Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
భర్త ఉన్నా కూడా..కొందరు మహిళలు ఎఫైర్ పెట్టుకోడానికి కారణం ఇదే!
ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు భారీగా పెరిగిపోయాయి. భార్యకు తెలియకుండా భర్త..మొగుడికి తెలియకుండా పెళ్లాం ఎఫైర్లను కొనసాగిస్తున్నారు. మొగుడు,పెళ్లాం ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉండటం కామన్ అయిపోయింది. ఇక, ఈ భయంతోనే చాలామంది యువకులు పెళ్లికి కూడా దూరంగా ఉంటున్నారు. మరోవైపు వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. తన ఎఫైర్ గురించి తెలిసిందని భార్యే భర్తను చంపడం, తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భర్తే భార్యను చంపడం..భార్యా భర్తను చంపిచడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో చూస్తున్నాం. అయితే అసలు కొంతమంది మహిళలు..భర్త బతికి ఉన్నప్పటికి కూడా మరో మగాడితో ఎఫైర్ ఎందుకు పెట్టుకుంటారో ఇక్కడ చూడండి.
సాన్నిహిత్యం లేకపోవడం
అనేక జంటల మధ్య సాన్నిహిత్యం ముగిసినప్పుడు వివాహం కూడా ఒక భారంగా అనిపించడం ప్రారంభిస్తుంది. పెళ్లైన వెంటనే వేరే పని ఇక ఏదీ పెట్టుకోకుండా పిల్లలు పుట్టాలి అనే ఆలోచనలతో ఉంటారు దంపతులు. తీరా పిల్లలు పుట్టిన తర్వాత జంటలు తరచుగా ఒకరికొకరు శారీరకంగా దూరం అవుతారు. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు గడిచినా శారీరక సంబంధం వివాహ బంధాన్ని బలపరుస్తుంది. స్త్రీ, పురుషులిద్దరికీ లైంగిక అవసరాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో భర్త తమ దగ్గరికి రావడం మానేసినప్పుడు లేదా తన శారీరక అవసరాలను పట్టించుకోనప్పుడు చాలామంది మహిళలు తమ సంబంధం పట్ల అసంతృప్తి చెందడం ప్రారంభిస్తారు. ఈ పరిస్థితుల్లో కొందరు మహిళలు తమకు సుఖాన్ని అందిస్తూ శారీరక కోరికలు తీర్చుకోడానికి తప్పుడు చర్యలకు పూనుకుంటారు. తన భర్తను మోసం చేస్తున్నానను,ఇది తప్పు అని అస్సలు బాధపడరు..ఎందుకంటే వారికి ఆ సమయంలో వారిని శారీరకంగా సుఖపెట్టడమే కావాలని అని అనిపిస్తుంటది అని కొందరు రిలేషన్ షిప్ నిపుణులు తెలిపారు.

భావోద్వేగాలు
పెళ్లి అనేది ఒక్క రోజుల్లో ముగిసిపోయే తంతు కాదు..దాన్ని జీవితాంతం కొనసాగించడానికి ప్రతిరోజూ కొత్తగా ప్రయత్నించాలి. పెళ్లి జరిగిన కొత్తలో జంటలు కొన్ని ఉత్తేజకరమైన పనులు చేస్తారు, కానీ కాలం గడిచే కొద్దీ రకరకాల కారణాల వల్ల ఆ సంబంధం బోరింగ్ గా మారడం ప్రారంభమవుతుంది. వారి మధ్య చాలా తక్కువ సంభాషణ ఉంటుంది. భర్త తన సమయమంతా ఆఫీసులోనే గడుపుతాడు,సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ లేదా టీవీ చూడటంలో బిజీగా ఉంటాడు. మరోవైపు భార్య తన ఇంటి పనిలో, బయటి పనులలో బిజీగా ఉంటుంది. కలిసి ఒక ఇంట్లో ఉండటం అనేది ఒక డ్యూటీగా మారిపోతుంది. ఒక విధిగా మారుతుంది. ఈ పరిస్థితిలో వారి మధ్య భావోద్వేగ దూరం ప్రారంభమవుతుంది. భర్త నుంచి ఎమోషనల్ సపోర్ట్ లభించనప్పుడు కొంతమంది మహిళలు ఇంటి బయట భావోద్వేగ మద్దతు కోసం వెతకడం ప్రారంభిస్తారు. అప్పుడు ఎవరైనా తగిలితే వారితో ఎఫైర్ పెట్టుకుంటారు.
ప్రశంసల కోసం
ఒక స్త్రీ తన సంబంధం పట్ల అసంతృప్తిగా ఉన్నప్పుడు ఆమె ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. ప్రతి వ్యక్తి ప్రశంసలను వినడానికి ఇష్టపడతారు. వైవాహిక సంబంధలో ఉత్సాహం లేనప్పుడు, భర్త కూడా ఆమెను ప్రశంసించనప్పుడు ఆమె బయట తన గుర్తింపు కోసం వెతకడం ప్రారంభిస్తుంది. బయటి నుండి ఎవరైనా ఆమెను ప్రశంసించడం ప్రారంభిస్తే ఆమె మళ్ళీ సజీవంగా ఉన్నట్లు భావించడం ప్రారంభిస్తుంది. ఆమె అతనితో కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో కొంతమంది మహిళలు తమ భర్తల నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి అదనపు వివాహేతర సంబంధాలను కూడా పెట్టుకుంటారని రిలేషన్ షిప్ నిపుణులు చెబుతుంటారు.



Click it and Unblock the Notifications