Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మొగుళ్లను వదిలేసి ప్రియుళ్ల కోసం వెళ్తున్న మహిళలు.. రీజన్స్ ఏంటి? ఎందుకిలా వదిలేస్తున్నారు?
కట్టుకున్న మొగుళ్లను వదిలేసి, కన్న బిడ్డలను కాదని ప్రియుడి మోజులో పడి అన్నీ వదిలేసి దేశాలు దాటుతున్న మహిళల గురించి తాజాగా ఇప్పడు చర్చనీయాంశంగా మారుతోంది. సోషల్ మీడియాలో పరిచయం అయిన యువకుల కోసం అన్నీ వదిలేసుకుని వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు చాలానే కనిపిస్తున్నాయి. అసలు ఇలా మహిళలు తమ భర్తలను, కన్న బిడ్డలను కూడా కాదని వేరొకరి కోసం వెళ్లిపోవడం ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు.

ప్రియుడి కోసం పాక్ నుంచి భారత్‌కు వచ్చిన మహిళ
పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ కు అప్పటికే పెళ్లయింది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్తతో ఈమెకు విడాకులు అయ్యాయి. ఈక్రమంలోనే పిల్లలను పెంచుకుంటూ వారితోనే కలిసి నివాసం ఉంటోంది. ఈమెకు తరచుగా పబ్జీ ఆడే అలవాటు ఉండేది. ఈ ఆట ద్వారానే ఢిల్లీకి చెందిన సచిన్ మీనా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా సరే తన ప్రేమను గెలిపించుకోవాలని తన నలుగురు పిల్లలతో సహా భారత్ వచ్చేయాలనుకుంది. వెంటనే షార్జా, ఖాట్మాండ్, నేపాల్ ఇలా అన్నీ దేశాలు తిరుగుతూ భారత్ వచ్చింది. ఢిల్లీకి వచ్చి గ్రేటర్ నోయిడాలో ప్రియుడితో కలిసి ఉంటోంది.
ప్రియుడి కోసం పాక్ వెళ్లిన చైనీయురాలు
చైనాకు చెందిన 21 ఏళ్ల గావ్ ఫెంగ్ మూడు నెలల వీసాపై పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ కు వెళ్లింది. అలా అని ఈమె ఏం టూరిస్ట్ వీసాపై వెళ్లలేదు. తన ప్రియుడి కోసం చైనా నుంచి అక్కడకు వచ్చింది. స్నాప్ చాట్ లో పరిచయం అయిన ఖైబర్ షఖ్తుంఖ్వా ప్రావిన్సుకు చెందిన 18 జావేద్ కోసం రోడ్డు మార్గం గుండా ఆమె అక్కడకు వెళ్లింది. అయితే ఆమె ఇస్లామాబాద్ రాగానే సదరు యువకుడు ఆమెను రిసీవ్ చేసుకొని తన మేనమామ ఇంటికి తీసుకెళ్లాడు. అయితే వీరిద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు.
భారత్ నుంచి పాక్ వెళ్లిన ఇద్దరు పిల్లల తల్లి
భారతదేశంలోని రాజస్థాన్ కు చెందిన అంజు అనే మహిళకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈమెకు ఫేస్ బుక్ ద్వారా పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఆమె భర్త, పిల్లలను వదిలేసి పాకిస్థాన్ కు వెళ్లిపోయింది. అక్కడితో అతడితో ఫుల్లుగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.
- జీవితంలో అసంతృప్తి, దాంపత్య జీవితంలో సంతోషం లేకపోవడం, లైంగిక సుఖం దక్కకపోవడం, ఎప్పుడూ సమస్యలు, కష్టాలు, కన్నీళ్లతో జీవితం అంటేనే వైరాగ్యం వచ్చేసిన వారు.. ఇలా కొన్ని ప్రేమ మాటలు మాట్లాడితే చాలు వారిలో ఓదార్పు వెతుక్కుంటారు. అలా ఏర్పడిన పరిచయం కోసం ఎక్కడికైనా, ఎంత దూరం అయినా వెళ్తుంటారు.
- పెళ్లి జరిగి ఎంత మంది పిల్లలు ఉన్నా.. భార్యాభర్తల మధ్య బంధం సరిగ్గా లేదంటే వేరే వాళ్లకు అట్రాక్ట్ అవుతుంటారు. వారికి దగ్గరై అదే నిజమైన ప్రేమ అనుకొని.. వారి చెంతకు చేరుతుంటారు.
- దాదాపు చాలా మంది జంటలకు పెళ్లి అనేది శృంగారానికి సంబంధించింది. కేవలం ఆ అవసరం తీర్చి పిల్లలను కనడానికి మాత్రమే భార్య అన్నట్లుగా ప్రవర్తించే పురుషుల వల్ల మహిళలు నిరాసక్తతకు లోనవుతారు. దాన్ని దూరం చేసుకోవడానికి వేరే వాళ్లతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అదే వారి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఇలా కూడా చాలా మంది తమకు నచ్చిన వాళ్లతో వెళ్లిపోతుంటారు.
- అరేంజ్డ్ మ్యారేజీ చేసుకున్న చాలా మంది జంటల్లో.. స్త్రీలు తమ భర్తలతో చనువుగా మాట్లాడారు. అతడికి కావాల్సినవి ఇస్తూ... జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ప్రేమగా ఎవరైనా మాట్లాడితే వెంటనే వారితో ప్రేమలో పడిపోయి వారి కోసం ఏదైనా చేసేస్తుంటారు.



Click it and Unblock the Notifications