Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Relationship Tips: సెక్స్, సెక్స్, సెక్స్.. ఎప్పుడూ అవే ఆలోచనలా.. ఈ సమస్య ఉందేమో జాగ్రత్త!
లైంగిక వాంఛ అనేది అందరిలోనూ ఉంటుంది. ఆడ, మగ అనే తేడా లేకుండా కనిపిస్తుంటుంది. ప్రతిరోజూ మనకు ఆకలి, దాహం ఎలా వేస్తుందో అలాగే సెక్స్ కూడా కావాలనిపిస్తుంటుంది. కానీ తరచుగా దాని మీదే ధ్యాస ఉంటే మాత్రం చాలా కష్టం.
అందరిలోనూ ఉన్నట్లు సాధారణంగా ఉంటే సమస్యేమీ లేకపోయినప్పిటకీ.. అందుకు సంబంధించిన కోరిక, ఆశ, ఆలోచన ఎక్కువగా ఉంటే మాత్రం మీరు జాగ్రత్త పడాల్సిందే. లేదంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు.

అతిగా సెక్స్ కావాలనిపించడం, తరచుగా అలాంటి ఆలోచనలే వస్తుంటే... మీరు హైపర్ సెక్సువల్ కిందకు వస్తుంటారు. అయితే హైపర్ సెక్స్ వల్ల ఆరోగ్యం ఎలా ప్రభావితం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వారి డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఐదో ఎడిషన్.. హైపర్ సెక్సువాలిటీకి సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. ఇది రుగ్మతగా నిర్ధారించకపోయినా.. అనేక సమస్యలను కల్గిస్తుందని వివరించింది. హైపర్ సెక్సువాలిటీ మానసిక ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తుందని.. మనిషిలో బాధను, కోపాన్ని, బలహీనతను పెంచుతుందని స్పష్టం చేసింది.
హైపర్ సెక్సువాలిటీ అంటే ఏమిటి?
సెక్స్ గురించి నిరంతరం ఆలోచిస్తూ.. లైంగిక వాంఛను నియంత్రించుకోలేకపోతున్నారని భావించినప్పుడు అది హైపర్ సెక్సువాలిటీ కిందకు వస్తుంది.
హైపర్ సెక్సువాలిటీ వల్ల కల్గే సమస్యలేంటి?
* హైపర్ సెక్సువాలిటీ వల్ల పని లేదా ఇతర కార్యకలాపాలపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంటుంది.
* చాలా ఒత్తిడిని కల్గిస్తుంది.
* మానసిక ఆందోళనకు దారి తీస్తుంది.
* తరచుగా నిరుత్సాహానికి గురయ్యేలా చేస్తుంది.
* ఇలాంటి వాటి వల్ల మీ భాగస్వామితో వివాదం ఏర్పడుతుంది.
* తరచుగా విసుగు చెందుతూ.. ఏ పనిపై దృష్టి పెట్టలేరు.
హైపర్ సెక్సువాలిటీ సంకేతాలు..!
* అశ్లీల వెబ్ సైట్లను ఎక్కువగా చూడడం లేదా తరచుగా హస్తప్రయోగం చేసుకోవడం వంటి చాలా సమస్యాత్మక లైంగిక ప్రవర్తనలు గమనించవచ్చు.
* అలాగే తరచుగా తీవ్రమైన లైంగిక కల్పనలు, ప్రవర్తనను కలిగి ఉండడం.
* కోరికలు తగ్గించుకునేందుకు, ప్రవర్తనను మార్చుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలం అవ్వడం.
* ఒంటరిగా లేదా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నట్లయితే మీరు వాటి నుంచి తప్పించుకునేందుకు హైపర్ సెక్సువాలిటీని ఉపయోగిస్తారు.
* స్థిరమైన సంబంధాన్ని అంటే ఒక్కరితోనే బంధాన్ని కొనసాగించలేరు. ఎక్కువ మందితో గడిపే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది.
వైద్యుడిని ఎప్పుడు కలవాలంటే..?
టెన్షన్ గా, నిరాశగా, ఒంటరిగా, సిగ్గుగా, బాధగా ఉన్నప్పుడు వైద్యుడిని కలవాల్సిన అవసరం రావొచ్చు. ఒంటరిగా లేరని.. మీ ప్రవర్తనను మార్చుకోవడానికి వేరొకరి సాయం పొందవచ్చని గుర్తించాలి.
హైపర్ సెక్సువాలిటీకి చికిత్స ఏమిటి?
మీకు విపరీతమైన కోరిక కల్గినప్పుడు.. మెల్లిగా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. కంట్రోల్ కాని సమయంలో.. భాగస్వామితో సంభోగించవచ్చు. కానీ వారికి ఎలాంటి సమస్య రాకుండా చూస్కోవడం మీ బాధ్యతే.
ముఖ్యంగా ఎలాంటి ప్రమాదకర కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. వైద్యుడిని కలిసి మీ సమస్యలన్నీ అర్థమయ్యేలా చెప్పాలి. తీవ్ర టెన్షన్, నిరాశ ఉన్నట్లు అనిపిస్తే.. వైద్యులే కొన్ని మందులు సూచిస్తారు. వాటిని వేసుకుంటే సరిపోతుంది.



Click it and Unblock the Notifications
