Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
బంధంలో పెరుగుతున్న ప్రైవేట్ ‘స్పేస్’.. దూరం చేస్తుందా లేక ప్రేమను పెంచుతుందా.?
ఇదివరకు బంధం అంటే కలిసి బతకడం, ప్రతి విషయాన్ని పంచుకోవడం, ఒకరికొకరు దగ్గరగా ఉండేలా చూసుకోవడం. ఇద్దరి మధ్య ప్రేమ ఉందంటే.. వారి మధ్య ఎలాంటి దూరం ఉండకూడదని భావించేవారు. కానీ ఇప్పుడు దానర్థం మారిపోయింది. రిలేషన్‌షిప్‌లో స్పేస్ అనే పదం కొత్తగా చేరింది. ఇది ఇప్పుడు ముఖ్యమైన అవసరంగా మారిపోయింది. అసలేంటి ఈ స్పేస్ అంటే.. ఇద్దరి మధ్య కొంత ప్రైవేట్ స్పేస్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు.. మనస్తత్వ నిపుణులు ఏం చెబుతున్నారు.. చూద్దాం..

'నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను.. కానీ నాకు కొంత స్పేస్ కావాలి’. ఇది ఇటీవలి కాలంలో భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య వినిపిస్తున్న మాట. ఒకప్పుడు ఇది ఒకరిపై ఒకరికి అనుమానానికి, అసంతృప్తికి కారణంగా నిలిచినా.. ఇప్పుడు రిలేషన్‌లో అత్యవసరమైనదిగా మారింది. స్పేస్ అంటే వారి నుంచి దూరంగా వెళ్లిపోవడం కాదు. బంధంలో ఒకరి నుంచి కాస్త ప్రైవేట్ సమయాన్ని కోరుకోవడం. ఆలోచనలు, సమయం, భావాలను అర్థం చేసుకోవడానికి, గందరగోళం లేకుండా ఉండటానికి స్పేస్ కోరుకుంటారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధారపడటం ఎక్కువైనప్పుడు.. వారి మధ్య చిరాకు, ఉద్రిక్తత క్రమంగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో కొద్దిపాటి దూరం ఆ చిరాకును, ఉద్రిక్తతను తగ్గిస్తుంది.
ఇదివరకటి కాలంలా కాకుండా ఈ కాలంలో జీవనశైలి పూర్తిగా మారిపోయింది. పనిలో వేగం, ఒత్తిడి, ఉరుకులు పరుగుల జీవితం, సోషల్ మీడియా వాడకం, మొబైల్ ఫోన్లు, ఉద్యోగంలో మార్పులు.. ఇలా చాలా రకాల గందరగోళం నడుమ ఒక్కోసారి ఒంటరిగా గడపడం ఉపశమనం అనిపిస్తుంది. లేదంటే ఇది బంధంపై ప్రభావం చూపించి ఒడుదొడుకులకు దారితీస్తుంది.
గతంలో ఏ బంధమైనా కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలను మనసులోనే దాచుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. శారీరకంగానే కాదు.. మానసిక ఆరోగ్యంపైనా ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. అందుకే తమ కోసం కొంత సమయం కేటాయించుకోవడం ద్వారా కోపం, నిరాశ తగ్గి.. బంధాలను మెరుగుపరుచుకునే సామర్థ్యాన్ని పొందుతారు.
ఇద్దరి మధ్య స్పేస్- దూరం.. బంధాన్ని బలహీనపరుస్తుందనడం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. కాస్తంత దూరం బంధాన్ని మరింత బలపరుస్తుంది. భాగస్వాములు తమ వ్యక్తిగత జీవితాలను స్వేచ్ఛగా గడిపిన తర్వాత.. వారి మధ్య సంభాషణ మరింత మెరుగుపడుతుంది. గౌరవం పెరగడంతో పాటు అభిమానం కలుగుతుంది. ఇదే ఏకాంతానికి, దూరానికి మధ్య ఉన్న వ్యత్యాసం.

ఇద్దరి మధ్య దూరం అనేది ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన కోసమని భాగస్వాములు గమనించాలి. స్పేస్ క్రియేట్ చేసుకున్నంత మాత్రాన వారితో మాట్లాడటం మానుకోవద్దు. ఆరోగ్యకరమైన స్పేస్ కోసం కొన్ని సూచనలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
భాగస్వామితో మాట్లాడేటప్పుడు మనసులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నిష్కపటంగా మాట్లాడండి. ఒకరి సమయాన్ని, నిర్ణయాలను మరొకరు గౌరవించుకోవాలి. మరీ స్పేస్ ఎక్కువగా ఉండేలా చూసుకోకండి. నమ్మకమే పునాదిగా ఇద్దరి మధ్య దూరాన్ని ఆరోగ్యకరంగా సాగించండి. ఉక్కిరిబిక్కిరిగా ఉన్న బంధంలో కొంత దూరం ద్వారా స్పేచ్ఛ ఏర్పడి ప్రేమను పెంచుతుంది. రిలేషన్‌షిప్ ఎక్కువ కాలం కొనసాగేందుకు దోహదపడుతుంది. నేటి కాలంలో ఇద్దరి మధ్య స్పేస్ అనేది ముప్పు కాదని.. అదొక అవసరమని గుర్తించాలి.



Click it and Unblock the Notifications
