Latest Updates
-
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.!
ఈ రాశుల వారికి అహంభావం ఎక్కువ.. వీరితో వేగడం చాలా కష్టం
ప్రతి మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. ప్రేమ, కోపం, ఆవేశం, అహంకారం ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కోటి వ్యక్తమవుతుంది. అయితే కొందరు వ్యక్తులు మరీ ఎక్కువ అహంభావాన్ని ప్రదర్శిస్తుంటారు. తమ జీవిత భాగస్వామి ఎప్పుడూ వారి చెప్పిన మాటే వినాలని కోరుకుంటారు.
దాంపత్యబంధం కాకుండా ఇంకేదైనా సంబంధంలో అలాంటి వ్యక్తులతో వ్యవహరించడం చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడూ వారి మాటే వినాలని, వారే నెగ్గాలని కోరుకోవడం వల్ల ఎదుటివారు అసౌకర్యంగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం ఏయే రాశుల వారు సంబంధంలో అహంభావంతో ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహరాశి:
సింహ రాశి వారికి చాలా గర్వం ఉంటుంది. వారు తమను తాము చాలా తెలివైన వారని భావిస్తారు. తమను తాము అందరికంటే తెలివైన వారిగా భావించే వ్యక్తుల్లో సహజంగానే అహంభావం ఉంటుంది. కొన్నిసార్లు వారు చెప్పేది సరైనదే కావొచ్చు, కానీ వారు చెప్పే ప్రతి మాట కరెక్ట్ అవ్వాలని లేదు. కానీ ఆ విషయాన్ని వారు గుర్తించలేరు. దాంపత్యబంధంలో ఒకరు ఇలాంటి స్వభావంతో ఉంటే మరొకరు చాలా అసౌకర్యంగా ఉంటారు. అలాంటి వారితో బంధం కష్టం.
మీనరాశి:
మీనరాశి వారు అహంభావులు. మీనరాశి వారు తమపై విమర్శలు వస్తే తట్టుకోలేరు. ఎవరైనా తమ తప్పులను చూపిస్తే వారికి నచ్చదు. తిరిగి వారినే నిందిస్తారు. అయితే మీనరాశి వారి తమ తప్పుల నుండి నేర్చుకుంటారు. ఇతరుల మార్గనిర్దేశన వారికి అవసరం రాకుండా తమని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ మార్పు కొన్నిసార్లు ఆలస్యం కావొచ్చు.
మకరరాశి:
మకరరాశి వారు సహజంగానే తెలివైన వారు. అయితే ఆ తెలివితేటల వల్ల వారికి గర్వం పెరుగుతుంది. సామాన్యులను వీరు లెక్కచేయరు. అలాగే ఇతరులు చెప్పే మాటలను వినిపించుకోరు. విమర్శలు ఎలాగూ అంగీకరించలేరు. తాము వెళ్లేదే సరైన దారి అని అనుకుంటారు. ఆ దారిలో కష్టాలు ఎదురైనా దానిని వదిలిపెట్టరు. మరీ తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే వారి ఆలోచనను మార్చుకుంటారు.

వృశ్చికరాశి:
వృశ్చిక రాశి వారికి తానెప్పుడు తప్పు చేయను అనే బలమైన భావన ఉంటుంది. తప్పులు మానవ సహజం, ఎవరైనా తప్పు చేస్తారు అనే మాటలను అంగీకరించలేరు. వారు 100 శాతం కరెక్టు అనే విపరీతమైన భావన ఉంటుంది. ఇలాంటి ధోరణి వల్ల అహంభావం వస్తుంది. సంబంధంలోనూ దానిని ప్రదర్శిస్తారు.
మేషరాశి:
మేషరాశి వారు అహంభావంతో వ్యవహరిస్తారు. అయితే చాలా తక్కువ సార్లు మాత్రమే మేషరాశి వారిలో అహంభావాన్ని గుర్తిస్తాం. వీరికి తెలివి, ఆలోచన రెండూ ఎక్కువే. అయితే కొన్ని పరిస్థితుల్లో సహనం కోల్పోయి అహంకారంగా ప్రవర్తిస్తారు. దీని వల్ల ఎదుటివారు బాధపడుతున్నారని కూడా గుర్తించలేరు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications