Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Toxic Relationship : రిలేషన్‌షిప్ లో టాక్సిక్ వ్యక్తులు ఇలా ఉంటారు.. జాగ్రత్త..!
రిలేషన్‌షిప్‌లో టాక్సిక్ పర్సనాలిటీకి చెందిన వ్యక్తుల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయ్. పెళ్లి తరువాత, ప్రేమలో ఎలాంటి ఇబ్బందులైనా ఉండవచ్చు, ఎలాంటి సమస్యలైనా ఉండవచ్చు కానీ టాక్సిక్ మనస్తత్వం కలిగితే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. టాక్సిక్ మెంటాలిటీని మార్చే ప్రయత్నం చేయాలి. వారు టాక్సిక్‌గా ఉన్నారా లేదా తెలుసుకోవడానికి చాలా సంకేతాలుంటాయ్. వారు టాక్సిన్ పర్సన్ అని మీరు తెలుసుకోనంత వరకు మీరు మిమ్మల్నే తప్పుగా అర్ధం చేసుకునే పరిస్థితి రావచ్చు. కాబట్టి ముందుగానే టాక్సిక్ మనస్తత్వాన్ని తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలి. ఇందుకోసం మీకు సహకారంగా టాక్సిక్ వ్యక్తులకు ఉండే లక్షణాలను మీకు ఇక్కడ అందిస్తున్నామ్.
టాక్సిక్ వ్యక్తిత్వం గలవారిలో ఈ లక్షణాలుంటాయ్..
మిమ్మల్ని ఎప్పడూ గ్యాస్ లైటింగ్ చేస్తారు. గ్యాస్ లైటింగ్ అంటే మీరే తప్పు చేస్తున్నట్లు మీ తప్పులను మీరే తెలుసుకోవాలన్నట్లు సైకలాజికల్‌గా ప్రవర్తిస్తుంటారు. మీరు సరైన వ్యక్తిత్వంతో ఉన్నా మీ తప్పులనే ఎత్తి చూపుతారు. ఇతరులపై తప్పులను నెట్టి తమను గొప్పగా చూపించుకునే యత్నంలో ఉంటారు.

గొడవలకు దిగడం
ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మాట్లాడి పరిష్కరించకుండా అనవసరంగా గొడవలకు దిగుతారు. పెద్ద గొంతుతో అరిచి మాటలను అణిచే ప్రయత్నం చేస్తారు. వారు అనుకున్నట్లే పూర్తిగా జరగాలని తెగింపుతో భయపెడతారు. ఈ లక్షణం టాక్సిక్ వ్యక్తులలో ప్రధానంగా ఉంటుంది.
తమది ఏ తప్పుూ లేదు
ప్రతీ విషయంలో లేదా ఏ ఘర్షణలోనైనా తమది ఏతప్పూ లేదని మాట్లాడుతారు. ఎన్ని కుట్రలు మోసాలు చేసినా తమను అమాయకంగా చిత్రించుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న అవకాశం దొరికితే తమ తప్పులను వేరే వారిపై నెట్టే ప్రయత్నం చేస్తుంటారు.
గ్యాస్ లైటింగ్
టాక్సిక్ వ్యక్తుల్లో గ్యాస్ లైటింగ్ ప్రధానంగా ఉంటుంది. మీ మీద మీకే అసహ్యం పుట్టేలా వారి ప్రవర్తన వుంటుంది. గ్యాస్ లైటింగ్ వ్యక్తులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ఇది నేను నిన్ను ప్రేమించడం వల్లే చేశాను అంటారు. అలా ఎప్పుడూ జరగలేదు, నీదే తప్పుంది, దీంట్లో అంత తప్పేమీ లేదు నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావ్ అనే మాటలను పదే పదే మీతో అంటుంటారు.
అబద్ధాలు
అబద్దాలు చెప్పడం వీరికి అలవాటుగా మారుతుంది. చాలా సులభంగా అబద్ధాలు చెబుతారు. వారు ఏ విషయంలో నిజాయితీగా ఉంటారో తెలుసుకోవడం మీకు చాలా కష్టంగా వుంటుంది. వారి హావభావాలను గమనిస్తే వాళ్లు అబద్ధాలు చెబుతున్నారని మీకు స్పష్టంగా అర్థమైపోతుంది.
మనసును గాయపరుస్తారు
మీ ఇష్టాలను సులభంగా గాయపరుస్తారు. మీకేదైనా సంగీతం ఇష్టమని చెబితే ఆ ట్యూన్ ఏమీ బాగాలేదని మీ ముందు పదే పదే చెబుతారు. మీకు నచ్చినవాటిపై విమర్శలు చేస్తూ వాటిని చులకనగా తీసి పాడేస్తుంటారు. మాటలతో మీ మనసులను గాయపరచడం సులభంగా చేస్తంటారు. మిమ్మల్ని మాటలతో అవమానపరుస్తారు. మీకు ఏది సరైనది, ఏది కాదు, మీరెలాంటి వారు, ఇలా చాలా అంశాలపై మీపై వ్యతిరేకంగా జడ్జ్‌మెంట్ ఇస్తుంటారు.
టాక్సిక్ వ్యాక్తులతో వాదనలకు దిగవద్దు. మౌనంగా ఉంటేనే వారి నుంచి కొంతవరకు ఉపశమనాన్ని పొందవచ్చు. వారికి నచ్చచెప్పాలని చూసినా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి టాక్సిక్ వ్యక్తాలతో ఎంత తక్కువగా మాట్లాడితే మీకు అంత మంచిది.



Click it and Unblock the Notifications
