Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఛీఛీ..ఏం మనిషివమ్మా: రంకు మొగుడి కోసం కన్న పిల్లల్ని చంపేసిన తల్లి
వివాహేతర సంబంధాల మోజులో పడి కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు. అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ లు వచ్చినప్పటి నుంచి వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా తమ బంధానికి అడ్డుపడతారనే అనుమానం ఉన్నా కూడా కట్టుకున్న భర్తను,భార్యను,పిల్లలను హత్య చేయడానికి వెనుకాడట్లేదు. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడి మోజులో పడి అత్యంత దారుణానికి ఒడిగట్టింది.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో వివాహేతర సంబంధం కారణంగా ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను హత్య చేసిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిచ వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కి చెందిన చెన్నయ్య, రజిత భార్యాభర్తలు. 2013లో రజితకి తనకంటే వయస్సులో 20 ఏళ్లు పెద్దవాడైన చెన్నయ్యతో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. రజిత ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, ఆమె భర్త ట్యాంకర్ డ్రైవర్ గా చేస్తున్నాడు. హాయిగా సంసారం సాగిపోతున్న సమయంలో మూడో వ్యక్తి ప్రవేశం జరిగింది. దీంతో అసలు కథ మొదలైంది.

ఇటీవల జరిగిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రజిత తన పాత స్నేహితుడు శివకుమార్ ని కలిసింది. అక్కడ ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఎక్సేంజ్ చేసుకున్నారు. తర్వాత ఫోన్ కాల్స్,చాటింగ్ చేసుకుంటూ దగ్గరయ్యారు. క్రమంగా ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకొని.. పిల్లలు, భర్తను అడ్డుతొలగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మార్చి 27న తాను అనుకున్న ప్లాన్ అమలు చేయాలని భావించింది రజిత. ఇందులో భాగంగానే ముగ్గురు పిల్లలు, భర్తకు విషం కలిపిన అన్నం తినిపించి వారిని చంపాలని ప్లాన్ వేసింది. ఫ్లాన్ ప్రకారం పెరుగన్నంలో విషం కలపాలని నిర్ణయించుకుంది.
అయితే భర్త పప్పు మాత్రమే తిని బయటకి వెళ్లిపోయాడు. పెరుగన్నం తిన్న పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారని అందరినీ నమ్మించేలా ఫ్లాన్ చేసింది. రాత్రి 11 గంటల సమయంలో భర్త ఇంటికి వచ్చి చూడగా పిలలు చనిపోయి ఉన్నారు. రజిత తొలుత ఫుడ్ పాయిజన్ అని నాటకమాడింది. కడుపు నొప్పి అంటూ డ్రామాలాడటంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించాడు భర్త. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిజం అలా బయటపడింది
తన నేరాన్ని దాచిపెట్టడానికి మొదట రజిత పోలీసులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది. కుటుంబ సమస్యల కారణంగా తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి పెరుగు అన్నంలో విషం కలిపి చంపానని ఆమె చెప్పింది. పిల్లలు చనిపోయినప్పటికీ తాను బతికి బయటపడ్డానని పోలీసులకు మొదట రజిత చెప్పింది. అయితే పోస్టుమార్టం నివేదిక ప్రకారం పిల్లల శరీరంలో ఎలాంటి విషం కనిపించలేదు. తర్వాత పోలీసులు రజితను తమ స్టైల్ లో విచారించినప్పుడు ఆమె అసలు విషయం బయటపెట్టింది. రజితనే పిల్లలను చంపిందని పోలీసులు నిర్థారించారు. టవల్ తో పిల్లను ఉరి వేసి చంపినట్లు రజిత పోలీసుల విచారణలో అంగీకరించింది. దీంతో రజితను,ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.



Click it and Unblock the Notifications