Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
సోషల్ మీడియాలో 'లైక్' కొట్టారా? అయితే మీ కాపురం డేంజర్‌లో పడ్డట్టే!..కోర్టు సంచలన తీర్పు
ప్రస్తుతం మనదేశంలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి లేడు అని చెప్పొచ్చు. బిక్షాటన చేస్తున్నవాళ్లు కూడా మంచి మంచి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ అనేది అందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. అయితే మంచి ఉన్నచోట చెడు కూడా ఉంటది అన్నట్లు స్మార్ట్ ఫోన్ వల్ల నేరాలు పెరుగుతున్నాయి, కాపురాలు కూలిపోతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం.
స్మార్ట్ ఫోన్ వాడే అందరూ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ లను కూడా ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో నచ్చిన ఫోటోకి లైక్ కొట్టడం లేదా నచ్చిన వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేమడం వంటిది అందరూ చేసే పనే. సోషల్ మీడియాలో పోస్టులకు లైక్ కొడితే కాపురాలు కూలిపోతాయా? ఈ ప్రశ్నకు ఓ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సోషల్ మీడియాలో భర్త వేరే మహిళల ఫోటోలను లైక్ చేయడం వల్ల ఓ కాపురం కోర్టు మెట్లెక్కింది.

అసలేం జరిగింది?
టర్కీకి చెందిన ఓ వివాహిత మహిళ తన భర్త ప్రవర్తనపై విసిగిపోయి కోర్టును ఆశ్రయించింది. తన భర్త సోషల్ మీడియాలో నిరంతరం ఇతర మహిళల ఫోటోలను చూస్తున్నాడని, వాటిని లైక్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ ప్రవర్తన తనను తీవ్రంగా అవమానించడమే కాకుండా, తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని వాపోయింది.
నా భర్త ప్రవర్తన వల్ల మా మధ్య నమ్మకం సన్నగిల్లింది, ఇది మా దాంపత్య జీవితానికి ముప్పుగా మారింది అని ఆమె న్యాయస్థానం ముందు కన్నీరు పెట్టుకుంది. దీనికి పరిహారంగా భర్త నుంచి భరణం, నష్టపరిహారం కావాలని డిమాండ్ చేసింది.
కోర్టు సంచలన తీర్పు
ఈ కేసును విచారించిన టర్కీ సివిల్ కోర్టు అప్పీలేట్ డివిజన్..భర్తదే తప్పు అని తేల్చిచెప్పింది. భర్త చేసిన పనిని తీవ్రమైన దోషంగా పరిగణించింది. వేరే మహిళల ఫోటోలను లైక్ చేయడం నేరుగా వివాహేతర సంబంధం కాకపోయినా అది భార్యకు మానసిక వేదన కలిగిస్తుందని,వివాహ బంధంలోని నమ్మకాన్ని దెబ్బతీస్తుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
శిక్షగా భర్తకు 85,000 రూపాయల భౌతిక పరిహారం, మరో 85,000 నైతిక పరిహారం, భార్యకు నెలవారీ జీవనోపాధి చెల్లించాలని ఆదేశించింది. భవిష్యత్తులో వచ్చే వైవాహిక వివాదాలకు ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుందని కోర్టు తెలిపింది.
సోషల్ మీడియా వల్ల కాపురాల్లో చిచ్చు రేగకూడదంటే
-మీరు చేసే పోస్ట్, కామెంట్ లేదా లైక్ మీ భాగస్వామిని బాధపెడుతుందా లేదా అని ఒక్క క్షణం ఆలోచించండి. వారి భావాలకు విలువ ఇవ్వండి.
-సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరితో చాట్ చేయాలి అనే విషయంలో ఇద్దరూ మాట్లాడుకుని ఒక అవగాహనకు రండి. పరస్పర సమ్మతి చాలా ముఖ్యం.
-మీ వ్యక్తిగత విషయాలు, గొడవలు లేదా అతిగా భావోద్వేగమైన పోస్టులను సోషల్ మీడియాలో పంచుకోవద్దు.
-నిరంతరం నోటిఫికేషన్లు చూసుకోవడం, లైకుల కోసం ఆరాటపడటం అనే వ్యసనం మీ నిజ జీవిత బంధాలను దూరం చేస్తుంది.



Click it and Unblock the Notifications