Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
షాకింగ్ సర్వే.. వామ్మో పెళ్ళికి ముందే అమ్మాయిలు అలా! అబ్బాయిలు ఇక అంతే..
ఈ టెక్నికల్ కాలంలో చాలా మంది 30 సంవత్సరాలు దాటిన తరువాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. జీవితంలో స్థిరపడాలని, జీవితంలో తాము అనుకున్న స్థాయిలో ఉండాలని ఎక్కువగా సమయాన్ని వృథా చేసి 30 సంవత్సరాలు దాటిన తరువాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది వివాహానికి ముందే వేరే బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఒకటని కాదు.. కొంతమంది వివాహానికి ముందే నాలుగైదు బంధాలను కొనసాగిస్తున్నారు.
అయితే ఇటీవల లీడ్ ఇన్ ఇండియా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్ళికి ముందే చాలా మంది వేరే బంధాలను కొనసాగిస్తున్నారని అందులో తేలింది. అసలు ఆ సర్వేలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? దానికి కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సర్వేలో ఏముందంటే..
మైమ్యూస్ అనే బెడ్‌రూం వెల్‌నెస్ బ్రాండ్ లీడ్ ఇన్ ఇండియా అనే సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు పదివేల మంది అభిప్రాయాలను స్వీకరించింది. వారందరూ పెళ్ళికి ముందు వేరే బంధాలను కలిగి ఉన్నారని వారి సర్వేలో వెల్లడైంది. వివాహానికి ముందే సంబంధాలు కలిగి ఉండడం, ఆ సంబంధాలకు సమాజంలో అంగీకారం లభిస్తుండడంతో అవి ఎక్కువ అవడం వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కొత్తదనం కోసం..
ఈ సర్వే ప్రకారం 62 శాతం మంది తమ తమ బంధాలలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారని వెల్లడైంది. తమ ప్రస్తుత బంధంలో ఆసక్తికరమైన విషయాలు లేకపోవడం, శారీరక కోరికలు తీరకపోవడం, అలాగే బంధంలో కొత్తదనం కోసం వేరే బంధాల వైపు మొగ్గు చూపుతున్నారని తేలింది. అలాగే తమ శారీరక కోరికలు తీర్చుకోవడానికి, తమ శారీరక అసంతృప్తులను మెరుగుపరుచుకోవడానికి కృత్రిమ వస్తువులను వాడుతున్నారని పేర్కొన్నారు.
ఆడవారే అధికంగా..
ఈ సర్వేలో వివాహితులు కూడా వేరే బంధాలను కలిగి ఉన్నారని వెల్లడైంది. శారీరక కోరికలు తీరకపోవడం వల్ల చాలా మంది వివాహితులు వేరే బంధాలను కోరుకుంటున్నారని అందులో తేలింది. ఇందులో 60 శాతం మంది మహిళలు ఉండగా.. పురుషులు కేవలం 53 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. శారీరక కోరికలు తీరకపోవడానికి, శారీరక అసంతృప్తులు పెరగడానికి చాలానే కారణాలు ఉన్నప్పటికి.. వారు కొత్త బంధాలను కోరుకుంటున్నారని వెల్లడైంది.
నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కొత్త బంధాలు కోరుకోవడానికి, వివాహానికి ముందే సంబంధాలు పెట్టుకోవడానికి చాలానే కారణాలు ఉంటాయి. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం, పిల్లల పెంపకం భారంగా మారడం, జంటల మధ్య ఆత్మీయత తగ్గిపోవడం కూడా ఓ కారణమనే చెబుతున్నారు. దీంతో పాటు శృంగారంపై సరైన అవగాహన లేకపోవడం.. భావాలను పంచుకోకపోవడం కూడా కారణమనే చెబుతున్నారు. వీటి వల్ల మన దేశంలో ఇతరులతో బంధాలను కోరుకుంటున్నారని తేలింది.



Click it and Unblock the Notifications