Latest Updates
-
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి
Relationship Tips: శృంగారం చేసేటప్పుడు ఈ పనులు అస్సలే చేయొద్దు
శృంగారం అద్వితీయమైన అనుభూతి. దానిని అనుభవించాలే గానీ అక్షరాల్లో చెప్పలేం. శృంగారం ఎంత గొప్ప అనుభవమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటించకపోతే దాని వల్ల మజా అనుభవించడం కష్టం. అలాగే ఇద్దరిలో ఎవరో ఒకరు అసంతృప్తి చెందాల్సి వస్తుంది.

శృంగారం చేసే సమయంలో చేయాల్సిన పనులు ఎన్ని ఉంటాయో, చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయని తెలుసుకోవాలి. భాగస్వామితో సెక్స్ అనుభవిస్తున్న సమయంలో చేయకూడని ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముద్దు పెట్టుకోకపోవడం:
చాలా మంది వ్యక్తులు శృంగారం చేస్తున్నప్పుడు భాగస్వామిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించరు. కేవలం ఒకే పనిపై దృష్టి పెడతారు. సంభోగించేటప్పుడు రొమాన్స్ కూడా చేయాలి. రొమాన్స్ చేయడం వల్ల సెక్స్ డ్రైవ్ పెరగడంతో పాటు మరింత ఉత్సాహం వస్తుంది.
2. సిద్ధం కాకముందే కార్యం మొదలుపెట్టడం:
కొందరు వ్యక్తులు చాలా ఉద్రేకంగా వ్యవహరిస్తారు. శృంగారం మొదలు పెట్టగానే ఫోర్ ప్లేను పట్టించుకోకుండా అసలు కార్యం మొదలు పెట్టేస్తారు. సంభోగం ఒకటే శృంగారం అనుకుంటారు చాలా మంది. అందుకే సెక్స్ మొదలు పెట్టగానే రొమాన్స్ చేయాలి అంటే ఫోర్ ప్లే చేయాలి. దాని తర్వాతే సంభోగం మొదలు పెట్టాలి.
3. కొన్నింటిపైనే ఫోకస్ చేయడం:
చాలా మంది శృంగారం అంటే సంభోగం మాత్రమే అనుకుంటారు. అయితే దానికి ముందు దాంతో పాటుగా చేయాల్సినవి చాలా ఉంటాయి. జననేంద్రియాలపైనే దృష్టి కేంద్రీకరించడం మానుకోండి. భాగస్వామి యొక్క ఇతర శరీర భాగాలనూ స్పృశించండి.
4. భాగస్వామిపై పూర్తి బరువు మోపడం:
శృంగారంలో ఏం చేసినా అది ఇద్దరికీ సౌకర్యంగా ఉండాలి. సౌకర్యంగా లేని పనుల వల్ల సుఖం పొందడం కష్టం. సౌకర్యంగా లేకపోతే శృంగారంతో సంతృప్తి ఉండదు. శృంగారం చేస్తున్నప్పుడు ఒకరు కింద, మరొకరపు పైన ఉంటుంటే కింద ఉన్నవారిపై ఎక్కువ బరువు పడుతుంది. దీని వల్ల వారు అసౌకర్యానికి గురికావొచ్చు.

5. క్లైమాక్స్‌కు త్వరగా వెళ్లడం, మరీ ఆలస్యం కావడం:
సినిమా మొదలవగానే క్లైమాక్స్ వచ్చేస్తే మజా ఏముంటుంది. అలాగే సినిమా సాగదీసి సాగదీసి క్లైమాక్స్ పెట్టినా బోర్ కొట్టెస్తుంది. ఇది శృంగారానికి కూడా వర్తిస్తుంది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఇద్దరిలో ఒకరు భావప్రాప్తి పొందినా, లేదంటే చాలా ఆలస్యంగా చేయడం వల్ల శృంగారంపై బోర్‌డమ్ వచ్చేస్తుంది.
6. శృంగారం పోర్న్ వీడియోలా ఉండదు:
కొంతమంది పోర్న్ వీడియోలను విపరీతంగా చూస్తుంటారు. అందులో ఉన్నట్లుగానే నిజజీవితంలోనూ ఉంటుందని భ్రమపడతారు. కానీ నిజజీవితానికి పోర్న్ వీడియోలకు చాలా తేడా ఉంటుంది. అందులో చూపించే ప్రతి ఒక్కటి ఎగ్జాగరేట్ చేసి చూపిస్తారు.
7. ప్రైవేట్ భాగాల గురించి జోకులు:
శృంగార సమయంలో భాగస్వామి ప్రైవేట్ పార్ట్స్ గురించి జోకులు వేయడం మంచిది కాదు. దీని వల్ల వారు అసౌకర్యంగా భావిస్తారు. కొంత మంది చాలా హర్ట్ అవుతారు. సెక్స్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ పార్ట్స్ పై నెగెటివ్ కామెంట్స్ చేయడం మానుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
