Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
ఇదేందయ్యా ఇది: పెళ్లిచూపులకు ఒకడు వచ్చాడు..పెళ్లికి మరొకడు వచ్చాడు..అసలు ట్విస్ట్ ఇదే
ఈ రోజుల్లో అబ్బాయిలకు పెళ్లి కావడం చాలా కష్టమైపోతుంది. ప్రేమ పెళ్లిల్లు అయితే ఓకే గానీ పెద్దలు అమ్మాయిని వెతికి పెళ్లి చేయాలంటే మాత్రం చాలా కష్టంగా మారిపోయింది. సరిగ్గా ఇక్కడే పెళ్లిల్ల బ్రోకర్లు దీనిని అడ్వాంటేజ్ గా మార్చుకొని భారీగా సంపాదించుకుంటున్నారు. ఇదే సమయంలో పెళ్లిల్ల బ్రోకర్లు ఉన్నవి లేని చెప్పి ఏదో మాయ చేసి చేసే పెళ్లిళ్ల కారణంగా చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఓ మ్యారేజ్ బ్రోకర్ చేసిన పని దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్లి చూపుల్లో ఒకరిని చూపించి తాలిబొట్టు కట్టేందుకు మరొకరని కూర్చోబెట్టారు. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాయబరేలీ జిల్లాలోని మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రఘన్‌పూర్ గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి తన సోదరి వివాహం హర్యానాలోని పానిపట్ కు చెందిన ఒక యువకుడితో నిశ్చయించాడు. అమ్మాయి తరపు వారు చూసిన యువకుడికి 20-25 సంవత్సరాల వయస్సు ఉంటుంది. అయితే ఈ పెళ్లికి మధ్యవర్తిగా ఉన్న మహిళ వధువు తల్లిదండ్రులకు ఒక యువకుడి ఫొటోను చూపించి పెళ్లిసంబంధాన్ని కుదిర్చి..పెళ్లికి పవన్‌కుమార్ అనే మరో వ్యక్తిని పంపింది.

పెళ్లి రోజున పెళ్లి ఊరేగింపు వచ్చినప్పుడు వరుడిని చూసిన తర్వాత కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పెళ్లి చేసుకోడానికి వచ్చింది తాము నిశ్చయించుకున్న వరుడు కాదని అమ్మాయి తరపు వారికి అనుమానం వచ్చింది. వెంటనే వరుడిగా వచ్చిన వ్యక్తిని,అతనితో పాటు ఉన్నవారిని నిలదీయగా అసలు విషయం బయటపడండి. దీంతో వధువు,ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పెళ్లి ఊరేగింపులో వచ్చిన వరుడు ఝజ్జర్ నివాసి,అతడు వయస్సు దాదాపు 40 సంవత్సరాలు అని తెలిసి షాక్ అయ్యారు. మొదట చూపిన యువకుడికి వేరొకరితో పెళ్లిసంబంధం కుదిర్చినట్లు తెలిసింది. దీనిపై మధ్యవర్తిని నిలదీసిన వధువు కుటుంబం పోలీసులకు కంప్లెయింట్ చేసింది. పోలీసులకు సమాచారం అందగానే ఈ కేసులో మరో విషయం బయటపడింది. నిజమైన వరుడి కాలు విరిగిందని, అందుకే మరొకరిని వరుడిగా తీసుకొచ్చారని పెళ్లి ఊరేగింపుతో వచ్చిన మధ్యవర్తులు చెప్పారు. పోలీసులు వరుడిని, అతడి బంధువులు,మధ్యవర్తిని అరెస్ట్ చేశారు. నకిలీ మ్యారేజ్ బ్రోకర్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారని.. ఈ వ్యవహారం కూడా అలాంటిదే అయి ఉండవచ్చని స్థానిక పోలీసు అధికారి రాజీవ్ సింగ్ చెప్పారు.



Click it and Unblock the Notifications