Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మంచాన పడ్డ భర్త..ఆరేళ్లు సేవలు చేసిన భార్య..కోలుకున్నాక వదిలేసిన మొగుడు!
తమకు ఎంత సేవ చేసినా కృతజ్ణతా భావం లేని జాతి ప్రజలు అంటూ రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఓ వ్యక్తి దానిని నిజం చేసి చూపించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రమాదంలో గాయపడి మంచాన పడితే, ఆ భార్య అతడికి కంటికి రెప్పలా సేవ చేసింది. ఆరేళ్ల పాటు చంటిబిడ్డను చూసుకున్నట్లు సేవలు చేసింది. తీరా కోలుకున్నాక ఆమెను వదిలేశాడు మొగుడు. అంతటితో ఆగకుండా అతడు చేసిన పనికి అందరూ ఛీ నీచుడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మలేషియా దేశానికి చెందిన నూరుల్ సయాజ్వానీ 2016లో లవ్ మ్యారేజ్ చేసుకుంది. వారికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. వారి జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో పెళ్లయిన రెండేళ్లకే ఆమె భర్త ఘోర కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి, పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి నూరుల్ జీవితం మారిపోయింది. తన భర్తను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆరేళ్ల పాటు అతడికి తినిపించడం, స్నానం చేయించడం, డైపర్లు మార్చడం వంటి పనులన్నీ తానే దగ్గరుండి చేసింది. కన్నబిడ్డలా చూసుకుంటూ అతనికి పునర్జన్మ ఇచ్చింది. అయితే, అందరి ప్రార్థనలు ఫలించి, నూరుల్ సేవలు ఫలించి అతను పూర్తిగా కోలుకున్నాడు. మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.

ఆరోగ్యం కుదుటపడ్డాక అతను తన అసలు రంగు చూపించాడు. తన కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన భార్యను కృతజ్ఞత లేకుండా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల నూరుల్ కు విడాకులు ఇచ్చి సరిగ్గా వారం రోజులకే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ దారుణమైన నిజాన్ని నూరుల్ సోషల్ మీడియాలో ఎంతో హుందాగా పంచుకుంది. తన మాజీ భర్త రెండో పెళ్లి ఫోటోను పోస్ట్ చేస్తూ..నా భర్తకు శుభాకాంక్షలు. నువ్వు ఎంచుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటావని ఆశిస్తున్నాను. నాలానే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందని ఆశిస్తున్నాను. నా బాధ్యత పూర్తయింది అని రాసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.
నెటిజన్లు ఆ భర్తపై విమర్శల వర్షం కురిపించారు. ప్రాణాలు కాపాడిన భార్యకే ద్రోహం చేస్తావా? అంటూ అతన్ని నమ్మకద్రోహి అని నిందించారు. ఇంత కృతజ్ఞత లేని మనుషులు ఉంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం పెరగడంతో నూరుల్ ఆ పోస్ట్‌ను తొలగించింది. కానీ ఈ సంఘటన మానవ సంబంధాల్లోని కృతజ్ఞత, త్యాగం, నమ్మకద్రోహం వంటి అంశాలపై తీవ్రమైన చర్చకు దారితీసింది.



Click it and Unblock the Notifications
