Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
టైమ్ లేదు, బడ్జెట్ లేదా? అయితే కొత్త జంటలకు మినీమూనే బెస్ట్ ఆప్షన్..కపుల్స్ లేటెస్ట్ ఛాయిస్ ఇదే!
ఈ రోజుల్లో పెళ్లి కాగానే హనీమూన్ కి విదేశాలకు వెళ్లే పాత ట్రెండ్ కాస్త పక్కకు తప్పుకుంది. ఆ స్థానంలోకి సరికొత్తగా మినీమూన్ వచ్చి చేరింది. అసలు ఈ మినీమూన్ అంటే ఏమిటి? కొత్త జంటలు దీనికి ఎందుకు అంతగా ఫిదా అవుతున్నారు? ఈ ట్రెండ్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.
మినీమూన్ అంటే ఏమిటి?
సింపుల్‌గా చెప్పాలంటే మినీమూన్ అంటే ఒక చిన్నపాటి హనీమూన్. పెళ్లి అనగానే నెలల తరబడి షాపింగ్, బంధువుల కోలాహలం, ఆచార వ్యవహారాలతో జంటలు శారీరకంగా, మానసికంగా ఎంతో అలసిపోతారు. ఆ వివాహపు ఒత్తిడి నుంచి బయటపడి, ప్రశాంతంగా గడిపేందుకు కొత్త జంటలు ఎంచుకునే 3 లేదా 4 రోజుల రొమాంటిక్ ట్రిప్ ఇది.

రోజుల తరబడి సుదూర ప్రయాణాలు చేయకుండా తమకు దగ్గరలో ఉన్న అందమైన ప్రదేశానికి వెళ్లి ఏకాంతంగా నాణ్యమైన సమయం గడుపుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తక్కువ సమయం, తక్కువ ప్లానింగ్, తక్కువ ఖర్చుతో ఎక్కువ రొమాన్స్ ను ఆస్వాదించడమే మినీమూన్ అసలు ఆకర్షణ.
ఈ ట్రెండ్ ఎందుకు పాపులర్ అవుతోంది?
పెళ్లి జరిగిన వెంటనే ఆ హడావిడిలో సుదీర్ఘమైన యాత్రలకు వెళ్లడం, దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా ఉద్యోగాలు చేసేవారికి వెంటనే ఎక్కువ రోజుల పాటు సెలవులు దొరకకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు లేని ఈ 3-4 రోజుల చిన్నపాటి యాత్ర ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. అందుకే యువత ఈ ట్రెండ్ వైపు మొగ్గుచూపుతున్నారు.
బడ్జెట్ కు అనుకూలం..టెన్షన్ ఫ్రీ
మినీమూన్ ను ప్లాన్ చేసుకోవడం చాలా తేలిక. దీనికి నెలల తరబడి ఏర్పాట్లు అవసరం లేదు. భారీగా లగేజ్ సర్దుకోవాల్సిన పని లేదు. అన్నింటికీ మించి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఈ చిన్న ట్రిప్ ద్వారా జంటలు తమ కలల గ్రాండ్ హనీమూన్ కోసం డబ్బును, సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. ముందుగా మినీమూన్ తో విశ్రాంతి తీసుకుని, భవిష్యత్తులో తీరిక దొరికినప్పుడు విదేశాలకు ప్లాన్ చేసుకుంటున్నారు.

మినీమూన్ కోసం ఎక్కడికి వెళ్తున్నారు?
కొత్త జంటలు మినీమూన్ ను ఆస్వాదించడానికి మన దేశంలోనే ఎన్నో అద్భుతమైన డెస్టినేషన్స్ ఉన్నాయి. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే జంటలు సిమ్లా, మనాలి, లోనావాలా, ఊటీ, కొడైకెనాల్,ఖండాలా లాంటి హిల్ స్టేషన్లను ఎంచుకుంటున్నారు. అక్కడి లగ్జరీ రిసార్ట్స్, ప్రైవేట్ స్పా, పూల్స్, క్యాండిల్ లైట్ డిన్నర్స్ తో తమ ట్రిప్ ను మధురంగా మార్చుకుంటున్నారు.
బీచ్‌లు, సన్ సెట్ వ్యూస్ ఇష్టపడేవారు గోవా వైపు అడుగులేస్తున్నారు. పర్వతాల అందాల కోసం ఉత్తరాఖండ్ కి పయనం అవుతున్నారు. అలాగే రాయల్ లుక్ ఇష్టపడే జంటలకు రాజస్థాన్ ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారింది. జైపూర్, ఉదయ్‌పూర్ లాంటి హెరిటేజ్ నగరాల్లోని ప్యాలెస్ హోటళ్లలో బస చేస్తూ, ఆ అందమైన కట్టడాల ముందు ఇన్ స్టాగ్రామ్ కోసం రొమాంటిక్ ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
మినీమూన్ కు, హనీమూన్ కు తేడా ఏంటి?
కొత్త జంటలకు ఈ రెండూ ప్రత్యేకమైనవే. అయితే మినీమూన్ అనేది ఎలాంటి హడావిడి లేకుండా దగ్గర్లోని ప్రదేశాల్లో 3-4 రోజుల్లో ముగిసే ప్రశాంతమైన యాత్ర. దీనికి పెద్దగా బడ్జెట్ అవసరం లేదు. అదే హనీమూన్ అంటే ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో, భారీ బడ్జెట్ తో ముందుగానే ప్లాన్ చేసుకుని చేసే సుదీర్ఘ ప్రయాణం. ఇది ఎక్కువగా విదేశాల్లో రెండు మూడు వారాల పాటు సాగుతుంది.



Click it and Unblock the Notifications
