Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మానసిక మోసం vs శారీరక ద్రోహం..ఏది ఎక్కువ ప్రమాదకరం? హీరోయిన్స్ ఏమంటున్నారు?
ఈ ప్రపంచంలో ఏ రిలేసన్ కి అయినా ముఖ్యమైన పునాదులు రెండు..అవే ప్రేమ,నమ్మకం. అయితే ఒక వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తూ రహస్యంగా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వంటి చర్యలు ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీస్తుంది, వారి మనశ్శాంతిని దూరం చేస్తుంది.
అయితే ఈ షోలో కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కూడా పాల్గొన్నారు. శారీరక మోసం కన్నా భావోద్వేగ మోసం ఎక్కువ ప్రమాదకరమా? అని అడిగిన ప్రశ్నకు జాన్వీ కపూర్ రెండు మోసాలూ తప్పే, ఒకదానితో మరొకదాన్ని పోల్చలేం అని సమాధానమిచ్చారు.

కానీ కాజోల్, ట్వింకిల్, కరణ్ జోహార్ మాత్రం ముక్తకంఠంతో భావోద్వేగ మోసమే ఎక్కువ బాధిస్తుంది అని తేల్చిచెప్పారు. వారి ప్రకారం శారీరక ద్రోహం అనేది ఒక క్షణంలో జరిగిపోయే పొరపాటు కావచ్చు, కానీ మనసు వేరొకరిపైకి మళ్లడం అంటే బంధం పునాది కదిలిపోయినట్టే. ఇది నమ్మకాన్ని, హృదయాన్ని ముక్కలు చేస్తుంది.
నిపుణులు ఏమంటున్నారు?
సెలబ్రిటీల మాటలు పక్కన పెడితే రిలేషన్ షిప్ నిపుణులు ఏంటున్నారంటే.. శారీరక ద్రోహం జరిగిన తర్వాత జంటలు తిరిగి ఒకటి కావడం సాధ్యమేమో కానీ భావోద్వేగ ద్రోహం తర్వాత బంధంలో నమ్మకాన్ని పునరుద్ధరించడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. ఈ రోజుల్లో కౌన్సెలింగ్ కోసం వచ్చే చాలామంది జంటలుతమ భాగస్వామి శారీరకంగా మోసం చేశారని కాకుండా, తమను మానసికంగా ఒంటరిని చేశారనే బాధతోనే వస్తారని చెబుతున్నారు.
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, వాట్సాప్ చాట్‌లు, అర్థరాత్రి సంభాషణలు కంటికి కనిపించని ఈ మానసిక ద్రోహానికి సులభమైన మార్గాలుగా మారాయి. స్నేహం పేరుతో మొదలయ్యే ఈ బంధం, క్రమంగా భావోద్వేగ ఆధారపడటంగా మారి అసలు సంబంధాన్ని బలహీనపరుస్తుంది.
పరిష్కారం ఏమిటి?
ఒకప్పుడు వివాహేతర సంబంధాలు ఉన్నా కూడా సామాజిక భయం, పరువు పోతుందనే సిగ్గుతో ఎవరూ వాటి గురించి బయటపడేవారు కాదు. కానీ నేటి తరం ఈ విషయాలపై బహిరంగంగా చర్చిస్తోంది. అయితే శారీరక, భావోద్వేగ ద్రోహాలకు మూల కారణాలు దాదాపు ఒకటే.. భాగస్వాముల మధ్య భావోద్వేగ దూరం, తీరని కోరికలు, సరైన సంభాషణ లేకపోవడం. బంధంలో నమ్మకం, అనుబంధం తగ్గినప్పుడు, ఎలాంటి మోసానికైనా ఆస్కారం ఉంటుంది.
మీ భాగస్వామి మీకు దూరమవుతున్నారని అనిపిస్తే, మొహమాటం లేకుండా వారితో మాట్లాడండి. మీ భావాలను పంచుకోండి. ఏ సంబంధమూ పరిపూర్ణంగా ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకుని, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. నిజాయితీ, సంభాషణ ద్వారా విరిగిన నమ్మకాన్ని కూడా తిరిగి పొందవచ్చు.



Click it and Unblock the Notifications