Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
లవర్ తో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి..కోర్టు సంచలన తీర్పు
ప్రపంచంలో ఎన్నో ప్రేమకథలు మొదలవుతాయి..కానీ కొన్ని కథలు మాత్రమే ఊహించని మలుపులతో విషాదాంతంగా ముగుస్తాయి. చైనాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటన అలాంటిదే. దశాబ్దాల క్రితం ముగిసిపోయిందనుకున్న ఓ పాత పరిచయం తిరిగి చిగురించి, రహస్య ప్రేమాయణంగా మారి, చివరికి ఒకరి ప్రాణాన్ని బలిగొని, మరొకరిని కోర్టు మెట్లెక్కించింది.
చైనా దేశంలో 1980లలో ఒకే ఫ్యాక్టరీలో పనిచేసిన ఇద్దరు మంచి స్నేహితులుగా మారాయి. అయితే కాలక్రమేణా వారి దారులు వేరయ్యాయి,జీవితాలు మారిపోయాయి. కానీ విధి వారిద్దరినీ మళ్లీ కలపాలని నిర్ణయించింది. 2023లో జరిగిన ఒక పార్టీలో వారిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.

ఈ పరిచయం స్నేహంగా మారి, కొద్దికాలంలోనే వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ తమ కుటుంబాలకు తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం ప్రారంభించారు. అయితే ఈ ఏడాది జూలై 24న వాళ్లిద్దరూ ఒక హోటల్ లో కలవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అతని స్నేహితురాలు రూమ్ బుక్ చేసి వేచి ఉండగా, ఆయన అక్కడికి చేరుకున్నాడు.
ఆ రాత్రి వారిద్దరూ కలిసే గడిపారు. కానీ ఉదయం ఆమె కళ్లు తెరిచేసరికి తన పక్కన పడుకున్న వ్యక్తి నిర్జీవంగా, చలనం లేకుండా ఉన్నాడు. ఆమెకు కొద్దిసేపు మైండ్ బ్లాక్ అయ్యింది. భయంతో ఏం చేయాలో తెలియక, వెంటనే గది నుండి బయటకు పరుగుపెట్టింది.
కొంత సమయం తర్వాత ధైర్యం తెచ్చుకుని తిరిగి గదికి రాగా, తలుపు లోపలి నుండి లాక్ అయి ఉంది. కంగారుపడిన ఆమె వెంటనే హోటల్ సిబ్బంది సహాయం కోరింది. వారు తలుపు తెరిచి చూడగా అతను అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆమె అతన్ని లేపడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఎమర్జెన్సీ సర్వీస్ కి ఫోన్ చేశారు. వారు వచ్చి పరీక్షించి, అతను అప్పటికే మరణించాడని నిర్ధారించారు.
కోర్టుకెక్కిన రహస్య బంధం
ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి కుటుంబం కన్నీరుమున్నీరయింది. తమ కుటుంబ పెద్ద మరణవార్తతో పాటు అతని రహస్య సంబంధం గురించి తెలిసి వారు మరింత కుంగిపోయారు. తమ తండ్రి మరణానికి ఆమె నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు ఆమెపై కోర్టులో దావా వేశారు.
విచారణ జరిపిన కోర్టు, మొదట ప్రియురాలు సుమారు రూ. 67 లక్షల భారీ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కేసును రివ్యూ చేసిన న్యాయస్థానం అతని మరణానికి ప్రధాన కారణం అతని అనారోగ్య సమస్యలేనని, దానికి అతనే బాధ్యుడని తేల్చింది.
కానీ ఆమె భయంతో వెంటనే సహాయం కోరకుండా ఆలస్యం చేసిందని, ఒకవేళ ఆమె సరైన సమయంలో స్పందించి ఉంటే అతన్ని కాపాడే అవకాశం ఉండేదని అభిప్రాయపడింది. ఆమె అనైతిక ప్రవర్తన, నిర్లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారాన్ని రూ. 7.5 లక్షలకు తగ్గించి, దానిని మృతుడి కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది.
ఈ సంఘటన రహస్య సంబంధాలు ఎంత ప్రమాదకరమో, అవి ఎలాంటి ఊహించని, విషాదకరమైన పరిణామాలకు దారితీస్తాయో చెప్పడానికి ఒక చేదు నిజంగా మిగిలిపోయింది.



Click it and Unblock the Notifications