Latest Updates
-
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.!
Relationship Tips: శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారా? ఇవే కారణాలు కావొచ్చు
లైంగిక జీవితంలో సంతోషంగా ఉండకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. భావోద్వేగ సమస్యల నుండి శారీరక కారణాల వరకు. మనం కోరుకున్న విధంగా శృంగారం సాగకపోయినా, తృప్తిగా, సుఖంగా లేకపోయినా దానిని ఆస్వాదించలేము.
దంపతులు, లవర్స్ మధ్య శృంగారం జరిగినా దానిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. సమస్య ఏమిటో, ఎక్కడ ఉందో తెలుసుకుంటే దానిని పరిష్కరించడం సులభం అవుతుందని అంటారు వైద్య నిపుణులు. శృంగారాన్ని ఆస్వాదించలేకపోవడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్వీయ ఆవిష్కరణ:
మూడ్ లోకి రావడానికి కొందరికి కొన్ని రకాల ప్రయత్నాలు అవసరం. కొందరు తాకితే మూడ్‌లోకి వస్తారు, మరికొందరు కౌగిలించుకుంటే, ముద్దు పెట్టుకుంటే, చెవుల వెనక తాకితే, మెడపై ముద్దు పెట్టుకుంటే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. మీ భాగస్వామిలో శృంగార కోరికలు రగిల్చడానికి ఏం చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. అందుకే శృంగారం చేసే సమయంలో భిన్నమైన టచ్‌లు, పొజిషన్‌లు, ఫాంటసీలు, భంగిమలు ప్రయత్నించాలి.
2. ఇతర రంగాల్లో అసంతృప్తి:
జీవితంలోని ఇతర రంగాల్లో అసంతృప్తిగా ఉన్నా, ఒత్తిడి ఎదుర్కొంటున్నా లైంగిక జీవితాన్ని ఆనందంగా గడపడం కష్టం కావొచ్చు. పనిలో ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో పోరాడటం, వ్యక్తుల మధ్య వివాదాలతో వ్యవహరించడం వంటి అంశాలు లైంగిక అసంతృప్తికి దోహదం చేస్తాయి.
3. ప్రైవసీ లేకపోవడం:
కుటుంబసభ్యులు, చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ప్రైవసీ దొరకడం కష్టం. భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి ఇబ్బంది పడవచ్చు. సాన్నిహిత్యం లేకపోతే దాని ప్రభావం శృంగారంపై పడుతుంది. అందుకే వీలైనంత సన్నిహితంగా, రొమాంటిక్ గా ఉండటానికి ప్రయత్నించాలి. కొంత సమయం దొరికినా భాగస్వామితో గడపడానికి ట్రై చేయాలి. ఒంటరిగా గడిపే అవకాశం వస్తే ఎట్టిపరిస్థితుల్లో వదులుకోకూడదు.
4. శారీరక మార్పులు, కోరికలు:
బరువులో మార్పులు, హార్మోన్ల హెచ్చుతగ్గులు, ఆరోగ్య సమస్యలు, ఇతర శారీరక సమస్యలు లైంగిక జీవితంపై ప్రభావం చూపిస్తాయి. దీని వల్ల శృంగార సమయంలో అసౌకర్యంగా అనిపించవచ్చు. దీని వల్ల శృంగారంలో అసంతృప్తిగా ఉంటుంది. ఒక వ్యక్తితో మానసికంగా, భావోద్వేగంగా లోతైన సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తులకు భౌతిక రూపం పెద్ద సమస్యగా కనిపించదు.
5. గతంలో ప్రతికూల అనుభవాలు:
గత అనుభవాలు కూడా లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. బలవంతపు సెక్స్, గాయాలు, భయాలు, ఇతర అనుభవాల వల్ల సెక్స్ పై చెడు అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు. దీని వల్ల కూడా శృంగారాన్ని అనుభవించడం కష్టంగా ఉంటుంది.
లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే చిట్కాలు:
సంతృప్తికరమైన లైంగిక జీవితం అందరికీ సాధ్యమే. అయితే దాని కోసం కొంత ప్రయత్నం అవసరం. కారణం ఏమిటి, సమస్య ఎక్కడ ఉందో సరిగ్గా గుర్తిస్తే దానిని పరిష్కరించడం సులువవుతుంది. దంపతుల్లో ఒకరు శృంగార సమస్యలు ఎదుర్కొంటుంటే మరొకరు వారికి సాయపడాలి. ఎదుటివారు వారి సమస్య నుండి బయటపడేందుకు వీలు కల్పించాలి, సహాయం చేయాలి. అలా దంపతులు ఇద్దరు శృంగారాన్ని ఆస్వాదించగలుగుతారని రిలేషన్ షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.



Click it and Unblock the Notifications