Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
పెళ్ళికి ముందే వధూవరుల ప్రైవేట్ పార్టులకు పూజలు.. ఆ గ్రామంలో వింత ఆచారం!.. ఆ గ్రామం ఎక్కడుందంటే!
మన భారత దేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు ఉన్నాయి. ప్రతి మతం వారు తమ తమ సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకునేటప్పటి నుంచి పిల్లలకు పేర్లు పెట్టె వరకు తమ ఆచారాలను అనుసరిస్తూ పెడుతూ ఉంటారు. అయితే మన దేశంలోనే కొన్ని వింత సంప్రదాయాలు ఉన్నాయి. అవి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. అలాంటి ఒక ఆచారం గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఆ ఆచారం ఏంటి, ఏ విధంగా పెళ్లి చేసుకుంటారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ ఆచారం ఏంటంటే..
రాజస్థాన్‌లోని పాలి నగరం నుంచి 25 కిలో మీటర్ల దూరంలో బుసి నగర్ అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో మౌజిరామ్ జీ , మౌజనీ దేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆలయంలో దేవత మౌజ్, మౌజిరామ్ జీని శివుడు, పార్వతి రూపంలో కొలువై ఉంటారు. వీరికి ఆ గ్రామస్థులు ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి పెళ్లి ముందుకు ఈ ఆలయంలో పూజలు చేయడం సంప్రదాయం.

ఆ గ్రామంలో ఎవరికైనా పెళ్లిళ్లు జరిగేటప్పుడు ముందుగా ఆ ఆలయంలోని శివ పార్వతులను పూజిస్తారు. వారికి వివిధ రంగులు, హెన్నా, పెర్ఫ్యూమ్‌లతో అలంకరించి పూజలు చేస్తారు. అనంతరం అన్ని ఆచార వ్యవహారాలతో వివాహం జరుగుతుంది. అనంతరం వధూవరులిద్దరూ ఏడు అడుగులు నడుస్తారు.
వధూ వరుల ప్రైవేట్ భాగాలను పూజించడం..
వివాహానికి ముందు వధూవరులతో ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని నిర్వహిస్తారని పలు మీడియా నివేదికల్లో వెల్లడైంది. ఈ ఆలయంలో వివాహానికి ముందు వధూ వరుల ప్రైవేట్ భాగాలను పూజిస్తారట. అలాగే వారి వివాహంలో పాల్గొన్న వ్యక్తులకు ఈ సమాచారాన్ని అందిస్తారట. ఇలా చేయడం వల్ల.. వధూ వరుల వైవాహిక జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుందని నమ్ముతారు. అలాగే వారి ఇంట్లో సిరి సంపదలు, శాంతి, శ్రేయస్సు నెలకొంటుందని చెప్పుకుంటూ ఉంటారు.
వరుడిని ఊరేగించడం..
ఈ గ్రామంలో పెళ్ళికి సంబంధించి మరో వింత ఆచారం ఉంది. పెళ్లి జరుగుతున్న సమయంలో ఇక్కడ వరుడిని బయటికి ఊరేగిస్తారు. సాధారణంగా మన దగ్గర బారాత్ నిర్వహించేటప్పుడు డీజే పాటలకు డాన్స్ వేయడం, పాటలు పాడడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ గ్రామంలో మాత్రం పాటలు పాడడం, డ్యాన్స్ వేయడం చేయరు. దానికి బదులుగా ఒకరిని ఒకరు తిట్టుకుంటారు. అలా తిట్టుకుంటూ ప్రత్యేకమైన నృత్యం చేస్తారు.
ఈ వేడుకలన్నీ పూర్తయిన తరువాతే పెళ్లి తంతు పూర్తవుతుంది. అనంతరం వధూవరులను శోభనం నిర్వహిస్తారు. ఈ శోభనం రాత్రి పూర్తయిన తరువాత వధూ వరులిద్దరూ సంవత్సరం పాటు వేరు వేరుగా ఉండాల్సిన ఉంది. ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని ఎవరైనా సంతాలేమితో బాధ పడుతున్న వారు దర్శించుకుంటే వారికి కచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు మీడియా నివేదికలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు.



Click it and Unblock the Notifications