Latest Updates
-
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
ఇంట్లో ఇల్లాలు, పక్కింట్లో ప్రియురాలు, ఉద్యోగం చేస్తున్న భార్యను ఇలా వదిలించుకున్నాడు
నా భార్య కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరువాత అదే భర్త పోలీసులకు అతిథిగా మారాడు. ఓ యువతి వివాహం చేసుకుని ఆమె భర్తకు కాపురం చేసింది. ఒకరోజు గార్మెంట్స్ లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లిన భార్య తిరిగి రాలేదు. నా భార్య కనిపించకుండా పోయిందని, ఆమె కోసం వెతకాలని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త అక్కడ నాటకాలు వేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరువాతే అక్రమ సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని దొడ్డబల్లాపూరంలోని కరేనహళ్లిలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల వీణా రెండు వారాల క్రితం ఇంటి నుంచి వెళ్లిన తరువాత అదృశ్యమైంది. దీంతో ఆమె భర్త రవి తన భార్య వీణా అదృశ్యం అయ్యిందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న తన భార్య వీణా ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తరువాత కనిపించలేదని రవి పోలీసుల ముందు నటించాడు.

వారం రోజుల తర్వాత తూబగెరెలోని నరసింహనహళ్లి అటవీ ప్రాంతంలో బీట్ కు వెలుతున్న ఫారెస్ట్‌గార్డుకు గుర్తు తెలియని యువతి మృతదేహం కనిపించింది. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు, అటవి శాఖ అధికారులు ఆరా తీశారు. అడవిలో కనిపించిన గుర్తుతెలియని మహిళ మృతదేహం గురించి విచారణ ప్రారంభించిన పోలీసులు ఇటీవల మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీశారు.
ఏప్రిల్ 22వ తేదీన దొడ్డబళ్లాపురంలో అదృశ్యమైన వీణా కేసు పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె బంధువులకు ఫోన్ చేసి మృతదేహాన్ని గుర్తించాల్సిందిగా పోలీసులు కోరారు. మృతదేహం పాదాలకు సగం అరిగిపోయిన షూలను చూసిన బంధువులు అది వీణా మృతదేహంగా గుర్తించారు. అప్పుడు నరసింహనహళ్లి అటవీ ప్రాంతంలో చిక్కిన మృతదేహం వీణాదిని పోలీసులు నిర్దారించుకున్నారు. వీణా అత్త, మామ, భర్త రవితో పాటు బంధువులను విచారించగా వీణాను ఆమె భర్తే హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తన భార్య వీణాను తానే హత్య చేసినట్లు రవి అంగీకరించాడు. పక్క ఇంటి మహిళతో నిందితుడు రవి అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. భర్త రవి అక్రమ సంబంధం విషయం వీణాకు ఈ వ్యవహారం తెలిసి ఇంట్లో గొడవలు జరిగేవి. కొడుకుకు బుద్ది చెప్పడంలో ఆయన కుటుంబం కూడా విఫలమైందని బందువులు అంటున్నారు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భార్య వీణాను హతమార్చేందుకు పథకం వేసిన రవి ఆమె పనిచేస్తున్న ఫ్యాక్టరీకి వెళ్లి సాయంత్రం తనతో పాటు పిలుచుకుని వెళ్లి తరువాత నరసింహనహళ్లి అటవి ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. భార్య వీణా మృతదేహం ఎవ్వరూ గుర్తు పట్టకూడదని అనుకుని ఆమె శవంపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చి ఇరుగుపొరుగు ఇంట్లో భార్య వీణా కోసం వెతుకుతున్నట్లు నటించాడు.



Click it and Unblock the Notifications