Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
తొక్కలో జాతకాలు ఎంత ముఖ్యమో పెళ్లికి ముందు ఇలాంటి పరీక్షలు అంతే ముఖ్యం
జాతకం సరిపోతే, అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడితే ఈ కాలంలో వివాహం చేస్తున్నారని అందరికీ తెలుసు. కొన్ని చోట్ల, కొన్ని సందర్బాల్లో వధూవరుల అభిప్రాయాలు కూడా అడగకుండా కుటుంబ సభ్యులు వారి పెళ్లి నిర్ణయించి వివాహం చేసిన ఉదాహరణలు మనం చాలానే చూస్తున్నాము. అయితే పెళ్లి అంటే ఈ కారణాలే కాదు. పెళ్లికి ముందు పెళ్లి చేసుకునే జంటలకు న్యాయం జరగాలంటే ఇంకొక్క మంచిపని చెయ్యాలని కొందరు మేధావులు అంటున్నారు.
మీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, మీరు ఆరోగ్య పరంగా కూడా పెళ్లి చేసుకోవడానికి సరిపోతారా, లేదా ? అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి ప్రశ్న సహజంగానే అందరి మదిలో మెదులుతుంది. పెళ్లి సమయంలో మనసులు ఏకమైతే చాలదా? ఆరోగ్యం కూడా చూసుకోవాలా, మెడికల్ టెస్టులు చేసుకోవాలా ? అనే ప్రశ్న తలెత్తవచ్చు. వివాహం తర్వాత భార్యభర్త లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటారు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడాలేదు.

లైంగిక చర్యలో పాల్గొనే ముందు ఈ విషయంలో మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు? మీ భాగస్వామికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని సుఖపెట్టడానికి అవకాశం ఉంటుందా?, మీకు లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయా..? ఈ విషయాలన్నీ తెలుసుకోవడం పెళ్లి చేసుకునే అమ్మాయికి కాని, అబ్బాయికి కాని చాలా ముఖ్యం. మీరు లైంగికంగా మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారా? అని తెలుసుకోవడమే కాదు. అన్ని ఇతర వైద్య పరీక్షలను ముందుగానే చేయించుకోవడం వలన భవిష్యత్తు పరంగా కూడా ఇద్దరికి చాలా మంచిది.
అంతే కాదు వధూవరులు పెళ్లికి ముందే తమ ఆరోగ్య సమస్యల గురించి కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. అలాగే మీ కుటుంబం ఏదైనా వంశపారంపర్య ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, పెళ్లికి ముందే మీ భాగస్వామితో ఆ విషయం గురించి చర్చించి తగిన నిర్ణయానికి రావడం నిజంగా ఇద్దరికి మంచిది. వివాహానికి ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కేవలం మీ జీవిత భాగస్వామి మాత్రమే కాదు. ఇది మీకు చాలా ప్రయోజనాలను కూడా తెస్తుందని గుర్తించాలి.
ఇది భవిష్యత్తులో ఎదురైయ్యే సమస్యలను ముందుగానే నివారించవచ్చు. అలాగే ఈ సమస్యలన్నింటినీ మీ భాగస్వామితో బహిరంగంగా చర్చించడం వల్ల మీ ఇద్దరి మధ్య నమ్మకాన్ని పెళ్లికి ముందే ఇంకా బలోపేతం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లికి ముందే కాబోయే దంపతులు ఆరోగ్యంగా ఉన్నారని ఒకరికి ఒకరు తెలుసుకుంటే అలాంటి వారి జీవితాలు సుఖసంతోషాలతో చాలా సాఫీగా సాగిపోతుంది.

పెళ్లికి ముందు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి?
వివాహానికి ముందు మీ వైద్యునితో వ్యక్తిగతంగా చర్చించడం మంచిది. మీరు లైంగికంగా ఆరోగ్యంగా ఉన్నారా?, మీ రక్తంలో ఏమైనా సమస్య ఉందా?, లేక మీ శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆరోగ్యపరంగా ఇంతకు ముందే ఏమైనా నష్టం జరిగిందా?, మీరు గతంలో చేసిన ఏదైనా శస్త్రచికిత్స వలన భవిష్యత్తులో మీకు ఏమైనా సమస్యలు వస్తాయా ?, మీరు మీ కుటుంబాన్ని ప్రభావితం చేసే జన్యుపరమైన వ్యాధితో ఏమైనా బాధపడుతున్నారా? అని తెలుసుకుని పెళ్లికి ముందే ఆ సమస్యలను నివారించుకోవడానికి చక్కటి అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
అలాంటి సమస్యలు ఉంటే పెళ్లికి ముందుగానే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటూ మీరు వాటన్నింటినీ వైద్యులతో చర్చించాలి. ఇలాంటి గందరగోళాలన్నింటినీ పరిష్కరించడానికి పెళ్లికి ముందే వివిధ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ మీకు సలహా ఇవ్వవచ్చు. ఆ పరీక్షలన్నీ చేయించుకోవడం ద్వారా మీ ఆరోగ్యంపై స్పష్టమైన క్లారిటీ వస్తుంది.
మరికొందరు ఆసుపత్రికి వెళ్లి వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలనే ఆత్రుతతో ఉంటారు. అటువంటి పరిస్థితిలో మీరు ధైర్యంగా ఉండాలి. పెళ్లి జరిగిపోయిన తర్వాత భయంకరమైన షాక్‌కు గురికావడం కంటే ముందస్తు హెచ్చరిక పొందడం వలన కాబోయే దంపతులకు మేలు జరుగుతుంది. ఈ విధంగా మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. భవిష్యత్తు ఎవరిది అని ఎవరూ నిర్ణయించలేరు అనే విషయాన్ని మీరు ముందుగానే తెలుసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications
