Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
గర్ల్ ఫ్రెండ్ తిరిగి వెనక్కి రావాలనివుందా..? అయితే ఈ ట్రిక్స్ ఫాలో అవండి..!
గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిన తరువాత చాలా మంది తీవ్ర బాధలో మునిగిపోతూ వుంటారు. తమ గర్ల్‌ఫ్రెండ్‌ను తిరిగి ఎలా వెనక్కి రప్పించుకోవాలా అని తీవ్రంగా మదనపడిపోతుంటారు. సాధారణంగా ప్రేమికుల మధ్య చిన్ని చిన్న గొడవలు సహజమే. దీనికి ముఖ్య కారణం, తాము ఆలోచించినట్లే తమ పార్ట్‌నర్ కూడా ఆలోచించాలని కోరుకోవడం. ఇది అన్ని సమయాల్లో సాధ్యం కాకపోవచ్చు. చిన్ని చిన్న గొడవలు అలకలు సాధారణం. అయితే ఇలాంటి గొడవలను వెంటనే పరిశ్కరించుకోవాలి, వాటిని పరిష్కరించుకోకపోవడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. అలా పెరిగి చివరికి బ్రేకప్‌గా మరిపోతుంది.

అబ్బాయిలు చిన్న చిన్న గొడవలకు పోకుండా వెంటనే పరిష్కరించుకోవడం అన్నింటికంటే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. బ్రేకప్ అనేది, అటు అమ్మాయికీ, ఇటు అబ్బాయికీ చాలా బాధాకరమైన విషయం. అప్పటి వరకు సంతోషంగా వున్నా పరిస్థితి మొత్తం మారిపోతుంది. చాలా ఒంటరిగా వుంటారు. భావోద్వేగాలు పట్టుతప్పిపోతాయ్. సరిగ్గా ఇదే ఇద్దరి మధ్య దూరం మరింత పెంచుతుంది. బ్రేకప్ అయిన అమ్మాయి మళ్లీ మీ జీవితంలో మిమ్మల్ని కలవాలంటే ఈ టెక్నిక్‌ను పాటిస్తే కచ్ఛితంగా అనుకున్నది జరుగుతుంది.
బ్రేకప్ అయిన వెంటనే ఏదైనా హాబీలోకి త్వరగా వెళ్లిపోవాలి. జిమ్ కు వెళ్లడం, పాటలు పాడటం, పెయింటింగ్ వేయడం, రన్నింగ్ చేయడం ఇలా ఏదైనా హాబీలోకి వెంటనే వెళ్లిపోవాలి. ఇలా చేయడం వల్ల మీ మెదడు మీ కంట్రోల్‌లో వుంటుంది. భావోద్వేగాలు కూడా అదుపులో వుంటాయ్. మీ గర్లఫ్రెండ్‌కి వున్న స్నేహితులతో కాంటాక్ట్‌లో వుండాలి. మీకు వున్న మంచి అలవాట్లను వారికి తెలియజేస్తూ వుండాలి. ఆ సమయంలో మీ గర్ల్ ఫ్రెండ్ టాపిక్ తీసినప్పుడు సున్నితంగా వారిని మీరు తిరస్కరించాలి. ఇలా చేయడం వల్ల మీ గురించి మరిన్ని మంచి విషయాలను చెప్పే అవకాశం వుంటుంది. అమ్మాయిలు నేరుగా కంటే పక్కవారు చెప్పిన విషయాలను ఎక్కువగా పట్టించుకుంటారు.

30 రోజుల తరువాత మీరే కాల్ లేదా మెసేజ్ చేయండి. ఈ మెసేజ్‌లో ఏం చేస్తున్నావ్ ఎలా వున్నావని కాకుండా మీకు సంబంధించిన ఏదైనా వస్తువు వాళ్ల దగ్గర వుందా లాంటి మాటలతో మాట్లాడ్డం మొదలుపెట్టాలి. అంతకు మించి ఒక్క మాట కూడా వారితో మీరు మాట్లాడవద్దు. ఇలా మెసేజ్‌లో తిరిగి మీకు గర్ల్‌ఫ్రెండ్‌గా వుంటానంటే పరవాలేదు కానీ ఇలా కాకుండా ఏ విషయాన్ని ఆ అమ్మాయి మీతో మాట్లాడినా అవాయిడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తనకు ప్రాముఖ్యత తగ్గిందని అమ్మాయి అనుకుంటుంది. తనపై ఇష్టాన్ని తగ్గడం ఏ అమ్మాయి కూడా జీర్ణించుకోలేదు. మీతో మాట్లాడే అవకాశం తనకు తరచూ వస్తుంది.
ఆ అమ్మాయి ఎక్కడైనా మీకు కనబడితే పాత విషయాల గురించి అస్సలు మాట్లాడవద్దు. మీ ఫ్రెండ్ లేదా రిలేషన్స్‌లో మీరు ఎవరైనా అమ్మాయిలతో కలిసి ఫోటోలు దిగితే ఆమె చూసేలా చేయండి. ఇలా చేయడం వల్ల తను మీనుంచి చేజారిపోతుందని తనకు అనిపిస్తుంది. అదే సమయంలో తను మీ దగ్గరికి వచ్చి మీరంటే ఎంత ఇష్టమో చెబుతుంది. మిమ్మల్ని ఇన్ని రోజులు ఎలా మిస్ అయిందో మీకు వివరిస్తుంది. ఇలా మీరు కోల్పోయిన గర్ల్ ఫ్రెండ్‌ను తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు.



Click it and Unblock the Notifications
