Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
Women's Day Special :పెళ్లికి ముందు ఏదైనా సాధ్యమేనట.. కానీ పెళ్లి తర్వాత అన్నింటికీ కాంప్రమైజ్ కావాల్సిందేనట..
అందుకే ప్రపంచంలోనే ఆనందకరమైన వారు ఎవరైనా ఉన్నారంటే పెళ్లి కాని వారే అని ఆయన స్పష్టంగా చెబుతారు. ఎందుకంటే పెళ్లి అయిన మహిళలు ఇల్లు, పిల్లలు, వర్కింగ్ ఉమెన్ వంటి బాధ్యతలతో పాటు ఆఫీసు పనులను కూడా నిర్వహి
మన దేశంలో అమ్మాయిలకు ఓ పాతికేళ్లు వచ్చేసరికి వివాహం కాలేదంటే తనలో ఏదో లోపం ఉంటుంది అన్నట్లుగా చూస్తుంది సమాజం. మరీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొన్నిచోట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. అమ్మాయిలకు అత్యంత చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు.

అలా చేయకపోతే వారిలో ఏదో ఒక లోపం ఉన్నట్లు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి అనేక కారణాల వల్ల అమ్మాయిలున్న తల్లిదండ్రులందరూ తమ బిడ్డలు చదువు పూర్తి చేసుకునే లోపే అందమైన వరుడి కోసం.. మంచి అల్లుడి కోసం మ్యారేజ్ బ్యూరోలను.. పెళ్లిళ్ల బ్రోకర్లను సంప్రదిస్తుంటారు.

తమ కూతురి జీవితం పెళ్లి అయితే సెటిల్ అయినట్టేనని, తమకు కూడా ఓ పెద్ద బాధ్యత తీరిపోయినట్టు భావిస్తారు. మరి కొంతమంది అయితే చాలా మంది అమ్మాయిలకు వారి విద్య పూర్తికాక ముందే పెళ్లి చేసేసి అత్తారింటికి సాగనంపుతారు.

అయితే పెళ్లి చేసుకున్న వారి కంటే సింగిల్ గా ఉండే వారే చాలా ఎక్కువగా ఆనందంగా ఉంటారట. అలాంటి వారే తమ జీవితాన్ని చివరివరకూ కొనసాగిస్తారని తాాజాగా ఓ పరిశోధనలో తేలిందట.. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఆ వయసు వచ్చేసరికి..
అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా 20 సంవత్సరాలు దాటితే చాలు ఇంకా మీరు సింగిల్ గా ఉన్నారా? త్వరగా పెళ్లి చేసుకోమని సూటి పోటీ మాటలతో వేధిస్తుంటారు. ఫలానా అమ్మాయి ఉందని.. ఫలానా అబ్బాయి ఉన్నాడని తెగ విసిగిస్తుంటారు. ‘కళ్యాణమొచ్చినా.. కక్కు వచ్చినా ఆగదు‘ అని ఆట పట్టిస్తుంటారు. అంతేకానీ మీరేమవ్వలనుకుంటున్నారు? మీకేం కావాలి? అని అడిగే వారు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు.

పెళ్లి చేసుకుంటే..
అయితే ఒకవేళ మీరు పెద్దల మాట విని పెళ్లి వెంటనే చేసుకుంటే మాత్రం మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని కోల్పోయినట్టేనని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి చెందిన బిహేవియరల్ సైన్స్ ప్రొఫెసర్ పౌల్ డోలన్ అంటున్నారు.

పెళ్లి గురించి...
ఆ ప్రొఫెసర్ తను రాసిన హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ : ఎస్కేపింగ్ ద మిత్స్ ఆఫ్ ద పర్ఫెక్ట్ లైఫ్ అనే పుస్తకంలో పెళ్లికి సంబంధించిన అపొహల గురించి.. పెళ్లి తర్వాత జీవితంపై చూపించే ప్రభావం గురించి చెప్పుకొచ్చారు. ఇటీవల వేల్స్ లోని ఓ పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు.

అలా చేస్తేనే...
పెళ్లి అయిన వ్యక్తులు ఆనందంగా ఉండాలంటే తమ భాగస్వామితో కలిసి అదే గదిలో ఉండి మాట్లాడుతూనే ఉండాలని.. అలా చేస్తేనే వారిలో ఆనందం ఉంటుందని.. అలా చేయకపోతే వారిలో ఆనందం అనేదే ఉండదని చెప్పారు.

గదిలో లేకపోతే...
అయితే తమ భాగస్వామి వారితో లేకపోతే, వారు ఆనందంగా ఫీల్ అవ్వలేరట. తమ భాగస్వామి తమ గదిలో లేకపోతే వారు ఏదో కోల్పోయినట్లుగా.. చాలా బాధగా ఫీలవుతారట.

ఆడవారే ఎక్కువగా...
అయితే ఈ బాధ ఎక్కువగా ఆడవారిలోనే ఉందని ఆయన చెప్పడం గమనార్హం. అయితే మగవారిలో చాలా మంది అంతగా బాధ పడటం లేదని ఆయన గుర్తించారట. అందుకే ఆడవారు త్వరగా పెళ్లి చేసుకోవద్దని తను సలహా ఇస్తాను అని చెప్పారు.

అలాంటి వారిపై కేస్ స్టడీ..
ఆయన పెళ్లయిన గ్రూపును ఒకసారి.. అదే వయసులో ఉండి పెళ్లి కాని ఓ గ్రూపు వారిని పరిశీలించి ఆయన కేస్ స్టడీ చేశారంట. ఆ పరిశోధనలో వివాహితులైన వారితో పోలిస్తే వివాహం కాని వారే మహిళలే ఆనందంగా ఉన్నారని గ్రహించారట. వివాహం అయిన వారిలో చాలా మంది తాము ఏ మాత్రం ఆనందంగా లేమని, పైగా అనారోగ్యాల బారిన పడ్డామని చెప్పుకొచ్చారట.

పెళ్లి చేసుకోని వారైతే..
అందుకే ప్రపంచంలోనే ఆనందకరమైన వారు ఎవరైనా ఉన్నారంటే పెళ్లి కాని వారే అని ఆయన స్పష్టంగా చెబుతారు. ఎందుకంటే పెళ్లి అయిన మహిళలు ఇల్లు, పిల్లలు, వర్కింగ్ ఉమెన్ వంటి బాధ్యతలతో పాటు ఆఫీసు పనులను కూడా నిర్వహించాలి. కానీ గర్భం ధరించడం, పిల్లలు వంటి కారణాల వల్ల వారు కెరీర్ లో ముందుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు.

ఫలానా వయసుకి..
ఈ కారణాల వల్ల ‘‘అమ్మాయిలు ఫలానా వయసుకి తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలి‘‘ అంటూ సమాజంలో ఉన్న ఆలోచనను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. అంతేకాదు అమ్మాయిలు.. అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా ఉండటం తప్పు కాదని.. ఇలా చేయడం వల్ల వారు ఆనందంగా ఉంటున్నారు. కాబట్టి వారు చేసే పని కరెక్టేనని అందరూ గ్రహించాలి.

అందుకే పెళ్లి చేసుకోని వారిని..
అందుకే ముప్పై ఏళ్ల వయసు పైబడిన వారి లాంటి వారు మీకు కనిపిస్తే, ఇంకా పెళ్లి చేసుకోలేదా? ఇప్పటికైనా మీ జీవితంలోకి మంచి వ్యక్తి తన రావాలని చెప్పడం కంటే.. తను జీవితంలో ఆనందంగా ఉండాలని విష్ చేయడం మంచిదట. ఎందుకంటే పెళ్లి వల్ల వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యం, ఆనందం రెండూ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.



Click it and Unblock the Notifications
