, తమ జీవితంలోకి కొత్తగా ప్రవేశించిన ఓ కొత్త వ్యక్తితో కలకాలం కలిసి జీవించేందుకు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు.

అయితే అమ్మాయిలు కొత్తగా పెళ్లి చేసుకుని అత్తాగారింట్లో అడుగు పెట్టినప్పుడు ఆమె కొత్త ప్రస్థానం ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలో అమ్మాయిల మనసులో ఏముందో కనుక్కోవడం అంత సులభం కాదు.

అయితే అత్తమామలు, కొత్త పెళ్లికొడుకు కొత్త వధువు మనసులో ఏముందో కనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆమె మదిలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

బరువైన దుస్తుల నుండి ఉపశమనం..
చాలా మంది అమ్మాయిలు పెళ్లి కోసం కొత్త కొత్త బట్టలను, భారీ లెహంగాలను, బరువైన దుస్తులను ఎంచుకుంటారు. కానీ వాటి బరువు కారణంగా వారు చాలా సమయాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే వివాహం ముగిసిన వెంటనే వాటి నుండి ఉపశమనం పొందినట్లు భావిస్తారు. ప్రస్తుతం కిలోల కొద్ది బరువుండే బట్టలను ధరించే పని లేదని ఆమె సంతోషంగా ఫీలవుతుంది.

నవ్వటం తగ్గుదల..
పెళ్లి రోజున అందరి చూపు పెళ్లికొడుకు కంటే ఎక్కువగా పెళ్లికూతురిపైనే ఉంటుంది. కెమెరామెన్ ప్రతి ఫొటోలోనూ స్మైల్ ప్లీజ్ అంటూ ఉంటాడు. ఆ సమయంలో ఆమెకు నవ్వు రాకపోయినా నవ్వుతూనే ఉండాలి. అలా ప్రతి క్లిక్ కి స్మైల్ ఫేస్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ పెళ్లి తర్వాత ఆమెకు కెమెరా క్లిక్ నుండి దాదాపు విముక్తి లభిస్తుంది.

మసాజ్ అవసరం..
పెళ్లి రోజున పెద్దల ఆశీర్వాదం పొందడానికి నడుము కట్టు వంగి ఉంటుంది. అటువంటి సమయంలో చాలా మంది అమ్మాయిలు తమకు బాడీ మసాజ్ అయితే బావుంటుంది అని ఆలోచిస్తారు. దాని వల్ల ఆమెకు చాలా రిఫ్రెష్ మరియు రిలాక్స్ గా అనిపిస్తుంది.

గిఫ్టుల గురించి..
పెళ్లి రోజున ప్రతి ఒక్క జంటకూ బోలెడన్ని గిఫ్టులు వచ్చి పడుతుంటాయి. ఆ బహుమతుల్లో ఎవరెవరు ఎలాంటి ప్రత్యేకతమైన వాటిని ఇచ్చారో తెలుసుకోవాలని, కొత్త పెళ్లికూతురు ఆలోచిస్తూ ఉంటుంది. వాటిలో బంధువుల కంటే ముందు తమ స్నేహితులు ఎలాంటి గిఫ్టులు ఇచ్చారో అన్వేషిస్తుంది.

బెడ్ రూమ్ నుండి..
ఇక ఫస్ట్ నైట్ రోజున కొత్త వ్యక్తితో పడకగదిలో ఒకే మంచంపై ఇద్దరు కలవడం అనేది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆ సమయంలో వదులుగా ఉన్న దుస్తులతో బెడ్ రూమ్ నుండి బయటకు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంది.

అన్నింటిపై ఓ లుక్కేస్తుంది..
పెళ్లయిన తర్వాత కొత్త పెళ్లికూతురు తన చీర, లిప్ స్టిక్, తన అందమైన కురులన్నింటిపై ఓ లుక్కేసుకుంటుంది. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయనిపిస్తేనే బయటకు అడుగు పెడుతుంది.

హనీమూన్ ప్లానింగ్..
వివాహ వేడుక ముగిసిన వెంటనే చాలా మంది కొత్త వధువులు తమ హనీమూన్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. వారి ఇష్టయిష్టాలను తమ భాగస్వామితో పంచుకునేందుకు ఏకాంతంగా గడపాలని భావిస్తారు.

వంట గురించి..
ఇక పెళ్లి అయిన వెంటనే కొత్త వధువు వంటింట్లో అడుగు పెట్టకపోవచ్చు. కానీ వంట గురించి చాలా ఆందోళన చెందుతుంది. ఇప్పటి నుండి అందరికీ రుచికరమైన ఆహారం ఎలా తయారు చేయాలా అని తెగ మదనపడుతుంది.

జీవితాంతం ఎలా గడపాలా?
పెళ్లి అయిన తర్వాత తన భాగస్వామి తనను ఎంతగా ప్రేమిస్తున్నాడు? అసలు తనతో జీవితాంతం ఆనందంగా గడపగలనా అనే ఆలోచన కచ్చితంగా వస్తుంది. వారితో కలకాలం ఆనందంగా ఎలా జీవించాలని ఆలోచిస్తుంది.

స్నేహితులతో మాట్లాడటం..
పెళ్లికి ముందు వరకు ఉన్న స్నేహితులతో పెళ్లి తర్వాత కూడా మాట్లాడాలా వద్ద అని ఆలోచిస్తుంది. ఒకవేళ అత్త,మామల ఎదుట బెస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడితే వారేమైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తుంది.



Click it and Unblock the Notifications