Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఈ మాతృదినోత్సవం రోజు అమ్మను ఇలా సర్‌ప్రైజ్ చేయండి..!
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా..పలికే దైవం అమ్మా, కంటికి వెలుగమ్మా.. పాట మనకు ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అమ్మ చేతిముద్దలోని కమ్మదనం ఇంక ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మే 12వ రోజు జరుపుకునే మాతృదినోత్సవం సందర్బంగా అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు మాత్రమే చెప్పకుండా అమ్మకు ప్రత్యేకమైన బహుమతిని బహూకరించండి.
మాతృదినోత్సవం రోజు అమ్మను ఇలా సర్‌ప్రైజ్ చేయండి..
ఆర్థిక తోడ్పాటు
అమ్మకు చిన్న వయసు నుంచి ఏదైనా వ్యాపారం చేయాలనే ఆశ కోరిక ఉండి ఉంటుంది. ఇంట్లోనే చిన్న బిజినెస్‌లు కూడా మొదలుపెట్టే ఆలోచన ఉండవచ్చు.. కానీ దానికి అవసరమైన డబ్బు లేకపోవడం వల్ల ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేకపోవచ్చు. కొడుకుగా, కూతురుగా మీరు అమ్మకు ఆ ఆర్థిక తోడ్పాటును అందించి సర్‌ప్రైజ్ చేయండి.

సేవింగ్స్ స్కీమ్
అమ్మకు ఆర్థిక స్వేచ్ఛను కల్పిద్దాం. అమ్మ మీ మీద ఆధారపడి ఉన్నా తనంతట తాను ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా ఏర్పాటు చేయండి. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా కొన్ని సేవింగ్స్ స్కీమ్లు ఉన్నాయ్.. వాటిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మంచి ఇంట్రెస్ట్ తో నెల నెలా అమ్మకు పెన్షన్ రూపంలో ఆదాయం వస్తుంది. ఈ స్కీమ్ ఏర్పాటు చేసి సర్‌ప్రైజ్ చేయండి.
పిక్‌నిక్ అడ్వెంచర్
పిక్‌నిక్ అంటే కేవలం పిల్లలకు మాత్రమే కాదు, అలాగే అడ్వెంచర్లు కూడా యువకులకు మాత్రమే కాదు. అమ్మను ఇలాంటికి పిక్‌నిక్, అడ్వెంచర్ స్పాట్స్‌కు తీసుకువెళ్దాం. వారు చేయగల సాహసాలను చేయనిద్దాం. బోటింగ్ వల్ల పెద్ద వయసువారికి ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాంటి అడ్వెంచర్లను అమ్మతో చేపిద్దాం.

స్మార్ట్ మొబైల్
ఇప్పుడు మార్కెట్లో రకరకాలు స్మార్ట్ మొబైల్స్ వస్తున్నాయ్. కొత్త ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్నాయ్. ఆ కొత్త ఫీచర్లను అమ్మకు పరిచయం చేద్దాం. స్మార్ట్ మొబైల్స్‌ను స్మార్ట్ గా ఎలా ఉపయోగించాలో అమ్మకు చెబుదాం.
బంగారం
అమ్మకు బంగారాన్ని కొనిద్దాం. ఎంతో కొంత బంగారాన్ని అమ్మకు కొనిద్దాం. 5 గ్రాముల కాయిన్ లేదా 8 గ్రాముల కాయిన్‌ను కనీసం కొనిద్దాం. దానితో అమ్మకు ఇష్టమైన దానిని చేయించుకుంటుంది. అమ్మే కాబట్టి ఆ బంగారాన్ని మనకోసమే చేయిచినా ఆశ్చర్యం లేదు.



Click it and Unblock the Notifications
