For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెడ్డింగ్ రింగ్ నాలుగో వేలికే ధరించడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..

చైనా వారి నమ్మకం ప్రకారం మన వేళ్లు అన్నీ ప్రతి సంబంధాన్నిసూచిస్తాయి. ఆ విధంగా మన నాలుగో వేలు మన జీవిత కాలాన్ని సూచిస్తుంది. బోటనవేలు, మధ్యవేలు తల్లిదండ్రులను సూచిస్తుంది.

|

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఉంగరాన్ని మన చేతి వేళ్లలోని నాలుగో వేలికే ధరిస్తారు. వివాహానికి ముందు జరిపే నిశ్చితార్థం సమయంలోనూ కాబోయే వధూవరులు సైతం ఉంగరాలు మార్చుకుంటారు. వారు కూడా ఆ వేలికే ఉంగరాలను మార్చుకుంటారు. హిందువుల్లో వివాహానికి చిహ్నంగా తాళి ఉన్నప్పటికీ, అంతకుముందు జరిగే తతంగానికి గుర్తుగా ఉంగరాలను మార్చుకుంటారని చాలా మందికి తెలుసు.

Why Wedding Rings Are Worn On The Fourth Finger?

అలాగే క్రైస్తవులు కూడా తమ పెళ్లి సందర్భంలో చర్చిలలో ఉంగరాలను మార్చుకుంటారు. మరోవైపు ప్రేమ జంటలు కూడా తమ ప్రేమకు గుర్తుగా ఉంగరాలను మార్చుకుంటారు. లేదా ప్రియుడికి/ప్రియురాలికి ఉంగరాలను బహుమతిగా ఇస్తుంటారు. ఈ సందర్భంగా ఉంగరాన్ని నాలుగో వేలికే ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఉంగరాలను పరిచయం చేసింది ఎవరు? ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలు, కారణాలను ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

రిలేషన్ రింగ్..

రిలేషన్ రింగ్..

రింగ్ (ఉంగరం) అనేది ఒక ఆభరణం మాత్రమే కాదు. ఇది ఒక కపుల్ మధ్యన ఏర్పడే రిలేషన్ కు సింబల్ వంటిది. ఇది వివాహ బంధానికి గుర్తుగా ఎడమ చేతిలో నాలుగో వేలికి ఉంగరం ధరించే పద్ధతి క్రీ.శ.1549 నాటిది. ఇది తొలిసారి ఐరోపాలోని కాథలిక్ చర్చిలో ప్రారంభించబడింది. అంతకుముందు కుడి చేతికి ఉంగరం ధరించేవారట. ఈ ఉంగరం ఉన్న వారి బలాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఈ అలవాటు అప్పటి నుండి పాటిస్తూ వచ్చారు. తర్వాత దీనిని వివిధ మార్పుల ద్వారా అనేక ప్రదేశాలకు తరలించారు.

రింగుకు రోమన్ సిద్ధాంతం..

రింగుకు రోమన్ సిద్ధాంతం..

రింగుకు సంబంధించి రోమన్లలో ఒక బలమైన నమ్మకం మరియు సిద్ధాంతం కూడా ఉంది. సైన్స్ పెద్దగా పురోగతి చెందని రోజుల్లో, ఒక నరం మన చేతి యొక్క నాల్గవ వేలు గుండెకు నేరుగా ప్రవహిస్తుందని నమ్ముతారు. ఇది సాధారణంగా నమ్మకంగా పరిగణించబడుతున్నప్పటికీ, దీని వెనుక ఇతర కారణాలు ఉన్నాయి.

ఉంగరంపై చైనీయుల నమ్మకం ఇలా..

ఉంగరంపై చైనీయుల నమ్మకం ఇలా..

చైనా వారి నమ్మకం ప్రకారం మన వేళ్లు అన్నీ ప్రతి సంబంధాన్నిసూచిస్తాయి. ఆ విధంగా మన నాలుగో వేలు మన జీవిత కాలాన్ని సూచిస్తుంది. బోటనవేలు, మధ్యవేలు తల్లిదండ్రులను సూచిస్తుంది. అలాగే చైనీయులు కూడా దీనికి సంబంధించి ఒక ఆటను కూడా రూపొందించారు.

చైనీయుల ఆటలు..

చైనీయుల ఆటలు..

మీ రెండు చేతులను కలిపి ఉంచండి. మిమ్మల్ని ప్రతిబింబించేలా మీ మధ్య వేలిని కిందికి మడవండి. మిగిలిన వేళ్లు ఒకదానికొకటి తాకాలి. ఇప్పుడు మీ పిల్లల చూపుడు వేలిని వేరు చేయడానికి ప్రయత్నించండి. దీన్ని అందరూ సులభంగా చేయవచ్చు. దీన్ని చేయడం వల్ల పిల్లలు కొంతకాలం మీతో ఉంటారు. వారి కుటుంబం ఏర్పడిన తర్వాత వారు మిమ్మల్ని వదిలివేస్తారు.

రింగ్ అర్థం ఏమిటంటే..

రింగ్ అర్థం ఏమిటంటే..

రింగ్ కు సంబంధించి సాధారణంగా సర్కిల్ లోనే ఉంటుంది. సర్కిల్ అంటే అంతం లేనిది అని అర్థం. కానీ దీనికి ప్రారంభం లేదా ముగింపు రెండూ ఉంటాయి. రింగ్ లో ఉన్న ఖాళీ అంటే తెలిసిన, తెలియని విషయాలు మరియు సంఘటనలకు గేట్ వేగా ఉంటాయి. అలాగే అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఎవరికైనా రింగ్ ఇస్తే, అది వారి జీవితం చివరి వరకు ఎల్లప్పుడూ శాశ్వతమైన ప్రేమను సూచిస్తుంది.

తొలినాటి రోజుల్లో మధ్యవేలుకు..

తొలినాటి రోజుల్లో మధ్యవేలుకు..

క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం తొలినాటి క్రైస్తవుల వివాహాల్లో మూడవ లేదా మధ్య వేలుకు ఉంగరాన్ని సంప్రదాయంగా ధరించేవారు. ప్రార్థన వల్లించే యాచకుడు ‘‘తండ్రి పేరులో, పుత్ర పవిత్రాత్మ‘‘ మరియు బొటన వేలు మరియు మొదటి రెండు వేళ్లను టచ్ చేసి అప్పుడు మధ్య వేలుకు రింగ్ పెట్టాలని చెప్పేవారట. అలా చేస్తేనే వివాహం పూర్తి అయినట్టు అని అందరూ భావించేవారు. ఇక కాలానుగుణంగా సంప్రదాయాలు మారిన తర్వాత చివరకు రింగ్ ఎడమ చేతి నాలుగోవేలికి అంటే ఉంగరం వేలుకు పెట్టాలని నిర్ణయించారట. అందుకే వెడ్డింగ్ రింగ్ క్రైస్తవ సంప్రదాయాంలో మరియు ప్రపంచీకరణలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది.

English summary

Why Wedding Rings Are Worn On The Fourth Finger?

Read to know why we wearing wedding rings on the fourth finger. Check it out.
Desktop Bottom Promotion