Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సంభోగ సమయంలో అందరూ తెలీక చేసే తప్పు..శాస్త్రం ఏం చెబుతుందంటే?
దాంపత్య బంధంలోని మాధుర్యం, పవిత్రత గురించి మన పెద్దలు, శాస్త్రాలు ఎన్నో విషయాలను స్పష్టంగా వివరించాయి. అయితే ఆధునిక జీవనశైలిలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలను మరచిపోతున్నాం లేదా వాటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తున్నాం. కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మన జీవితంపై, మన భవిష్యత్తు తరాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ నండూరి శ్రీనివాస్ హెచ్చరిస్తున్నారు.
అలాంటి వాటిలో ఒకటి శృంగారం సమయంలో దాదాపు అందరూ తెలియక చేసే ఒక పెద్ద తప్పు. ఈ విషయం గురించి మాట్లాడటానికి చాలామంది ఇబ్బందిపడతారు. కానీ తెలియని విషయాన్ని తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే కదా. కాబట్టి ఇంతకీ శృంగార సమయంలో కామన్ గా చేసే ఆ తప్పు ఏంటి? దాని వెనుక ఉన్న శాస్త్ర రహస్యం ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

శాస్త్రం ఏం చెబుతోంది?
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగాలకు ప్రసిద్ధి చెందిన నండూరి శ్రీనివాస్ ఒక సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక శ్లోకాన్ని ఉదహరించారు.
"దీపనస్తే యస్సంగం కరోతి మనుజోయది
యావత్జన్మదరిత్రత్వం సంతతేర్ నాత్ర సంశయ:"
ఈ శ్లోకం యొక్క అర్థం చాలా లోతైనది. ఎవరైతే దీపం లేనిచోట అంటే కటిక చీకటిలో శృంగారం చేస్తారో వారికి ఈ జన్మ మొత్తం దరిద్రం వెంటాడుతుంది. అంతేకాకుండా వారి సంతానానికి కూడా ఆ దరిద్రం సంక్రమిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని దీని భావం.
అంటే శృంగారం చేసే గదిలో ఎప్పుడూ చిమ్మచీకటి ఉండకూడదు.
కనీసం ఒక చిన్న దీపం వెలుగైనా ఉండాలి. ఆ దీపం అంటే ప్రకాశవంతమైన లైట్లు కాదు. ఒక చిన్న నైట్ ల్యాంప్, మసక వెలుతురు ఇచ్చే దీపం లేదా కనీసం కిటికీ నుండి వచ్చే చంద్రుని వెన్నెలైనా సరే. పూర్తి అంధకారం ఉండకూడదు.
చీకటి ఎందుకు అరిష్టం?
దీని వెనుక కేవలం నమ్మకమే కాదు, బలమైన శాస్త్రీయ, మానసిక కారణాలు కూడా ఉన్నాయి.
-వెలుగును దైవ స్వరూపంగా, జ్ఞానానికి, సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. దాంపత్యం అనేది ఒక పవిత్రమైన కార్యం. అటువంటి సృష్టి కార్యం దైవికమైన వెలుగు సాక్షిగా జరగాలి కానీ అజ్ఞానానికి, ప్రతికూల శక్తులకు ప్రతీక అయిన చీకటిలో కాదు.
-పూర్తి చీకటిలో కేవలం శారీరక స్పర్శ మాత్రమే ఉంటుంది. కానీ మసక వెలుతురులో ఒకరినొకరు చూసుకోగలగడం, భాగస్వామి కళ్ళలోని భావాలను అర్థం చేసుకోవడం ద్వారా మానసిక అనుబంధం బలపడుతుంది. ఇది కేవలం శారీరక కలయికగా కాకుండా ఆత్మల కలయికగా మారుతుంది.
వెలుగు ఉన్న చోట సానుకూల శక్తి ప్రసరిస్తుంది. చీకటి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. పవిత్రమైన కార్యం సానుకూల వాతావరణంలో జరిగినప్పుడు, దాని ఫలితంగా కలిగే సంతానం కూడా తేజస్సుతో, ఐశ్వర్యంతో వర్ధిల్లుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇది కేవలం ఒక మూఢనమ్మకం కాదని.. మన పూర్వీకులు మన శ్రేయస్సును కాంక్షించి ఏర్పరచిన ఒక జీవన విధానం అని పలువురు నిపుణులు కూడా చెబుతున్నారు.



Click it and Unblock the Notifications