Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మరో అపార్ట్ మెంట్ లో భార్య.. తట్టుకోలేక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. తన ఫ్లాట్ లోనే ఫ్యాన్ కి అతడు ఉరివేసుకొని చనిపోయాడు. అయితే టెకీ ఆత్మహత్యకు కారణం అతడి భార్యనేనా? లక్షల్లో జీతం వస్తున్నా ఆనందం లేకుండా ఉరివేసుకునే పరిస్థితి అతడికి ఎందుకొచ్చింది? ఈ టెకీ మరణం వెనుక అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
కేరళ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ నాయర్ బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో మార్కెటింగ్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి 12 ఏళ్ల క్రితం పూజా నాయర్ తో వివాహం అయ్యింది. ఈ దంపతులకు 8 ఏళ్ల కూతురు కూడా ఉంది. ప్రశాంత్ కి మంచి జీతం వస్తుంది. ఆర్థిక కష్టాలు కూడా లేవని చెబుతున్నారు. హెన్నూరులోని ఓ అపార్ట్ మెంట్ లో కలిసి ఉండేవాళ్లు. ఇలా వీరి సంసారం హాయిగా సాగిపోతున్న సమయంలో ఏడాది క్రితం నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి.

ప్రశాంత్, పూజ దంపతుల వైవాహిక జీవితంలో గొడవలు పెద్దవవడంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దమనుషులు జోక్యం చేసుకొని గొడవలు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పెద్దమనుషుల మధ్యవర్తిత్వం ఫలించలేదు. పెళ్లాం నుంచి విడిపోయి ఒంటరిగా ఉండేందుకే ప్రశాంత్ ఇష్టపడ్డాడు. దీంతో ఏడాది క్రితం నుంచి ప్రశాంత్, పూజా విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. ఉత్తర బెంగళూరులోని గనిగరహల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో ప్రశాంత్ ఒంటరిగానే నివసిస్తున్నాడు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అయినా సంతోషం లేదు.. భార్యతో గొడవలు.. సంతోషంగా లేని జీవితం.. ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఆదివారం రాత్రి తన ఫ్లాట్ లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ప్రశాంత్ తండ్రి ఎమ్ ఎన్ కుట్టీ(MN Kutty)కి అపార్ట్ మెంట్ కి వెళ్లగా తన కొడుకు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడం చూసి గుండెలు పగిలేలా విలపించాడు.
వ్యక్తిగత జీవంలో భావోద్వేగ సమస్యల కారణంగానే ప్రశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు తెలిపారు. నార్త్ బెంగళూరు డిసిపి సైదులు అడవత్ మాట్లాడుతూ..ప్రశాంత్ ని అతడి భార్య వేధించినట్లు ఎటువంటి ఆరోపణలు లేవని, ఏడాది క్రితం వారు విడిపోయారని అన్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదని తెలిపారు. దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉన్నట్లు ప్రశాంత్ కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేయలేదని పోలీసులు తెలిపారు.
తన కొడుకు,కోడలు విడివిడిగా నివసిస్తున్నారని ప్రశాంత్ నాయర్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. శుక్రవారం ప్రశాంత్ తన భార్యతో గొడవ పడ్డాడని, ఆ తర్వాత తండ్రి ఫోన్ లో అతనిని సంప్రదించడానికి ప్రయత్నించాడు. కాల్స్ కు సమాధానం లేకపోవడంతో అతను ఇంటికి చేరుకుని చూడగా అతను సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడని పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ లో ప్రశాంత్ తండ్రి చెప్పాడు. తన కొడుకు అతడి జీవితంలో వైవాహిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తాను భాబిస్తున్నానని,ఎవరినీ అనుమానించడం లేదని తెలిపాడు.
పోస్టుమార్టం తర్వాత ప్రశాంత్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అసహజ మరణం కింద సోలదేవనహల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.



Click it and Unblock the Notifications