Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కోడలికి ఎలుకల మందు ఇచ్చి చంపిన అత్త.. ఎందుకో తెలుసా?
పూర్వ కాలంలో మన దేశంలో బంధాలకు బంధుత్వాలకు ఎంత విలువ ఇచ్చేవారో ఇప్పుడు అంతలా దిగజారిపోతున్నారు. కొడుకు తండ్రి, అత్తా కోడలు, భార్య భర్త.. ఇలా తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. వాటి నుంచి అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే ఓ అత్త కోడలికి ఎలుకల మందు ఇచ్చి చంపిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంటుంది. అసలు అత్త కోడలికి ఎందుకు ఎలుకల మందు తాగించింది, దానికి ఎందుకు కారణమయ్యింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు ఏం జరిగిందంటే?
తరచూ తనతో గొడవ పడుతుందని ఓ అత్త తన కోడలికి ఎలుకల మందు ఇచ్చి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్‌లోని రామాంజపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటంటే ముడావత్ ధూళి(38) అనే మహిళ గత రెండు నెలలుగా కనిపించడం లేదని ఆమె భర్త ముడావత్ సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా పోలీసులు విచారణ జరపగా.. ధూళి అత్త తులసి ధూళిని హత్య చేసినట్లు తేలింది. దీనికి కారణం ఏంటంటే?

వేధింపులే
తన కోడలు ధూళి ఎప్పుడూ తనతో గొడవ పడుతుండేదని, అసలు తనకు మనశ్శాంతి లేకుండా చేసేదని తులసి తెలిపింది. దీంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న తులసి.. కోడలిని పథకం ప్రకారం తన వద్దకు పిలిపించుకుంది. కోడలిని ఆ పథకం ప్రకారమే కల్లు దుకాణానికి పిలిపించి.. కల్లులో ఎలుకల మందు కలిపి తాగించింది. దీంతో ధూళి మరణించగా.. ఆమెను కళ్ళు దుకాణం పక్కనే ఉన్న మట్టి కుప్పలో పాతిపెట్టినట్లు తులసి నిజాలు ఒప్పుకుంది. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఏం నేర్చుకోవాలంటే?
సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచంలో అత్త కోడలి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. అత్త అంటే కోడలికి, కోడలు అంటే అత్తకు పడని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అయితే ఎలాంటి సందర్భంగా అత్త అయినా కోడలైనా కొంత ఓపికతో ఉండాలి. ఒకరిపై ఒకరు కక్ష పెంచుకోకూడదు. ఇద్దరూ ఎంతో ఓపికగా ఉంటూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవాలి. అప్పుడే వారి మధ్య బంధం బలంగా ఉంటుంది.
అలాగే కొడుకుపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. చాలామంది బయటికి చెప్పుకోరు కానీ.. అత్త కోడలి గొడవల కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. బయటి ఘర్షణలతో పాటు అత్త కోడలి ఘర్షణ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకే అత్త కోడలు మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications