For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్త, కోడళ్ల మధ్య గొడవలు ఎందుకు జరుగుతాయి?

ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య అప్పుడప్పుడు అలకలు, వాగ్వాదాలు, తీవ్రమైన చర్చలు, మాటా మాటా అనుకోవడం జరుగుతూనే ఉంటుంది. అత్తా కోడళ్ల మధ్య గొడవలు జరగడానికి చాలా కారణాలే ఉంటాయి. కారణం ఏదైనా అత్తా కోడళ్ల గొడవలు ఏ ఇంట్లో అయినా సా

|

పెళ్లి బంధం ఎంతో విశేషమైనది. ఒక కొత్త వ్యక్తిని ఒక కుటుంబం తమతో కలిపేసుకోవడం చాలా అద్భుతమైనది. వివాహం బంధం భావోద్వేగాల కలబోత. అయితే ఎంతో అందమైన ఈ బంధం అనుకున్నంత సాఫీగా ఏమీ సాగదు.

aunt and in-law fight

ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య అప్పుడప్పుడు అలకలు, వాగ్వాదాలు, తీవ్రమైన చర్చలు, మాటా మాటా అనుకోవడం జరుగుతూనే ఉంటుంది. అత్తా కోడళ్ల మధ్య గొడవలు జరగడానికి చాలా కారణాలే ఉంటాయి. కారణం ఏదైనా అత్తా కోడళ్ల గొడవలు ఏ ఇంట్లో అయినా సాధారణంగా జరిగేవే.

అసలు అత్తాకోడళ్ల మధ్య గొడవు ఎందుకు జరుగుతాయి, దీని వల్ల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు వాతావరణం

చెడు వాతావరణం

అత్తవారింట్లో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలో చెప్పడానికి రూల్ అంటూ ఏదీ ఉండదు. అత్తమామలు, కోడలి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, ఎలా మాట్లాడుకుంటారు, ఎంతగా అర్థం చేసుకుంటారు అనే అంశాలపై ఒకరితో ఒకరు మెలిగే తీరు ఆధారపడి ఉంటుంది.

అత్తమామలు, కోడలి మధ్య పరస్పర అవగాహన ఉన్నప్పుడు వారి మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరగడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎదుటి వారిని ఎంతగా అర్థం చేసుకున్నప్పటికీ అభిప్రాయ భేదాలు తప్పనిసరిగా వస్తాయని వెల్లడిస్తున్నారు. పెరిగిన వాతావరణం, ఆచార సంప్రదాయాలు అభిప్రాయాలు ఏర్పరచుకునేందుకు ఆధారం అవుతాయి.

కుటుంబంలో పెద్ద వ్యక్తిగా అత్తగారు కుటుంబ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తారు. దాని వల్ల కుటుంబంలోనూ, సమాజంలోనూ ఆమెకు మరింత హోదా వస్తుంది. అలాగే నిర్ణయాధికారం కూడా ఉంటుంది. ముఖ్యంగా కోడలి విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఎక్కువగా అత్తగారి చేతుల్లోనే ఉంటుంది. అప్పటి వరకు తన తల్లిదండ్రుల రక్షణలో తనకు నచ్చినట్లుగా ఉన్న అమ్మాయి, కోడలిగా మరో ఇంట్లోకి వచ్చిన తర్వాత అత్త పెద్దరికంలో తను అంత త్వరగా ఇమడలేదు. ఇష్టాయిష్టాలు సరిపోవు మనసులో ఉన్న కొన్ని ఫీలింగ్స్ ఒక్కసారిగా బయటకు వచ్చి గొడవలు జరుగుతుంటాయి.

పండగల సమయంలో..

పండగల సమయంలో..

సెలవులు, పండుగలు, వేడుకలు ఇలా అత్తగారి మధ్య సంబంధమే కాకుండా అత్తగారితో బంధం కూడా కాలక్రమేణా గొడవలకు దారి తీస్తుంది. పండగను తల్లిగారింట్లో జరుపుకోవాలని కోడలు అనుకుంటే, వద్దు ఇక్కడే జరుపుకుందామని అత్త అనడంతో గొడవ మొదలవుతుంది. ఒకరు అందరం కలిసి పండగ జరుపుకుందామని అంటే.. మరొకరు పండగనైనా తల్లిదండ్రులతో జరుపుకోవాలని అనుకుంటారు.

పిల్లల పెంపకం విషయంలో..

పిల్లల పెంపకం విషయంలో..

అత్తాకోడళ్లు సఖ్యతగా ఉండకపోవడానికి మరొక కారణం పిల్లల పెంపకం. చాలా ఇళ్లల్లో కోడలికి మొదటి సంతానం అయిన తర్వాత గొడవలు ప్రారంభం అవుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.

అత్త మనవడిని లేదా మనవరాలిని ఒకరకంగా పెంచాలనుకుంటే, కోడలికి ఆ పద్ధతి నచ్చకపోవచ్చు. అదే సమయంలో కోడలు పెంచే విధానం అత్తకు నచ్చకపోవచ్చు.

ఇలాంటి సమయంలో తరాల మధ్య అంతరాన్ని ఇద్దరూ అర్థం చేసుకోగలిగితే ఈ సమస్యా ఉండదు.

అత్తలతోనే గొడవలంతా!?

పురుషులు, మహిళలు ఇద్దరూ తమ తల్లులతో కంటే వారి అత్తలతోనే ఎక్కువ గొడవలు పడుతుంటారని పలు అధ్యయనాల్లో తేలింది.

అలాగే తల్లులకు తమ కూతుళ్లతో కంటే కోడళ్లతో ఎక్కువ గొడవలు ఉంటాయని అధ్యయనాలు తేల్చాయి.

English summary

Why do fights happen between aunt and daughter-in-law?

read on to know Why do fights happen between aunt and daughter-in-law?
Story first published:Monday, December 5, 2022, 20:00 [IST]
Desktop Bottom Promotion