Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ప్రియుడితో పత్తాపారం కోసం..తల్లి ఫుడ్ లో నిద్రమాత్రలు కలుపుతున్న 15 ఏళ్ల కూతురు..చివరికి షాకింగ్!
ఓ పదిహేనేళ్ల బాలిక, తన ప్రియుడితో రాత్రుళ్లు, మాట్లాడేందుకు, ఏకాంతంగా కలుసుకునేందుకు చేసిన పని ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది. తన తల్లిని గాఢ నిద్రలోకి పంపేందుకు ఏకంగా మూడు నెలల పాటు ఆమెకు తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది. రోజూ మూడు నుంచి నాలుగు స్లీపింగ్ ట్యాబ్లెట్లను తల్లి తినే ఆహారంలో కలిపేది. నిద్రమాత్రలు కలిపిన ఫుడ్ తిని తల్లి నిద్రలోకి జారుకున్నాక ఆ బాలిక ప్రియుడితో ఫోన్లో గంటల తరబడి సంభాషణలు, రహస్య సమావేశాలతో కాలక్షేపం చేసేది.
అయితే క్రమంగా ఆ తల్లి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెకు మెడికల్ టెస్టులు చేయించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఆమె శరీరంలో అధిక మోతాదులో నిద్రమాత్రల అవశేషాలు ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. ఈ సంచలనకర విషయం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల విచారణలో ఆ బాలిక అసలు నిజాన్ని కక్కేసింది. తానే రోజూ అమ్మకు నిద్రమాత్రలు ఇచ్చేదాన్నని.. తను నిద్రపోయాక నాకు నచ్చినట్టు ఉండేదాన్ని అంటూ నిర్లజ్జగా ఒప్పుకోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కృష్ణానగర్ లో వెలుగు చూసిన ఈ సంఘటన ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో తమకున్న సంబంధాన్ని తక్షణమే పునఃపరిశీలించుకోవాల్సిన ఆవశ్యకతను కళ్ళకు కడుతోంది.

మర్డర్ ఫ్లాన్
ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా ఆ బాలిక దగ్గర నిద్రమాత్రల స్ట్రిప్స్ తో పాటు ఆమె ప్రియుడు ఇచ్చినట్లు చెప్పబడుతున్న ఓ విషపు సీసా కూడా లభ్యమైంది. ఇది విన్న కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్‌కు గురయ్యారు. విచారణలో.. నిజానికి మా అమ్మను చంపేయాలనే మొదట ప్లాన్ చేశాను. కానీ ఎందుకో ఆ పని చేయలేకపోయాను. అందుకే కేవలం నిద్రమాత్రలు మాత్రమే ఇస్తూ వచ్చాను అని ఆ బాలిక చెన మాటలు వారి వెన్నులో వణుకు పుట్టించాయి.
టీనేజర్లు ఇలాంటి తీవ్రమైన, అఘాయిత్యాలకు పాల్పడటం వెనుక అనేక సంక్లిష్టమైన కారణాలు దాగి ఉంటాయి. సోషల్ మీడియా, ఆన్ లైన్ స్నేహాలు పిల్లల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వారు ప్రేమ, స్నేహం, స్వేచ్ఛ వంటి పదాల వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని తెలుసుకోకుండా వాటిని తప్పుగా అన్వయించుకుంటున్నారు. తెలియని వ్యక్తుల మాయమాటలను నమ్మి, వారిని గుడ్డిగా అనుసరిస్తూ, తప్పుడు మార్గాల్లో పయనిస్తున్నారు. లక్నో బాలిక కూడా తన ప్రియుడిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని, అతని కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతానని భావించి, అతని ఆదేశానుసారం ఈ ఘోరానికి పాల్పడింది.
ఈ వయసులో పిల్లలు తరచుగా ఏది సరైనదో, ఏది తప్పో నిర్ణయించుకోవడంలో పొరపాట్లు చేస్తుంటారు. వారి ఆలోచనా పరిధి పరిమితంగా ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చెడుల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ఓపికగా వివరించాలి. ప్రతి పరిస్థితిలోనూ తాము వారికి అండగా ఉంటామనే భరోసా కల్పించాలి. పిల్లలు తమ తల్లిదండ్రులను తమ శ్రేయోభిలాషులుగా, స్నేహితులుగా భావించినప్పుడు బయటి వ్యక్తుల ప్రభావానికి లోనయ్యే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.



Click it and Unblock the Notifications
